Trends

వానలతో కొట్టుకొచ్చిన రూ.50 లక్షల గంజాయి గుట్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వానల కారణంగా ఒక పెద్ద గంజాయి రహస్యాన్ని పోలీసులు బహిర్గతం చేశారు. అశ్వారావుపేట – దమ్మపేట మండలాల మధ్య ఉన్న ఓ ఆయిల్ ఫామ్ తోటలో దాచిన గంజాయి వరద నీటిలో బయటపడటం స్థానికులను, పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆదివారం కురిసిన భారీ వర్షాల వల్ల తోటలోని మట్టితో కప్పిన గంజాయి ప్యాకెట్లు వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే చెత్త, మట్టితో …

Read More »

దిగ్గజాల కంటే మెండుగా గిల్ ఘనత

ఇంగ్లండ్‌తో మొదటి టెస్టులో తడబడినా రెండో టెస్టులో టీమిండియా పవర్ఫుల్ విజయాన్ని నమోదు చేసింది. 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘనంగా విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ముఖ్యంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టెస్టు గెలిచిన తొలి ఆసియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ మైదానంలో ఆడిన విరాట్ కోహ్లీ, కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ లాంటి …

Read More »

అంతర్జాతీయ ఫుడ్ ర్యాంకింగ్స్‌.. హైదరాబాద్ ర్యాంక్ ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియుల మనసులను తెలంగాణ రాజధాని మరోసారి హైలెట్ అయ్యింది. తాజాగా విడుదలైన టేస్ట్ అట్లాస్ గ్లోబల్ ఫుడ్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌కు 50వ స్థానం లభించింది. ప్రపంచంలోని 100 ఉత్తమ ఫుడ్ డెస్టినేషన్లలో భాగంగా హైదరాబాద్‌కు ఈ గుర్తింపు రావడం విశేషమే. సుదీర్ఘకాలంగా ఈ నగరం ‘బిర్యానీ’ పేరు చెప్పగానే గుర్తొచ్చే ప్రాంతంగా నిలుస్తున్నది. ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా దానికి గుర్తింపు దక్కడం హైదరాబాద్‌ ఖ్యాతిని మరింత …

Read More »

పాక్ కు గుడ్ బై: ఉబర్.. ఫైజర్.. షెల్.. ఇప్పుడు మైక్రోసాఫ్ట్

ఉబర్.. ఫైజర్.. షెల్.. టెలినార్.. ఎలీ ఇల్లీ.. సనోఫి.. తాజాగా మైక్రోసాఫ్ట్. పేరున్న ఈ కంపెనీలే కాదు.. వేలాది కంపెనీలు ఇప్పుడు పాకిస్థాన్ కు గుడ్ బై చెబుతున్నారు. వీలైనంతగా లెక్కలు సెట్ చేసుకొని.. పాక్ దేశానికి ఒక దండం పెట్టి దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోతున్నాయి. ఎందుకిలా? అంటే.. పాకిస్థాన్ లో వ్యాపారం చేయటం అంత సులువైన పని కాదు. అందుకోసం నానా తిప్పలు పడాలి. ఇదంతా ఒక …

Read More »

బీరు తాగుతూ వాదనలు వినిపించిన లాయర్‌..

గత కొన్ని సంవత్సరాలుగా కోర్టుల పని తీరులో సాంకేతిక మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. వర్చువల్ విధానంలో విచారణలు నిర్వహించడం కోర్టులకు రోజువారీ వ్యవహారంగా మారుతోంది. అయితే ఈ సౌకర్యాన్ని కొందరు న్యాయవాదులు సరిగ్గా వినియోగించకపోవడమే కాకుండా, విపరీతంగా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగించే విషయం. గుజరాత్ హైకోర్టులో ఇటీవలి ఘటన అందుకు నిదర్శనంగా నిలిచింది.  ఒక సీనియర్ న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తున్న సమయంలో బీరు తాగుతూ కనిపించడం కోర్టు …

Read More »

ఇండియా టూ అమెరికా.. 10,382 మంది అరెస్ట్!

అగ్రరాజ్యం అమెరికా అంటేనే ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు కలల దేశం. మెరుగైన జీవనవేగం కోసం, సంపద కోసం, భవిష్యత్తు కోసం వేలాదిమంది అక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే అమెరికాలోకి నేరుగా వీసాలు లేకుండా ప్రవేశించడం నేరం. అయినా మన దేశం నుండి, ముఖ్యంగా గుజరాత్‌ వంటి రాష్ట్రాల నుంచి చాలా మంది ఈ ప్రయాణాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు.  తాజాగా విడుదలైన అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ …

Read More »

క్రికెటర్ షమి నుంచి భార్యకు నెలకు 4 లక్షలు

భారత క్రికెట్ అభిమానుల ఫేవరెట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన మహమ్మద్ షమి.. వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న హసీన్ జహాన్ అనే మోడల్‌ను అతను 2014లో పెళ్లి చేసుకోవడం.. నాలుగేళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడం.. షమితో పాటు అతడి కుటుంబ సభ్యుల మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ షహీన్ గృహ హింస సహా పలు కేసులు పెట్టడం తెలిసిందే. ఈ …

Read More »

గుడ్ న్యూస్: టికెట్ బుకింగ్ నుంచి ఫుడ్ వరకూ ఒకే యాప్ లో

ఇప్పటి వరకూ టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, ట్రైన్ స్టేటస్ వంటి ఎన్నో రైలు సంబంధిత సేవలకు వేర్వేరు యాప్‌లు వాడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి స్వస్తి పలుకుతూ భారత రైల్వేలు సరికొత్త ‘రైల్ వన్’ అనే సూపర్ యాప్‌ను రిలీజ్ చేసింది. ఈ యాప్‌ ఒకే చోట రైలు ప్రయాణికుల అవసరాలన్నీ తీరేలా డిజైన్ చేయబడింది. కొత్త యాప్ ద్వారా రిజర్వ్డ్, అన్‌రిజర్వ్డ్, ప్లాట్‌ఫాం టికెట్లు …

Read More »

రాజా సింగ్.. నచ్చకపోతే అంతే

బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. ప్రతిపక్ష పార్టీ అయినా..సొంత పార్టీ అయినా..చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన నైజం. పార్టీ బలోపేతం కోసం, పార్టీని అధికారంలోకి తేవడం కోసం తపనతో చేస్తున్నానని చెబుతూ రాజాసింగ్ చేసే పలు కామెంట్లు ఎన్నోసార్లు కాంట్రవర్షియల్ అయ్యాయి. అయినా సరే నేనింతే అంటూ రాజా సింగ్ తనదైన శైలిలో …

Read More »

సంగారెడ్డిలో భారీ పేలుడు..8 మంది మృతి

తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పాశమైలారం పారిశ్రామిక వాడలో చాలా కాలం క్రితం కార్యకలాపాలు సాగిస్తున్న సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం ఉదయం ఉన్నట్లుండి ఓ కెమికల్ రియాక్టర్ పేలింది. ఈ పేలుడు ధాటికి పరిశ్రమల చుట్టుపక్కన ఏకంగా 6 నుంచి 7 కిలో మీటర్ల దాకా ప్రకంపనలు నమోదయ్యాయి. జనం భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 8 …

Read More »

జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర‌లో వారెలా చ‌నిపోయారు?

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత పూరీ జ‌గ‌న్నాథుని రథ‌యాత్ర‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏటా ఆషాధ శుద్ధ విదియ తిథి నుంచి 12 రోజులు జ‌రిగే ఈ ర‌థ‌యాత్ర‌కు దేశ విదేశాల నుంచి భ‌క్తులు త‌ర‌లి వ‌స్తారు. అశేష జ‌నంతో పూరీ కిట‌కిట‌లాడుతుంది. ఈ ఏడాది కూడా అలానే జ‌రిగింది. అయితే.. గ‌తంలో న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు.. కొన్ని ఆంక్ష‌లు విధించేవారు. ఈ సారి బీజేపీ స‌ర్కారు ఎలాంటి ఆంక్ష‌లు …

Read More »

సోషల్ మీడియా దాచితే ఆ వీసా రాదట!

అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇప్పుడు ఓ-1 వీసా కొత్త ఆశగా మారింది. హెచ్-1బీ వీసాల విషయంలో లాటరీ, పరిమితులు, రిజెక్షన్ల భయంతో ఎందరో నిరుత్సాహపడుతుంటే… అసాధారణ ప్రతిభను గుర్తించి ఇచ్చే ఓ-1 వీసా మాత్రం రోజురోజుకూ ప్రజాదరణ పొందుతోంది. ముఖ్యంగా టెక్ రంగంలో పనిచేస్తున్నవారూ, డిజిటల్ క్రియేటర్లు, అథ్లెట్లు ఇలా వివిధ రంగాల్లో ప్రతిభావంతులు అమెరికా వెళ్లేందుకు ఈ వీసాను ఆశ్రయిస్తున్నారు. మరిన్ని అవకాశాలు, తక్కువ నిరాకరణతో ఈ వీసా …

Read More »