వెంకటేశ్ నాయుడు… వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి బాల్య స్నేహితుడిగా పరిచయమై.. ఏపీ లిక్కర్ స్కాంలో అందరి కంటే కీలక భూమిక పోషించిన వ్యక్తిగా ఇప్పుడు ఓ రేంజిలో ఈయనకు హైప్ వచ్చేసింది. మొన్నటిదాకా ఈయన ముఖం కూడా ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా నిండా ఈయన గారి వింతలు, విశేషాలు, జల్సాలు, నోట్ల కట్టల లెక్కింపులు… అబ్బో ఒకటా, …
Read More »కొడాలి నానిపై మరో కేసు… ఎక్కడో తెలుసా?
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నానిని ఇప్పుడప్పుడే కేసులు వదిలేలా లేవు. ఇప్పటికే నాని ప్రాతినిధ్యం వహించిన గుడివాడ కేంద్రంగా పలు కేసులు నమోదు కాగా…గుండె సంబంధిత వ్యాధి, దానికి చికిత్స, ముంబైలో ఆపరేషన్ తదితర కారణాలతో జైలు నుంచి తప్పించుకున్నారన్న వాదనలు ఉన్నాయి. అయితే తాజాగా నానిపై మరో కేసు నమోదు అయ్యింది. అది కూడా విశాఖపట్నంలో నమోదు కావడం గమనార్హం. …
Read More »వెంకన్న దర్శనంపై నాయుడు వర్సెస్ ఎల్వీఎస్!
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి అంటే ఆ ఇద్దరికీ ఎంత భక్తో మాటల్లో వర్ణించలేం. అలాంటి వారిద్దరి మధ్య ఇప్పుడు స్వామి వారి దర్శనం గురించే వివాదం నెలకొంది. స్వామి వారి దర్శనాన్ని భక్తులకు మరింత వేగిరంగా కల్పించేందుకు శ్రమిస్తున్నామని ఒకరంటే… అది అసాధ్యమని, ఆ తరహా ప్రయత్నాలు మానుకోవాలని, అవన్నీ కూడా వృథా ప్రయత్నాలేనని మరొకాయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక శీఘ్ర దర్శనంపై కసరత్తు చేస్తున్న …
Read More »మీరు పెట్టే చేపల కూర తినడానికి రాలే: మంత్రి పై మల్లు రవి ఫైర్
తెలంగాణ మంత్రి జూపల్లి కృష్నారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేత, ఎంపీ మల్లు రవి కూడా హాజరయ్యారు. అయితే.. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో జరిగిన ఓ చిన్న ఘటన.. ఆయనను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దండు నరసింహ అనే కార్యకర్త.. వేదికపైకి వచ్చి.. మైకులో ప్రసంగిస్తున్న మల్లు రవికి ఓ కాయితం అందించారు. …
Read More »అయితే.. ఏమైతది?: కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా.. ఈ వ్యవహారంపై నాంపల్లి కోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులపై మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్లు చేశారు. ‘అయితే.. ఏమైతది!’ అని ప్రశ్నించారు. అంతేకాదు, ‘మీరు(మీడియా) చేస్తున్న హడావుడే ఎక్కువగా ఉంది. కోర్టు కాగ్నిజెన్స్(ఆధారాలు) తీసుకోమని చెప్పి రెండు రోజులైతంది. మీరు గిప్పుడు రాసిన్రు.. ఏమైతది?.. ఏమైతది? రాయండి.’ అని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు అనంతరం.. మీడియాతో మాట్లాడిన …
Read More »కేంద్ర మంత్రిగా ఉన్నా లేకున్నా: బండి సంచలన వ్యాఖ్యలు
“కేంద్ర మంత్రిగా ఉన్నా లేకున్నా నేను మారను. నేను ప్రజల మనిషిని. నాపై వచ్చే అవాస్తవాలను ప్రచారం చేయొద్దని కోరుతున్నా” అని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన చొప్పదండి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత వారం రోజులుగా బండి సంజయ్‌పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రస్తావించారు. కేంద్ర మంత్రి పదవి నుంచి తనను …
Read More »వివాదంలో జనసేన ఎంపీ పేరు తో మోసం
ఏపీలో జనసేన పార్టీ తరఫున ఇద్దరు నాయకులు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. వీరిలో మచిలీ పట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. అయితే.. బాలశౌరి ఇప్పుడు వివాదంలో చిక్కుకు న్నారు. ఎంపీ లెటర్ హెడ్లు, అప్పాయింట్‌మెంటు లెటర్లను నకిలీవి సృష్టించి.. ఆయన వ్యక్తిగత కార్యదర్శి గోపాల్ సింగ్ సుమారు 60-70 మంది నిరుద్యోగుల నుంచి కోటిన్నర రూపాయల వరకు మోసగించినట్టు …
Read More »సమంత విషయంలో కొండా సురేఖ పై కేసు పెట్టండి: కోర్టు
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టాలని నాంపల్లి కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తే తామే జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌పై మంత్రి సురేఖ గత ఏడాది సెప్టెంబర్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను అప్పట్లోనే ఖండించిన కేటీఆర్ ఆమెపై పరువు నష్టం దావా వేస్తానని …
Read More »రేప్ కేస్: మాజీ ప్రధాని మనవడికి జీవిత ఖైదు!
భారత దేశ చరిత్రలో మునుపెన్నడూ కనీ వినీ ఎరుగని విధంగా ఓ మాజీ ప్రధాని మనవడికి జీవిత ఖైదు పడింది. ఆయనే మాజీ ప్రధాన మంత్రి, కర్ణాటకకు చెందిన దేవెగౌడ మనవడు, మాజీ మంత్రి రేవణ్ణ పెద్దకుమారుడు, మాజీ ఎంపీ ప్రజ్వల్. ఇంట్లో వంట మనిషిపై పలు మార్లు అత్యాచారం చేసిన కేసులో ప్రజ్వల్‌ను దోషిగా తేలుస్తూ.. బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టు.. శుక్రవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. తాజాగా …
Read More »ఆటో మ్యుటేషన్ తో అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్
ఏపీలో ఏదైనా స్థలం లేదా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఒక యుద్ధం చేసినట్లే. రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ పడిగాపులు కాయడం…గంటల కొద్దీ జనం వేచి ఉండడం సర్వసాధారణం. అయితే, ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. పాస్ పోర్టు దరఖాస్తుకు స్లాట్ బుకింగ్ తరహాలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కూ స్లాట్ బుకింగ్ విధానం కొద్ది రోజుల క్రితం …
Read More »ఇకపై తిరుమలలో రీల్స్ చేస్తే…
దేశంలోని హిందువులకు పరమ పవిత్రమైన తిరుమలలో ఎన్నో ఆంక్షలు ఉన్నప్పటికీ.. వాటిని మీరి హద్దులు దాటి ప్రవర్తించే వాళ్లు చాలామందే ఉంటారు. అందులోనూ సోషల్ మీడియా కాలంలో పరిమితులు తెలియకుండా ప్రవర్తించే వాళ్లకు కొదవే లేదు. రీల్స్, షార్ట్స్ ద్వారా పాపులర్ కావడం కోసం తిరుమల ఆలయం ముందు.. మాడ వీధుల్లో వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. రోజు రోజుకూ ఈ వేషాలు శ్రుతి …
Read More »రెడ్లలో సింపతీ ఎందుకు రాలేదు…
సహజంగానే రాజకీయాలు సామాజిక వర్గాలకు అనుకూలంగా మారాయి. ఎవరు కాదన్నా.. ఔనన్నా.. సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అంటే.. వైసీపీ, కమ్మ వర్గం అంటే టీడీపీ అనుకునే పరిస్థితి దశాబ్దంన్నర నుంచి కనిపిస్తోంది. అయితే.. కమ్మ సామాజిక వర్గంలో ఉన్న ఐక్యత.. రెడ్డి వర్గంలో కనిపించడంలేదు. 2019 ఎన్నికలకు ముందు రెడ్డి వర్గం ఏకమైంది. కానీ.. తర్వాత.. జగన్ తమకు ఏమీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates