ఓ యువకుడు ఒకేసారి ఇద్దరిని ప్రేమలో దింపాడు. అయితే.. పెళ్లి విషయానికి వచ్చేసరికి ఎవరికి పెళ్లాడాలో మాత్రం అర్థం కాలేదు. దీంతో.. ఆ యువకుడికి గ్రామస్థులే పరిష్కారం చూపించారు. ఆ ఇద్దరు అమ్మాయిల పేరుతో చీటి రాసి.. లాటరీ తీసి.. పెళ్లి చేశారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం హాజన జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హాసన జిల్లా సకలేశపుర సమీపంలోని ఓ …
Read More »#ThankYouRahane ట్రెండింగ్
ఇది సోషల్ మీడియా కాలం. ఈ మాధ్యమంలో చర్చలు ప్రధానంగా సినిమా, క్రికెట్ చుట్టూనే తిరుగుతుంటాయి. ఈ రెండు రంగాల్లో సక్సెస్ సాధించిన వాళ్లను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేస్తారు. ఫెయిలైన వాళ్లను పాతాళానికి తొక్కేస్తారు. రెండు వైపులా పదునుండే సోషల్ మీడియాతో ఉన్న తలనొప్పే ఇది. ఇంగ్గాండ్‌తో రసవత్తరంగా సాగుతున్న టెస్టు సిరీస్‌లో బాగా ఆడిన వాళ్లకు ఇస్తున్న ఎలివేషన్లు మామూలుగా లేవు. అదే సమయంలో పేలవ ప్రదర్శన చేస్తున్న …
Read More »చెప్పి మరీ కొట్టారు.. వీళ్లకు వేయాలి వీరతాడు
‘‘ఐదు స్వర్ణాలు సహా 15 పతకాలు గెలుస్తాం’’.. పారాలింపిక్స్‌కు బయల్దేరే ముందు భారత అథ్లెట్ల బృందం ఉమ్మడిగా చేసిన ప్రకటన ఇది. ఐతే ఇప్పటిదాకా భారత్ పాల్గొన్న అన్ని పారాలింపిక్స్‌లో కలిపి సాధించిన పతకాలు 12 మాత్రమే. అలాంటిది ఈ ఒక్కసారే 15 పతకాలు.. అందులోనూ 5 స్వర్ణాలు గెలుస్తాం అంటుంటే టూమచ్ అనే అనిపించింది చాలామందికి. ఒలింపిక్స్, పారాలింపిక్స్ ముంగిట అథ్లెట్లు ఇలా ఘనంగా ప్రకటనలు చేయడం.. తీరా …
Read More »మరో రికార్డుకు దగ్గర్లో ముకేశ్ అంబానీ
అంతకంతకూ దూసుకెళుతూ ముందుకెళుతున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా మరో రికార్డుకు చేరువయ్యారు. ఆయన వ్యక్తిగత ఆస్తులు 10వేల కోట్ల డాలర్లకు దగ్గరకు రానున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.7.30లక్షల కోట్ల సంపదనకు ఆయన చేరువయ్యారు. మరికాస్త ముందుకెళితే చాలు.. ప్రపంచంలో అతి తక్కువ మందికి సాధ్యమయ్యే పని ఆయనకు సొంతం కానుంది. ఈ హోదాను సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా అంబానీ నిలవనున్నారు. తాజాగా విడుదల చేసిన బ్లూంబర్గ్ …
Read More »కరోనాని జయించినా.. ఈ సమస్య తప్పట్లేదు..!
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారికి ఎంతో మంది బలయ్యారు. కొందరికి కరోనా సోకినా.. ఆ తర్వాత క్షేమంగా బయటపడ్డారు. అయితే.. కరోనా నుంచి కోలుకున్నామని ఆనందపడేలోపే.. కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలా మందికి కిడ్నీ సమస్యలు వస్తున్నట్లు తేలింది. కరోనా …
Read More »ఒకే ఒలంపిక్స్ లో రెండు పతకాలు సాధించిన అవనీ..!
టోక్యో పారా ఒలంపిక్స్ లో.. భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. పతకాల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత మహిళా షూటర్ అవనీ లేఖరా మరోసారి అదరగొట్టారు. ఇటీవల స్వర్ణ పతకం సాధించిన అవని.. తాజాగా జరిగిన మహిళ 50 మీటర్ల రైఫిల్ 3పీ ఎస్‌హెచ్1 ఫైనల్లో మెరుగైన ప్రదర్శన చేశారు. 445.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన అవని లేఖరా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సోమవారం షూటింగ్ …
Read More »మరో కొత్త కరోనా వేరియంట్.. మూ(mu)..!
కరోనా మహమ్మారి కి అంతం లేకుండా పోతోంది. రోజుకో కొత్త వేరియంట్ పుట్టుకొస్తోంది. c.1.2 గా పిలిచే ఓ వేరియంట్ ఇటీవల వెలుగులోకి రాగా.. తాజాగా మరో కొత్త వేరియంట్ బయటపడింది. తాజాగా.. ‘మా’(mu) వేరియంట్ ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య శాఖ వెల్లడించడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో కొలంబియాలో ఈ వేరియంట్ బయటపడినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూను వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ గా గుర్తించినట్లు ప్రపంచ …
Read More »కోహ్లీపై మరోసారి రూట్ దే పైచేయి
ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత జట్టు రథసారధి విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో కోహ్లీ కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేయడం, అదే సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రికార్డు స్థాయిలో మూడు సెంచరీలు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే టెస్టు సిరీస్ లో కోహ్లీపై పై చేయి సాధించిన జో …
Read More »వర్క్ ఫ్రం హోంపై వెనక్కి తగ్గిన గూగుల్..
అంతా బాగున్నట్లే ఉంటుంది. ఫర్లేదు.. పరిస్థితులు చక్కబడుతున్నాయన్నంతనే మరో కొత్త వేరియంట్ విరుచుకుపడటం.. అప్పటివరకు ఉన్న ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారితో ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ప్రపంచం మొత్తం ఎదుర్కొంటోంది. దీంతో.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వర్కు ఫ్రం హోం పేరుతో ఐటీ కంపెనీలు నిర్ణయం తీసుకోవటం.. కరోనా నేపథ్యంలో గడిచిన ఏడాదిన్నరగా ఇలాంటి …
Read More »గ్రేట్ బౌలర్.. టాటా వీడుకోలు
అంతర్జాతీయ క్రికెట్లోకి చాలామంది వస్తారు. వెళ్తారు. కానీ తాము వెళ్లిపోయాక కూడా తమను కొన్ని తరాలు గుర్తుంచుకునే గొప్ప ప్రదర్శన చేసే ఆటగాళ్లు కొందరే ఉంటారు. అలాంటి అతి కొద్దిమంది ఆటగాళ్లలో ఒకడైన డేల్ స్టెయిన్.. క్రికెట్ మైదానానికి టాటా చెప్పేశాడు. 38 ఏళ్ల ఈ దక్షిణాఫ్రికా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ అన్ని రకాల క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మేటి ఫాస్ట్ బౌలర్లలో …
Read More »భారత్‌కు షాక్.. పారాలింపిక్స్‌లో పతకం వెనక్కి
పారాలింపిక్స్‌లో మన అథ్లెట్లు పతకాల మీద పతకాలు గెలుస్తున్న వేళ.. ఒక పెద్ద షాక్. భారత్‌కు దక్కిన ఒక కాంస్య పతకాన్ని నిర్వాహకులు వెనక్కి తీసుకున్నారు. ఆదివారం జరిగిన డిస్కస్ త్రో పోటీల్లో మూడో స్థానం సాధించి కాంస్యం గెలిచిన భారత క్రీడాకారుడు వినోద్ కుమార్‌ను నిర్వాహకులు అనర్హుడిగా ప్రకటించారు. అతను 19.1 మీటర్లు డిస్కస్‌ను విసిరి తాను పోటీ పడ్డ ఎఫ్-52 విభాగంలో మూడో స్థానంలో నిలిచాడు. ఐతే …
Read More »భార్య చితిలో దూకి ప్రాణార్పణం చేసిన భర్త..!
ఒకప్పుడు.. భర్త చనిపోతే.. అతని చితిలోనే బలవంతంగానైనా భార్యను కూర్చోపెట్టి దహనం చేసేవారు. దానిని సతీ సహగమనం అనేవారు. ఆ తర్వాత కాల క్రమేనా ఆ మూఢ నమ్మకాన్ని అందరూ వదిలేశారు. అయితే.. తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అయితే.. కొంచెం రివర్స్. ఇక్కడ చనిపోయింది భర్త కాదు.. భార్య. తనకు భార్య పై ఉన్న అమితమైన ప్రేమను ఆ వ్యక్తి ఇలా ప్రాణార్పణం చేసి అందరికీ చాటిచెప్పాడు. …
Read More »