రాయపాటి సాంబశివరావు… ఆ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. కాంగ్రెస్, టీడీపీలో ఆయన హవా కొనసాగింది. ప్రజల మనిషిగా ఆయనకు మంచి పేరే ఉంది. అడిగిన వారికి కాదనకుండా సాయం చేస్తారన్న ట్రాక్ రికార్డు ఉంది. ఓడిపోతూ, గెలుస్తూ రాజకీయాలు చేసే గుంటూరు, నరసరావుపేట మాజీ ఎంపీ గత ఎన్నికల్లో మాత్రం పరాజయం పాలయ్యారు. ఇంకేముందు వయోభారంతో రాజకీయాలను నుంచి తప్పుకుంటున్నారన్న ప్రచారం జరిగింది. రెండు సంవత్సరాలు మౌనంగా …
Read More »కసితీరా మాట్లాడిన తమిళిసై
మేడమ్ సార్ కి చాలా రోజుల నుంచి తెలంగాణ సీఎం అంటే ఆగ్రహం. ఇరగదీద్దామన్న ఆవేశం కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్నా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె మౌనం వహిస్తుంటారు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్స్ పెట్టి తన మంచితనాన్ని చెప్పుకుంటుంటారు. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే చర్యల్లో భాగంగా ఫైళ్లు తొక్కిపెడతారు. ఇప్పటికే ఏడెనిమిది పైళ్లు రాజ్ భవన్లో చెదలు పట్టుకుని ఉన్నాయి. ఆమె తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌదరరాజన్. రిపబ్లిక్ దినోత్సవం రోజున …
Read More »మోడీ పద్మ వ్యూహం.. గమనించారా…!
కొన్ని కొన్ని విషయాలు.. చూసేందుకు చాలా బాగుంటాయి. వినేందుకు ఇంకా బాగుంటాయి. కానీ, వాటి మాటున అసలు సిసలు రాజకీయం దాగి ఉంటుందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కూడా.. ఇదే రాజకీయ వ్యూహాన్ని చాలా మెత్తగా.. కమ్మగా.. ఆవిష్కరించింది. పైకి ఎంతోమెప్పుగా కూడా ఉన్న ఈ వ్యూహం ఫక్తు.. తన స్వలాభానికేనన్న విషయం సుస్పష్టం. తాజాగా రెండుతెలుగు రాష్ట్రాలకు భారీ ఎత్తున పద్మ అవార్డులు …
Read More »రాక్షస పాలన అంతానికే వారాహి తెచ్చాము
బెజవాడలోని దుర్గమ్మ సన్నిలో పవణ్ కళ్యాణ్ తన ప్రచార రథం వారాహికి వేద మంత్రాల నడుమ పూజలు జరిపించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో పవన్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పయనంలో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రరాష్ట్రంగా ఉండాలని అన్నారు. గుడిలో రాజకీయాలు మాట్లాడనని స్పష్టం చేసిన ఆయన రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించడమే వారాహి లక్ష్యం అని మాత్రం చెప్పారు. …
Read More »ఏంటి బాలయ్యా! ఇది.. చంద్రబాబు అసంతృప్తి?
నందమూరి బాలకృష్ణ నోటి దురుసుతనం తెలుగుదేశం పార్టీకి కొత్త ఇబ్బంది తెచ్చిపెట్టింది. ఎన్నికలకు ముందు పార్టీకి అన్నీ అనుకూలంగా మారుతున్నాయనుకుంటున్న తరుణంలో కొన్ని వర్గాలకు కోపం వచ్చేలా బాలయ్య వ్యాఖ్యలు చేయడంపై పార్టీ అధినేత చంద్రబాబు కూడా అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో మాట్లాడిన బాలయ్య ‘ఆ రంగారావు, ఈ అక్కినేని తొక్కినేని’ అంటూ మాట్లాడడం.. దానికి అక్కినేని కుటుంబానికి చెందిన నాగచైతన్య, అఖిల్‌లు ట్విటర్ వేదికగా …
Read More »బీజేపీ అధిష్టానంపై కన్నా గేమ్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కొత్త గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారు. అధిష్టానంపై వత్తిడి తేచ్చే ప్రక్రియను మరింత పటిష్టం చేశారాయన. ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గం భేటీకి ఆయన వెళ్లలేదు. ఢిల్లీ వెళ్లకుండా తిరుపతి కొండ ఎక్కారు. భీమవరంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గం భేటీకి కూడా కన్నా హాజరు కాలేదు. ఎందుకు వెళ్లలేదో తర్వాత చెబుతానంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. అనుచరుల హల్ చల్కన్నా అనుచరులు ఇప్పుడు …
Read More »సైకిల్ కి కమలం దూరం..దూరం..
భీమవరం సమావేశంలో బీజేపీ ఒక అనధికారిక డిక్లరేషన్ ఇచ్చేసింది. ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదని తేల్చేసింది. టీడీపీ, వైసీపీకి సమదూరం పాటిస్తామని రాష్ట్ర కార్యవర్గం సాక్షిగా జాతీయ నేతలు ప్రకటించేశారు. దీనితో ఇప్పుడు కమలంతో దోస్తీపై తేల్చుకోవాల్సిన అనివార్యత పవన్ కల్యాణ్ పై పడింది.. పార్టీలో రెండు వర్గాలు ఏపీలో బీజేపీ అంత బలమైన పార్టీ ఏం కాదు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. …
Read More »వేగంగా మారుతున్న ఏపీ పొలిటికల్ సీన్
ఏపీలో రాజకీయ పవనాలు మారుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి సీమ వరకు కూడా పార్టీల పరిస్థితి మారు తోందనే సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం కుటుంబాల్లోనే ఈ చర్చ సాగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా వైసీపీ, టీడీపీలు వ్యక్తిగతంగా చేయించుకున్న సర్వేల్లోనూ ఈ మార్పు సంకేతాలు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ది లేదనే విషయం పెద్ద ఎత్తున ప్రజల మధ్య చర్చకు వస్తోంది. అదే సమయంలో ప్రజలు కూడా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయారు. …
Read More »విశాఖలో కేసీఆర్, జగన్ కలుస్తారా లేదా?
బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ తెలంగాణ దాటి రాజకీయాలు ప్రారంభించినా ఇంతవరకు ఆయన పాత మిత్రుడు జగన్‌ను మాత్రం కలవలేదు. త్వరలో ఆ ముచ్చటా తీరబోతోందంటున్నారు రెండు పార్టీలకు చెందిన నేతలు. ఈ నెల ఆఖరులో విశాఖలో కేసీఆర్, జగన్ ఒకే వేదికలో కలవొచ్చని చెప్తున్నారు. విశాఖ శారద పీఠంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు జగన్, కేసీఆర్ ఇద్దరికీ ఆహ్వానాలు అందాయి. దీంతో ఇద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంటున్నారు. జనవరి 27 …
Read More »కిక్కిరిసిన కొండగట్టు.. పవన్ యాత్ర షురూ!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. యాత్రకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వారాహి వాహనానికి తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేయించారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చూసేందుకు అభిమానులు, పార్టీ నేతలు పోటెత్తారు. జనసైనికులు భారీ కాన్వాయ్‌తో రాగా పవన్ అంజన్న సన్నిధికి చేరుకున్నారు. జనసేనాని ప్రచార రథం వారాహికి …
Read More »జగన్ అసమర్థ ముఖ్యమంత్రి.. ఎవరన్నారో తెలుసా?
ఏపీ సీఎం జగన్‌ను ఆయన పార్టీ పరివారం, అనుకూల మీడియా సైతం ఆయనను ఆకాశానికి ఎత్తేస్తున్న పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. అంతేకాదు.. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా పుణికి పుచ్చుకుంటున్నాయని, ఆదర్శవంతమైన రాష్ట్రం అంటూ..ఏపీని పొగడ్తలతో ముంచెత్తుతున్నాయ ని.. పెద్ద ఎత్తున భజనచేస్తున్నవిషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ భజనకు..పొగడ్తలకు భిన్నంగా కేంద్ర మంత్రి ఒకరు స్పందించారు. ఏపీలో అసమర్థ పాలన సాగుతోందని కేంద్ర మంత్రి దేవుసిన్హ్ …
Read More »బిగ్ బ్రేకింగ్: అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం రెడీ
వైసీపీ ఎంపీ, యువ నాయకుడు, సీఎం జగన్‌కు తమ్ముడు వరుస అయ్యే.. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఇప్పటికే ఆయనకు నోటీసులు స్వయంగా అందించింది. విచారణకు రావాలని .. కోరింది. అయితే, ఆయన మాత్రం ఐదు రోజుల పాటు గడువు కోరారు. ఇది.. ఇప్పటి వరకు తెలిసిన విషయం. అయితే.. విదేశాలకు వెళ్లిపోయే ప్రయత్నంలో ఉన్నారని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates