Trends

వారంలో 4 రోజులే పని..ప్రపంచానికే మోడలవుతుందా ?

ఉద్యోగులు, కార్మికులకు సంబంధించి పనిగంటల విషయంలో ఐస్ ల్యాండ్ ప్రపంచదేశాలకు కొత్త మోడల్ గా అవతరించబోతోందా ? మానసిక శాస్త్రవేత్తలు, నిపుణుల లెక్కల ప్రకారం అవుననే సమాధానం వినబడుతోంది. పనిగంటలు తగ్గించటం, పనిదినాల్లో మార్పులు చేసే విషయంలో ఐస్ ల్యాండ్ లో నాలుగేళ్ల పాటు జరిగిన ప్రయోగాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. దాంతో ఐస్ ల్యాండ్ లో జరిగిన ప్రయోగాలను తెలుసుకునే విషయంలో ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. …

Read More »

వారం వ్యవధిలో జరిగిన బిగ్ సేల్ లెక్క వింటే దిమ్మ తిరగాల్సిందే

పెద్ద పండగ్గా చెప్పుకునే దసరాకు బిగ్ సేల్ పేరుతో ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్.. ఫ్లిప్ కార్ట్ లు పోటాపోటీగా నిర్వహించే స్పెషల్ సేల్ లో రికార్డు స్థాయి అమ్మకాలు జరిగాయి. మొత్తం నెల పాటు సాగే ఫెస్టివల్ సేల్ లో మొదటి వారంలోరికార్డుస్థాయి అమ్మకాలు జరగటం విశేషం. గత ఏడాది కరోనా కారణంగా అమ్మకాలు మందకొడిగా సాగగా.. ఈసారి ఆ లోటును పూడ్చేసేలా అదిరే అంకెలతో.. అమ్మకాలు సాగినట్లుగా వివరాలు …

Read More »

చర్చిలో మాట్లాడుతున్న బ్రిటన్ ఎంపీ దారుణ హత్య

బ్రిటన్ ఎంపీ ఒకరు దారుణమైన రీతిలో హత్యకు గురయ్యారు. పెను సంచలనంగా మారిన ఈ ఉదంతం ఒక చర్చిలో జరగటం గమనార్హం. 69 ఏళ్ల ఎండీ డేవిడ్ అమీస్ అధికార కన్జర్వేటివ్ పార్టీ నేత. 1983 నుంచి ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ఎసెక్స్ లోని సౌత్ ఎండ్ వెస్ట్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం స్థానికంగా ఉన్న లీ- ఆన్ – సీ లోని ఒక చర్చిలో అక్కడి …

Read More »

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ఇంటికి బంగారు మెరుపులు

‘నీ ఇల్లు బంగారం కాను’ అన్న సామెత సంగతేమో కానీ.. ఇప్పుడు చేతిలో డబ్బులు ఉండాలే కానీ.. ఇంటిని బంగారంలా మార్చేస్తున్న వైనం ఎక్కువైంది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ మహానగరంలో ఈ ట్రెండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేయటం ఒక ఎత్తు. వాటికి అందుకు తగ్గట్లు ముస్తాబు చేయటం మరో ఎత్తు. ప్రధాన ద్వారం మొదలుకొని.. కార్పెట్లు.. కర్టెన్లు.. వాల్ పేపర్స్.. లైట్లు..సీలింగ్.. …

Read More »

ఆగ్రరాజ్యాల్ని వణికిస్తున్న ‘ది గ్రేట్ రిజిగ్నేషన్’!

మహా ఉత్పాతం చోటు చేసుకున్న తర్వాత.. దాని ప్రభావం చాలాకాలం ఉంటుంది. యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా కలకలం నేపథ్యంలో ఇప్పుడు దాని ఎఫెక్టు పలు రంగాల మీద.. ఎన్నో విధాలుగా ఉంటోంది. ఇప్పుడు అలాంటిదే ఒకటి తెర మీదకు వచ్చింది. అదే.. ‘ది గ్రేట్ రిజిగ్నేషన్’ ట్రెండ్. నిజంగానే ప్రపంచ ప్రజల ఆలోచనా ధోరణిని ఈ మహమ్మారి మార్చేసింది. అప్పటివరకు జీవితాన్ని చూసిన తీరును కరోనా మార్చేసింది. కొత్త …

Read More »

అక్కడ సైబర్ నేరాలకు కోచింగ్ సెంటర్లు ఓపెన్ చేశారట

నేరాలు చేసే తీరు మారిపోయింది. కాలు బయటకు పెట్టకుండా.. నిఘా నేత్రం నుంచి తప్పించుకొని.. దొంగతనం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రజల బలహానత.. అత్యాశలే పెట్టుబడిగా చేసుకొని వారిని తెలివిగా బోల్తా కొట్టించి.. వారి నుంచి పెద్ద ఎత్తున దోచుకునే సైబర్ నేరగాళ్లు ఎక్కువ అయిపోతున్నారు. కంటికి కనిపించని ఈ నయా నేరస్తుల పుణ్యమా అని.. సైబర్ నేరాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. టెక్నాలజీ మీద అవగాహన లేని కొందరి …

Read More »

జూనియర్ కొవాగ్జిన్ వచ్చేసింది.. పిల్లలకు ఓకే చెప్పేసినట్లే!

ప్రపంచానికి వణుకు పుట్టించిన కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ తయారీకి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయటం.. ఎట్టకేలకు కొన్ని కంపెనీలు టీకాలు తయారు చేసి.. వ్యాక్సినేషన్ షురూ చేయటం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. భారత్ లో మాత్రం మూడు వ్యాక్సిన్లు (కొవాగ్జిన్.. కొవిషీల్డ్.. స్పుత్నిక్) అందుబాటులో ఉన్నాయి. పెద్దలకు మాత్రమే సిద్ధం చేసిన వ్యాక్సిన్ తో పాటు.. పిల్లలకు సరిపడేలా టీకాల తయారీ మీద పలు …

Read More »

కోహ్లి కంట నీరు.. కదిలిపోయిన ఫ్యాన్స్

ఈ సాలా కప్ నమదే.. ఐపీఎల్ ఆరంభమయ్యే ముందు చాలా గట్టిగా వినిపించే నినాదం ఇది. లీగ్‌లో గెలవాలని ప్రతి జట్టూ ప్రయత్నిస్తుంది. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల కోరిక మిగతా వాళ్లతో పోలిస్తే చాలా బలమైంది. కానీ ఎంత బలంగా కోరుకున్నప్పటికీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆ జట్టు టైటిల్ సాధించలేదు. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే.. ఆ తర్వాత కోహ్లి.. ఇలా లెజెండరీ స్టేటస్ ఉన్న …

Read More »

గ్యాస్ సిలిండర్ ధర రూ. 2657..ఎక్కడో తెలుసా ?

నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకాయి. పేదలు, మధ్య తరగతి జనాలే కాదు ఎగువమధ్య తరగతి జనాలతో పాటు ధనవంతులు కూడా ఆచితూచి కొనాల్సిన పరిస్దితులు దాపురించాయి. ఎందుకంటే ఒక గ్యాస్ సిలిండర్ ధర రు. 2657, కిలో పంచదార ధర 800 రూపాయలు, లీటర్ పాల ధర రు. 1195. ఇంతేసి ధరలు ఎక్కడో అనుకుంటున్నారా ? మన పొరుగునే ఉన్న శ్రీలంకలోనే. దేశాధ్యక్షుడు రాజపక్సే తీసుకన్న ఆనాలోచిత …

Read More »

డీల్ ఫైనల్.. టాటా చేతికి ఎయిరిండియా.. ఎంతకు కొన్నారంటే?

ఒక సంస్థ చేజారిపోవటం.. దశాబ్దాల తర్వాత మళ్లీ అదే సంస్థ చేజిక్కిటం లాంటివి చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. తాజాగా అలాంటిదే ఎయిరిండియా విషయంలో జరిగింది. దాదాపు ఆరు దశాబ్దాల కిందట ఎయిరిండియా టాటా గ్రూపు చేతుల్లో ఉండేది. స్వాతంత్య్రానికి ముందే ఈ సంస్థ టాటా గ్రూపు నిర్వహిస్తుండేది. స్వాతంత్య్రం తర్వాత యాభై శాతం ప్రభుత్వ వాటా.. అనంతరం మొత్తం వాటాను సొంతం చేసుకున్న ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఎయిరిండియా …

Read More »

ముంబయి ఇండియన్స్ కథ ముగిసినట్లే

గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచి ఔరా అనిపించింది ముంబయి ఇండియన్స్‌. మొత్తంగా ఐపీఎల్‌లో ఐదుసార్లు టైటిల్ సాధించి తనకు తానే సాటి అనిపించిందా జట్టు. అంతకుముందు వరకు ఒక సీజన్ విడిచిపెట్టి ఒక సీజన్ టైటిల్ గెలుస్తూ వచ్చిన ముంబయి.. గత సీజన్లో మాత్రం ట్రెండు మార్చింది. వరుసగా రెండో పర్యాయం కూడా విజేతగా నిలిచింది. ఇదే ఊపులో హ్యాట్రిక్ టైటిల్ సాధించి …

Read More »

లాటరీలో రూ.20 కోట్లు గెలిచాడు.. అడ్రస్ మాత్రం ట్రేస్ కావట్లేదు

సుడిగాడు అంటే వీడేరా? అన్నట్లు అనిపించే ఉదంతమిది. అదే సమయంలో.. ఎంత లక్ ఉన్నా కానీ దరిద్రం మాత్రం అతగాడి వెంట పడుతూనే ఉందన్నట్లుగా ఉండే ఈ వ్యవహారం చాలా సిత్రంగా ఉంటుంది. యూఏఈలో ఉండే ప్రవాస భారతీయుడు ఒకరు (నహీల్ నిజాముద్దీన్) యూఏఈలో పని చేస్తున్నాడు. ఆదివారం జరిగిన బిగ్ టికెట్ అబుదాబి సిరీస్232 డ్రాలో ఇతగాడు ఏకంగా రూ.20 కోట్లకు విజేతయ్యాడు. సెప్టెంబరు 26న లాటరీ టిక్కెట్ …

Read More »