ఐపీఎస్‌ల్లో కాక రేపుతున్న సునీల్ ఇష్యూ…!

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క‌లు వేరు.. ఇక నుంచి జ‌ర‌గ‌బోయే లెక్క‌లు వేరు! అన్న‌ట్టుగా ఉంది. ఏపీలో ఐపీఎస్‌ల ప‌రిస్థితి. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌నే పేరు తెచ్చుకున్నారు. దీని పై విపక్షాలు సైతం.. తీవ్ర నిర‌స‌న‌, ఆందోళ‌న‌ల‌ను చేశాయి. కోర్టుల‌కు కూడా వెళ్లాయి. ఐపీఎస్ అధికారులే వేధిస్తుంటే.. ఎలా? అని ప్ర‌శ్నించాయి. ముఖ్యంగా సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్ వ్య‌వ‌హారం మ‌రింత ఇబ్బందిగా మారింది.

అయితే.. ఎక్కడా కూడా వెన‌క్కి త‌గ్గేదేలా! అంటూ.. ముందుకే వెళ్లారు. త‌న‌ను కొట్టారంటూ.. వైసీపీ ఎంపీ ర‌ఘురామకృష్ణ‌రాజు ఆరోపించారు. ఇక‌, సొంత పార్టీ నేత‌పైనే ఇలా వ్య‌వ‌హ‌రిస్తారా? అంటూ.. ప్ర‌తిప‌క్షాల నుంచి కూడా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇదిలావుంటే.. ఇక‌, విప‌క్ష నేత‌ల‌ను రాత్రి, ప‌గ‌లు అనే తేడా లేకుండా అరెస్టు చేయ‌డం.. ఎవ‌రికి వారిని ఇబ్బందికి గురి చేయ‌డం .వంటివి సునీల్‌ను ఇబ్బందిలోకి నెట్టాయి.

ఈ నేప‌థ్యంలోనే వెల్లువెత్తిన ఫిర్యాదుల నేప‌థ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని చ‌ర్య‌ల‌కు ఆదేశించింది. ఇక‌, ఈ విష‌యం త‌ర్వాత‌. ఇప్పుడు ఐపీఎస్ అధికారులు తీవ్ర త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గుర‌వుతున్నాయి. కిం క‌ర్త వ్యం..? ఏం చేయాలి? ఇప్ప‌టికిప్పుడు మార్పు త‌ప్ప‌ద‌నే అంటున్నారు. ఎందుకంటే.. సునీల్ వ్య‌వ‌హారం చూసిన త‌ర్వాత‌.. మెజారిటీ ఐపీఎస్‌లు మౌనంగానే ఉన్నారు.

ఎలాగంటే.. సునీల్‌ను ప్ర‌భుత్వ‌మే వాడుకుని వ‌దిలేసింద‌నే టాక్ వినిపిస్తోంది. రేపు త‌మ ప‌రిస్థితి ఏంట‌ని కూడా ఐపీఎస్‌లు ఆలోచ‌న చేస్తున్నార‌ని స‌మాచారం. ఇక‌, నుంచి చ‌ట్ట‌ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించేలా త‌మ‌ను తాము తీర్చిదిద్దుకుంటున్నార‌ని కూడా అంటున్నారు. మొత్తానికి ఐపీఎస్‌లలో సునీల్ ఇష్యూ బాగానే కాక రేపుతోంద‌ని అంటున్నారు పరిశీల‌కులు. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల ముంగిట ఏం జ‌రుగుతుందో చూడాలి.