ఐపీఎల్ 2024లో ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకున్న నితీశ్ కుమార్ రెడ్డి, 2025లో అదే స్థాయిలో కొనసాగుతాడని ఎవరైనా ఊహిస్తారు. కానీ ఈ సీజన్‌లో అతను చూపిస్తున్న ఆటతీరు చూస్తుంటే ఫ్యాన్స్ కు అసలు నచ్చడం లేదు. ఇప్పటికే SRH జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది. ఇక ప్లేఆఫ్స్ ఆశలు కొనసాగించాలంటే ఒక్క మ్యాచ్ కూడా కోల్పోకూడదనే పరిస్థితి. ఇలాంటి టైంలో టీమ్‌లో ఒక కీలక ఆటగాడు నిరాశపరిచితే విమర్శలు తప్పవు.
నితీశ్ బ్యాటింగ్ స్టాట్స్ చూస్తే ఇది స్పష్టమవుతోంది.. 6 మ్యాచ్‌ల్లో 30 (15), 32 (28), 0 (2), 19 (15), 31 (34), 19 (21). స్ట్రైక్ రేట్ సరైన స్థాయిలో లేనిదే కాకుండా, అతని ఇన్నింగ్స్‌లు మ్యాచుల ఫలితాలపై ప్రభావం చూపలేకపోతున్నాయి. ముఖ్యంగా టాప్-5లోకి బ్యాటింగ్‌కు వస్తూ, పవర్‌ప్లే లేదా మిడిల్ ఓవర్లలో టుక్‌టుక్ ఇన్నింగ్స్‌లు SRH మోమెంటమ్‌ను దెబ్బతీస్తున్నాయి. ఈ రకమైన ఆటతీరుతో, గతంలో SRHలో ఆడిన సమద్, విజయ్ శంకర్ లను గుర్తుకు తెస్తున్నాడు.. అనే కామెంట్లు అభిమానుల నుంచి వస్తున్నాయి.
ఇక మరోవైపు అదే జట్టులో ఉన్న అనికేత్ వర్మ మాత్రం తక్కువ బంతుల్లో పెద్ద షాట్లు కొడుతూ తన పాత్రను నెరవేరుస్తున్నాడు. ఇప్పటికే కొన్ని మ్యాచుల్లో SRH స్కోర్ 160 దాటడానికీ అతని చివరి ఓవర్ల సిక్సర్లే ప్రధాన కారణం. ఇలాంటి సమయంలోనూ నితీశ్‌కే ముందుగా ఛాన్స్ ఇస్తుండటం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. ఆ మధ్య గాయంతో లాంగ్ బ్రేక్ తీసుకోవడం వల్ల కూడా అతడు ఒత్తిడిలో ఆడుతున్నట్టు కనిపిస్తోంది.
టీమ్ మేనేజ్‌మెంట్ కూడా అతనిపై నమ్మకం ఉంచినా, మిడిల్ ఓవర్ స్లోనెస్ SRHకు సమస్యగా మారింది. ఇకపై మిగిలిన మ్యాచ్‌లలో ఆరు గేమ్స్, ఆరు గెలవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా తుదిగా, ఒక ఏమేర్జింగ్ ప్లేయర్ కు ఎదురయ్యే రెండో సంవత్సరం పరీక్షే గట్టిది. నితీశ్ ఆ పరీక్షలో ఇప్పటివరకు మెరుపులు చూపించలేకపోయాడు. కానీ ఆ టాలెంట్ నెగ్లెక్ట్ చేయలేం. ప్రస్తుతం అతను కావలసింది గేమ్ టైమ్ కాదు, గేమ్ ఇంటెన్సిటీ. మరి నితీష్ ఎప్పుడు ఫామ్ లోకి వస్తాడడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates