ఏపీలో కాపు సామాజిక వర్గం కేంద్రంగా YCP నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వింతగొలుపుతున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని.. కాపోడు ముఖ్యమంత్రి అయితే.. అవనివ్వండి! అని వ్యాఖ్యానించిన రెండో రోజే మంత్రి అంబటి రాంబాబు అదే సామాజిక వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపులంతా కలిసి పవన్ నేతృత్వంలో చంద్రబాబు దగ్గర ఊడిగం చేయండి.. అని తీవ్ర విమర్శలు గుప్పించారు.
“గతంలో చంద్రబాబును నమ్మారు.. ఇప్పుడు పవన్‌ను గోకుతున్నారు. గోకి గోకి.. మళ్లీ వెళ్లి బాబు కాళ్ల దగ్గర చాకిరీ చేయిండి” అని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
Chandrababuకు ఊడిగం చేస్తున్న పవన్ దగ్గర ఉంటారో.. జగన్ రెడ్డి ని నమ్ముకున్న Ambati వెంట ఉంటారో కాపులు తేల్చుకోవాలని సూచించారు. పవన్‌పై మరింత జోరుగా అంబటి విరుచుకుపడ్డారు. బుద్ధి.. జ్ఞానం లేని Pawan kalyanకు రాజకీయాలు ఏం తెలుసు అని ప్రశ్నించారు. వైసీపీని మళ్లీ అధికారంలోకి రానివ్వను.. ఓట్లు చీలనివ్వను అంటాడు.. అంత పెద్ద మగాడా పవన్ అంటూ చెలరేగిపోయారు. “కాపులంతా మా పవన్.. మా పవన్ అంటూ గోక్కుంటున్నారు. గోక్కుని.. గోక్కుని చంద్రబాబు దగ్గర పవన్‌తో కలిసి చాకిరి చేయండి” అంటూ మండిపడ్డారు.
ఒక్కచోట కూడా గెలవలేని పవన్ తనపై ఆరోపణలు చేస్తాడా? అంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కాళ్ల మీద పడి పవన్‌ను ఏడవమనండి అని రుసరుసలాడారు. వైసీపీలో తాను విమర్శించినంత ఘాటుగా పవన్‌ను ఎవరూ విమర్శించరని చెప్పారు. అందుకే తనను టార్గెట్ చేసుకొని పవన్ ఆరోపణలు చేస్తున్నాడంటూ ఫైరయ్యారు.
కాపులను చంద్రబాబు దొడ్లో కట్టేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. తాను ఒక్కపైసా ఆశించానా? అయినా కూడా తనపైనే ఆరోపణలు చేస్తాడా..? అంటూ పవన్‌కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర పరుషపదజాలంతో ఊగిపోయారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates