శీను పండు జంట మళ్ళీ కలుస్తుందా

టాలీవుడ్ ప్రేమ సినిమాల్లో మోస్ట్ ఐకానిక్ అండ్ లవ్లీ జంటల్లో ఒకటైన శీను పండుల అల్లరి, నిన్నే పెళ్లాడతా మూవీని అభిమానులే కాదు సగటు సినీ ప్రేక్షకులు కూడా అంత సులభంగా మర్చిపోలేరు. 1996 కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సృష్టించిన రికార్డులు చూసి మాస్ హీరోలు సైతం తెల్లబోయే పరిస్థితి. అప్పట్లో దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్ని సూపర్ హిట్లు వచ్చాయో లెక్క బెట్టడం కష్టం. నాగార్జున, టబుల మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పడింది. ఆ తర్వాత సిసింద్రీలో ఒక పాట, ఆవిడా మా ఆవిడేలో ఫుల్ లెంగ్త్ రోల్స్ లో కనిపించారు.

ఇక విషయానికి వస్తే నాగ్ టబులు మళ్ళీ కలిసి నటించబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో ఈ జంటనే లాక్ చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంగానే టీమ్ ని కదిలిస్తే ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనేది లేదని, ఇంకా స్క్రిప్టే లాక్ చేయలేదని అంటున్నారు. ప్రస్తుతం మంగళవారం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న అజయ్ భూపతి అది థియేటర్లకు వచ్చే దాకా ఫ్రీ అయ్యే పరిస్థితిలో లేడు కాబట్టి క్లారిటీకి కొంత టైం పట్టొచ్చు.

ఒకవేళ నిజమైనా ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడంటే వయసులో ఉన్నారు కాబట్టి లవ్ రొమాన్స్ అన్నీ పండాయి. కానీ ఇప్పుడు టబు ఆల్రెడీ సీనియర్ క్యారెక్టర్లకు వచ్చేశారు. అక్క, వదిన, అత్తయ్యతో పాటు మంచి రోల్స్ ఏవైనా వస్తే పట్టేస్తున్నారు. ఒకవేళ నాగ్ తో జోడి కట్టినా అది మధ్య వయసు దాటిన పాత్రే అయ్యుంటుంది. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ని దర్శకుడిగా పరిచయం చేయాలనుకున్న మలయాళం రీమేక్ ని నాగార్జున దాదాపు పక్కన పెట్టేసినట్టే కనిపిస్తోంది. కన్ఫర్మ్ చేయలేదు కానీ అది రద్దయిన సంగతి మనమే గుర్తించాలని సైలెంట్ గా ఉన్నారు కాబోలు