జ‌గ‌న్ డిగ్రీ చ‌దివారా? లేదా? షేక‌వుతున్న‌ సోష‌ల్ మీడియా

రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. స్థానిక సంస్థ‌ల కు చెందిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థు లు.. ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌కు కూడా ఎన్నికలు జ‌రుగుతున్నాయి. స్థానిక సంస్థ‌ల త‌ర‌ఫున పోటీ చేసే ఎమ్మెల్సీ అభ్య‌ర్థులను ఆయా స్థానిక సంస్థ‌ల‌కు చెందిన ఎన్నుకోబ‌డిన కౌన్సిల‌ర్లు ఓటు వేసి.. ప్రాధాన్యం క‌ల్పిస్తారు.

ఇక‌, ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌లకు సంబంధించి ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న ప‌ట్ట‌భ ద్రులు.. ఓటేసి ఎన్నుకుంటారు. దీనికి సంబంధించి డిగ్రీ చ‌దివిన వారు.. లేదా.. త‌త్స‌మాన‌వైన అర్హ‌త ఉన్న‌వారు.. కూడా ఎన్నికల క‌మిష‌న్ ద‌గ్గ‌ర న‌మోదై.. ఓటు పొందుతారు. ఇప్ప‌టికే ఈ ప్ర‌క్రియ రాష్ట్రంలో ముగిసింది. ఈ ప‌రంప‌ర‌లో ప్ర‌ధాన పార్టీల నేత‌ల‌ను గ‌మ‌నిస్తే.. సీపీఐ, సీపీఎం నేత‌లు ముందు వ‌రుస‌లో ఉన్నారు.

ఎక్కువ‌గా ఓట్లు ద‌క్కించుకుని(అర్హ‌త‌తోనే) ముందు వ‌రుస‌లో కామ్రేడ్లు నిలిచారు. ఇక‌, టీడీపీలోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు నుంచి నారా లోకేష్ వ‌ర‌కు అంద‌రికీ.. గ్రాడ్యుయేట్ ఓటు హ‌క్కు ల‌భించింది. రేపు వినియోగించుకుంటారా లేదా? అనేది వారి ఇష్టం. ఇక‌, ఎటొచ్చీ.. ఇప్పుడు సీఎం జ‌గ‌న్ చుట్టూ.. రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. ఆయ‌నకు ఇప్ప‌టి వ‌ర‌కు సాధార‌ణ ఓటు హ‌క్కే త‌ప్ప‌.. గ్రాడ్యుయేట్ ఓటు హ‌క్కులేదు.

దీంతో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ..చాలా మంది నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌.. ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్‌లో చ‌దివాన‌ని చెబుతారు కానీ, తాను ఏం చ‌దివిందీ మాత్రం వెల్ల‌డించ‌లేదు. ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లోనూ తొల‌గించారు. ఇక‌, టీడీపీ నేత నారా లోకేష్ జ‌గ‌న్‌ను ప‌దోత‌ర‌గ‌తి త‌ప్పారంటూ.. ఇటీవ‌ల గేలి చేయ‌డం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు ఆయ‌నకు గ్రాడ్యుయేట్ ఓటు హ‌క్కులేక‌పోయేస‌రికి.. మ‌రిన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.