వీడియో : రాడ్ మెడపై పడడంతో పవర్‌లిఫ్టర్ మృతి…!

మ‌ర‌ణం ఎలా వ‌స్తుందో ఊహించ‌డం క‌ష్టమ‌నే మాట‌ను ఈ ఘ‌ట‌న రుజువు చేస్తుంది. ప్ర‌ముఖ యువ ప‌వ‌ర్ లిఫ్ట‌ర్ య‌శ్తికా ఆచార్య‌.. రెప్ప‌పాటులో క‌న్నుమూశారు. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అంత‌ర్జాతీయ పోటీల‌కు ప్రిపేర్ అవుతున్న ఆమె.. అదే ఆట‌లో ప్రాణాలు కోల్పోయారు. ఆట‌గ‌ద‌రా శివా! అన్న‌ట్టుగా య‌శ్తికా మ‌ర‌ణం చోటు చేసుకోవ‌డం చిత్రం. 270 కిలోల బ‌రువు ఎత్తేందుకు శిక్ష‌ణ తీసుకుంటున్న క్ర‌మంలో ఆమె ఆ బ‌రువు త‌న మెడ‌పై ప‌డ‌డంతో అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలారు. ఆ వెంట‌నే ప్రాణాలు కోల్పోయారు. దీనికిసంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

రాజ‌స్థాన్‌కు చెందిన య‌శ్తికా ఆచార్య‌కు 17 సంవ‌త్స‌రాలు. ఆది నుంచి వెయిట్ లిఫ్టింగ్‌లో దూసుకుపోయారు. జూనియ‌ర్ నేష‌న‌ల్ గేమ్స్‌లోనూ ఆమె స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సాధించారు. త్వ‌ర‌లోనే అంత‌ర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో 250 కిలోల‌కు పైగా బ‌రువునుఎత్తే ప్రాక్టీస్‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. దీనికిగాను ఆమెనిరంత‌రం సాధ‌న చేస్తున్నారు. బుధ‌వారం య‌ధావిధిగా ప్రాక్టీస్ ప్రారంభించిన య‌శ్తికా ఆచార్య‌.. ఏకంగా 270 కిలోల బ‌రువును ఎత్తే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఆమె ట్రైన‌ర్ కూడా ఆమెకు మెళ‌కువ‌లు నేర్పారు.

మొత్తానికి 270 కిలోల బ‌రువును భుజాల‌పైకి ఎత్తుకుని పైకి లేపేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. అంత బ‌రువును.. మోయ లేక‌.. కింద‌కు వాలిపోయారు. ఈ క్ర‌మంలో 270 కిలోల వెయిట్ య‌శ్తిక మెడ‌పై నుంచి త‌ల మీదుగా కింద‌కు జారింది. దీంతో నాడులు పూర్తిగా న‌లిగిపోయి.. ఆమె అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలారు. ఈ ఘ‌ట‌న‌లో ట్రైన‌ర్‌కు సైతం కుడి భుజానికి గాయ‌మైంది. ఆ వెంట‌నే య‌శ్తికాను ఆసుప‌త్రికి త‌ర‌లించినా.. అప్ప‌టికే ఆమెమృతి చెందిన వైద్యులు తెలిపారు. పోస్టు మార్ట‌మ్ అనంత‌రం.. ఆమె మృత దేహాన్నికుటుంబానికి అప్ప‌గించారు. కాగా.. ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క్రీడాకారుల్లో విషాదాన్ని నింపింది.