అంద‌రిదీ ఒకే మాట‌.. ‘స్క్రిప్టు’ రాసిందెవ‌రు?

ఔను.. నెల్లూరు జిల్లా కందుకూరులో జ‌రిగిన మృత్యు హేల‌పై వైసీపీ నాయ‌కులు అంద‌రిదీ ఒకే మాట‌. మంత్రులు మూకుమ్మ‌డిగా చెబుతున్న మాట‌.. చేస్తున్న ఆరోప‌ణ‌.. ‘చంద్ర‌బాబుకు ప‌బ్లిసిటీ పిచ్చి ప‌ట్టింద‌ని!’- మ‌రోవైపు.. సీఎం జ‌గ‌న్‌మాత్రం ఢిల్లీలో ఉండి.. సంతాపం ప్ర‌క‌టించారు. మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం కూడా ప్ర‌క‌టించారు.

కానీ, మంత్రుల నుంచి నాయ‌కుల వ‌ర‌కు వ‌రుస పెట్టి మాత్రం చంద్ర‌బాబుపై నిప్పులు చెరుగుతున్నారు. నిజానికి ఇది విమ‌ర్శ‌ల‌కు స‌మ‌య‌మా? ‘రేపంటూ మ‌న‌కు కూడా ఒక రోజు ఉంటుంది!’ అన్న‌ట్టు.. రాజ‌కీయాల్లో ఏదీ ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు.. ఏదీ ఎవ‌రూ.. రాసిపెట్టుకునీ లేరు. స‌భలు, స‌మావేశాల్లో ఇలాంటివి జ‌ర‌గ‌డం దురదృష్ట‌క‌ర‌మే అయినా.. రాజ‌కీయం చేయ‌డం స‌రికాద‌నేది తెలియ‌దా?!

మంత్రి రోజా నుంచి తానేటి వ‌నిత వ‌ర‌కు మేరుగ నుంచి కాకాని గోవ‌ర్ధ‌న్‌రెడ్డి వ‌ర‌కు.. దాదాపు 8 మంది మంత్రులు ఒకే మాట‌గా.. చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. అయితే.. ఈ స్క్రిప్టు రాసిందెవ‌రు? అనేది ఇప్పుడు వైసీపీలోనే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాడేప‌ల్లి వ‌ర్గాల్లోనూ.. విస్మ‌యంగా ఉంది. ఎవ‌రైనా.. విమ‌ర్శించాలంటే.. వేర్వేరుగా విమ‌ర్శ‌లు ఉంటాయి. కానీ, ప‌నిగ‌ట్టుకుని ఒకే విమ‌ర్శ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇది ఉద్దేశం పూర్వ‌కంగా.. తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి వ‌స్తున్న సూచ‌న‌ల మేర‌కు నేత‌లు రెచ్చిపోతున్నార‌ని.. కానీ, స‌రికాద‌నేది మేధావుల మాట‌. ఈరోజు బాబు.. రేపు ఎవ‌రైనా.. అనే ప‌రిస్థితి ఉంటుంద‌ని.. కావాల‌ని.. చేసింది కాద‌ని చెబుతున్నారు. మొత్తానికి ఏపీలో కందుకూరు ర‌గ‌డ‌.. టీడీపీలో విస్మ‌యాన్ని.. విషాదాన్ని మిగిలిస్తే… ఇంత‌కు మించిన ఛాన్స్ రాద‌న్న‌ట్టు వైసీపీలో చ‌ర్చ‌సాగుతోంది.