Trends

ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో ‘ఏటికొప్పాక’ వైభవం

భారత 76వ గణతంత్ర వేడుకలు ఆదివారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు దేశ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఎగురవేయగా… ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రుల, విపక్ష నేతలు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలను తిలకించారు. ఈ సందర్బంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఢిల్లీకి వచ్చిన …

Read More »

సింగర్ తో సిరాజ్.. గాసిప్స్ లో నిజమెంత?

బాలీవుడ్ ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో సిరాజ్ తో క్లోజ్ గా ఉన్నారన్న వార్తలు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం జనై భోస్లే ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలలో సిరాజ్‌ను హైలెట్ చేయడమే. ఇటీవల జనై భోస్లే తన పుట్టిన రోజు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అందులో సిరాజ్‌తో ఆమె క్లోజ్‌గా ఉన్న ఫొటో హైలెట్ అయ్యింది. …

Read More »

కోహ్లీ రికార్డు కూడా కొట్టేసిన తిలక్

భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ మరోసారి తన అద్భుతమైన ఆటతీరుతో అందరి ప్రశంసలను అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఉత్కంఠభరిత విజయం సాధించడంలో తిలక్ కీలక పాత్ర పోషించాడు. అతడి 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్ భారత విజయానికి బలమైన ఆధారంగా నిలిచింది. ఈ ప్రదర్శనతో తిలక్ అరుదైన రికార్డును సొంతం చేసుకొని, టీమిండియాలో తన స్థానాన్ని మరింత బలపరచుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఔట్ …

Read More »

‘పద్మ’ పురస్కారాలను అందుకోనున్న తెలుగువారు వీరే…

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబరచిన వారికి పద్మ అవార్డులను కేంద్ర ప్రభత్వం ప్రకటించిది. ఈ మేరకు శనివారం రాత్రి పద్మ అవార్డుల గ్రహీతల పేర్లను కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో భారత రత్న తర్వాత అతున్నత పౌర పురస్కారంగా పరిగణిస్తున్న పద్మ విభూషణ్ అవార్డులకు తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులు దువ్వూరు నాగేశ్వరరెడ్డితో పాటు మరో ఆరుగురు ఎంపికయ్యారు. ఇక నందమూరి నటసింహం, …

Read More »

బిచ్చం వేసిన వ్యక్తిపై కేసు.. ఇండోర్ పోలీసుల తీరుతో షాక్!

కొత్త చట్టాల్ని చేసినప్పుడు.. వాటికి సంబంధించిన ప్రచారం పెద్ద ఎత్తున జరగాలి. అదేం లేకుండా.. చట్టం చేశాం.. మీకు తెలీదా? అంటూ కేసులు నమోదు చేసే పోలీసులు కొందరుంటారు.ఆ కోవలోకే వస్తుంది ఇండోర్ పోలీసుల తీరు చూస్తే.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరాన్ని యాచక రహిత నగరంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇండోర్ అధికార యంత్రాంగం బిచ్చం వేయటాన్ని నిషేధిస్తూ.. పలువురు బిచ్చగాళ్లను పునరావాస కేంద్రాలకు తరలించారు. …

Read More »

ఇదో కొత్త రకం దోపిడీ!… ఒలా, ఉబెర్ లకు కేంద్రం నోటీసులు!

ప్యాపారుల మంత్రం ధనార్జనే. అందులో తప్పేమీ లేదు. అయితే జనం లైఫ్ స్టైల్ ఆధారంగా ఇష్జారాజ్యంగా ఆర్జించడమే దోపిడీ. మొన్నటిదాకా ఒకే వస్తువును రెండు రకాల ధరలకు విక్రయించేవారు. అయితే అందుకు వారు వినియోగించుకున్న మార్గం… పేదలు,. ధనికులు నివసించే ప్రాంతాలను ఆధారంగా చేసుకుని ఈ దందాను సాగించారు. మొన్నామధ్య ఈ మంత్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన ఓ ఆన్ లైన్ సెల్లింగ్ సంస్థ.. కస్టమర్లు వాడే సెల్ ఫోన్ …

Read More »

కారుపై మీడియా లోగో… లోపలంతా గంజాయి బస్తాలే

అసలే గంజాయిపై ఏపీలోని కూటమి సర్కారు యుద్ధమే ప్రకటించింది. ఫలితంగా ఎక్కడికక్కడ పోలీసులు వాహనాల తనిఖీలు కొనసాగిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను నడిరోడ్డుపై నిలిపేసి క్షుణ్ణంగా తనీఖీలు చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కడికక్కడ పోలీస్ చెక్ పోస్టులు వెలిశాయి. ఏ ప్రధాన రహదారిని చూసినా ఈ చెక్ పోస్టులే దర్శనమిస్తున్నాయి. ఎంత నిర్బంధమున్నా… కేటుగాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతూ ఉంటారు కదా. అదేదో పుష్ఫ సినిమాలో పాల వ్యాన్ లో ఎర్రచందనాన్ని …

Read More »

హైద‌రాబాద్‌లో భార్య‌ను చంపి.. కుక్క‌ర్‌లో ఉడికించాడు!

ఎక్క‌డో ఢిల్లీలో రెండేళ్ల కింద‌ట ప్రియురాలిని చంపి.. ముక్క‌లు చేసి ఫ్రిజ్‌లో పెట్టి.. విడ‌త‌ల వారీగా వాటిని అడ‌విలో విసిరేసిన ఘ‌ట‌న దేశం మొత్తాన్ని క‌ల‌చి వేసింది. క‌దిలించేసింది. దీనిపై అనేక మంది బుగ్గ‌లు నొక్కుకున్నారు. ఇంత దారుణం చేస్తారా? అని త‌ల ప‌ట్టుకున్నారు. కానీ, ఇప్పుడు మ‌న హైద‌రాబాద్‌లోనే అచ్చంగా ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగితే!.. ఆశ్చ‌ర్యం కాదు నిజం. మాట‌ల‌కంద‌ని ఘోరం మీర్ పేట‌లో చోటు చేసుకుంది. క‌ట్టుకున్న …

Read More »

మెనాలిసా వజ్రాన్ని వెలికి తీసిందెవరు?

యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి హాట్ టాపిక్ గా మారింది. అడవి మల్లెలాంటి అందంతో అందరిని ఆకట్టుకోవటమే కాదు.. సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ పాపులర్ అయ్యింది. ఆమెకు సంబంధించిన ఫోటోల్ని జాతీయ.. అంతర్జాతీయ మీడియా మొదలు సోషల్ మీడియాలో తెగ పాపులర్ అవుతున్నాయి. ఆమె ఫోటోల్ని పోస్టు చేస్తే చాలు.. సోషల్ మీడియా …

Read More »

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు. అదే సమయంలో బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ కూడా ఉండాలండోయ్. ఆ రెండూ ఉంటే… చేతిలో చిల్లగవ్వ లేకుండానే ప్రపంచాన్నే చుట్టేయొచ్చు. ఇప్పుడు ఆ బ్యాంకులో బ్యాలెన్స్ కూడా అవసరం లేదు… చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు అనే పరిస్థితి వస్తోంది. ఆ బ్యాంకు బ్యాలెన్స్ …

Read More »

ప్రాణాలు కాపాడుకుందామని రైలు నుంచి దూకితే.. మరో రైలు గుద్దేసింది

బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ బతుకు పోరాటమే. ఎంత బతుకు పోరాటమైనా ప్రాణాలు ఉంటేనే కదా. నిజమే… మేనిలో ప్రాణం ఉంటేనే కదా… ఎంతటి బతుకు పోరాటమైనా ముందుకు సాగేది. ఎవరి ఆలోచనల్లో వారు అలా ముందుకు సాగుతూ ఉండగా… వారు ప్రయాణిస్తున్న రైలుతో అగ్ని కీలలు ఎగసి పడుతున్నాయంటూ ఓ పుకారు వారిని …

Read More »

ఎంపీలో ఘోరం!… శోభనానికి ముందు కన్యత్వ పరీక్ష!

దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ పురుష సమాజం మాత్రం ఇంకా కారు చీకట్లోనే ఉండిపోతానంటోంది. ఈ మాట నిజమేనన్నట్టుగా మధ్య ప్రదేశ్ లో ఓ దారుణం వెలుగు చూసింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ దారుణంపై బాధిత మహిళ నోరు విప్పి న్యాయం కోసం పోరాటం చేసేందుకే ఏళ్ల సమయం పట్టిందంటే… పరిస్థితులు ఇంకా …

Read More »