నేడు దేశంలో 60-70 శాతం మంది ప్రజలు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్లకు సిగ్నల్స్ అందించే ఉపగ్రహ ప్రయోగాలకు.. ఆద్యుడు.. భారత అంతరిక్ష ప్రయోగాల్లోనే సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టిన కస్తూరి రంగన్.. ఉరఫ్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ ఇక లేరు. 84 ఏళ్ల వయసులో బెంగళూరులో శుక్రవారం మధ్యాహ్నం.. 1 గంటకు ఆయన కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రంగన్.. ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
1940, అక్టోబరు 24న కేరళలోని కొచ్చిన్‌లో జన్మించిన రంగన్.. భారత అంతరిక్ష రంగంలో అనేక ప్రయోగాలకు `వేదికగా` నిలిచారు. ముఖ్యంగా సాంతికేత వినియోగంలో ప్రపంచ దేశాలకు దీటుగా భారత్ ను ముందుకు నడిపించాలని కలలు కన్నారు. ఈ క్రమంలోనే ఆయన 1980లలో మొబైల్ ఫోన్లకు సిగ్నళ్లకు అందించే వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. సుమారు 15 సంవత్సరాల పాటు.. ఆయన చేసిన కృషి ఫలించి.. భారత్‌లో తొలిసారి మొబైల్ సిగ్నళ్లు 1998-99 ప్రాంతంలో అందివచ్చాయి.
ఆతర్వాత.. జరిగిన విస్తృత పరిశోధనలు.. మొబైళ్ల సిగ్నళ్లతోపాటు.. ఇతర సాంకేతిక సహకారాలను కూడా అందించాయి. ఒక్క మొబైల్ సిగ్నళ్లే కాకుండా.. అంతరిక్ష పరిశోధనలో మానవ రహిత ప్రయోగాలకు కూడా.. ఆయన అప్పట్లోనే జీవం పోశారు. ఆయన రాసిన.. 200లకు పైగా పత్రాలు.. నేటికీ శాస్త్రవేత్తలకు పవిత్ర గ్రంధాలతో సమానంగా భావిస్తారు. సుదీర్ఘ కాలం పాటు ఆయన భారత అంతరిక్ష రంగానికి సేవలు అందించారు.
ప్రస్తుతం చిటికెలో మొబైల్ సిగ్నళ్లను అందుకునే వ్యవస్థకు ఆయనే జవం… జీవం.. పోశారంటూ.. 2000 సంవత్సరంలో ఆయనకు పద్మవిభూషణ్ ప్రకటించిన సందర్భంగా కేంద్రం వేనోళ్ల కొనియాడింది. కాగా.. ఆయన కు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో విద్యార్థు లకు అంతరిక్షంపై అవగాహన పెంచేందుకు పాఠ్యాంశాలు మార్చాలని సూచించారు. కానీ.. అది సాకారం కాలేదు.