మహారాష్ట్రలోని పుణెకు చెందిన గోల్డెన్ బాయ్స్ తిరుమలలో సందడి చేశారు. సన్నీ నన వాగ్చోరీ , సంజయ్ దత్తత్రయ గుజర్ , ప్రీతి సోని అనే ముగ్గురు శరీరంపై ఇద్దరు 10 కేజీల చొప్పున, ఒకరు ఐదు కేజీలు మొత్తం రూ.15 కోట్ల విలువైన 25 కిలోల బంగారు ఆభరణాలు ధరించి ఉదయం వీఐపీ దర్శనం చేసుకున్నారు. వారికి సెక్యూరిటీగా 15 మంది వెంట రావడం విశేషం.
Read More »కొండాపూర్ ఇంట్లో 17 మంది ఫారిన్ అమ్మాయిలు.. విషయం తెలిస్తే షాక్
ఐటీ కారిడార్ కు కూతవేటు దూరంలో ఉండే కొండాపూర్ లో వెలుగు చూసిన ఒక ఉదంతం పోలీసుల్ని సైతం విస్మయానికి గురి చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 17 మంది విదేశీ అమ్మాయిలు ఒకే ప్లాట్ లో ఉండటం.. వారిపై తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఎంట్రీ ఇచ్చిన మాదాపూర్ పోలీసులు అంతర్జాతీయ వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు చేశారు. కొండాపూర్ లోని ఒక ఇంటిని అద్దెకు …
Read More »అచ్యుతాపురం ట్రాజెడీ.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ
ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఏకంగా 18కి చేరుకుంది. ఇంకా పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. అందరిలోకి చల్లపల్లి హారిక (22) కథ తెలిసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆమె దురదృష్టంకొద్దీ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. రియాక్టరు …
Read More »పాతవన్నీ తవ్వితే ఎవరికి లాభం
మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో మరో దుమారానికి కారణమయ్యింది. ఆ వేడుకకు రావడానికి సుకుమార్ భార్య తబిత ఆ సినిమా నిర్మాత కాబట్టి అనే కోణంలో బన్నీ అన్న మాటలు వేరే అర్థంలో వెళ్లిపోయాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో నంద్యాలకు వెళ్లి రావడం గురించి మరోసారి మెగా ఫ్యాన్స్ కొందరు తవ్వి తీస్తున్నారు. ఇక్కడితో ఆగడం లేదు. ఇవాళ రీ …
Read More »విజయ్ పార్టీపై.. ఓ ముద్ర పడిపోనుందా?
సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం.. సొంతంగా పార్టీ పెట్టడం అత్యధిక స్థాయిలో జరిగే రాష్ట్రం తమిళనాడే. మన కంటే కూడా అక్కడ రాజకీయాల్లో సినీ స్టార్ల ఆధిపత్యం ఎక్కువ. సినీ రంగం నుంచి వచ్చిన కరుణానిధి, జయలలితలే అక్కడ సుదీర్ఘ కాలం రాష్ట్రాన్ని పరిపాలించారు. రాజకీయాలను శాసించారు. వీరి బాటలో విజయ్ కాంత్, కమల్ హాసన్ లాంటి టాప్ స్టార్లు సైతం రాజకీయాల్లోకి వచ్చారు కానీ.. అనుకున్నంత స్థాయిలో విజయవంతం …
Read More »ఫామ్ హౌస్ చుట్టూ రాజకీయం
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ. కేటీఆర్ కు చెందినదిగా చెబుతున్న వేళ.. దీనిపై ఇప్పటివరకు మాట్లాడని మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా పెదవి విప్పారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. జన్వాడ ఫామ్ హౌస్ మీద క్లారిటీ ఇచ్చారు. ఎనిమిది నెలల క్రితం తన మిత్రుడి నుంచి తాను లీజుకు ఫామ్ హౌస్ తీసుకున్నట్లు చెప్పారు. ఒకవేళ.. సదరు ఫామ్ హౌస్ …
Read More »ఏదో దాస్తున్నారు: కోల్‌కతా హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు
కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచారం ఘటనకు సంబంధించిన కేసును సుమోటోగా స్వీకరించి న సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హత్యాచారం ఘటన జరిగిన తర్వాత అధికారులు వ్యవహరించిన తీరును తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. ఏదో దాస్తున్నారంటూ.. సర్కారు తీరు పైనా అనుమానాలు వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు సహా .. ఎఫ్ ఐఆర్ నమోదు విషయంలో పోలీసుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోందని ధర్మాసనం మండిపడింది. హత్యాచారం కేసును విచారించిన …
Read More »బీజేపీ వంతు.. సవ్వడిలేని సభ్యత్వ నమోదు
రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీ తరఫున సభ్యత్వాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మందికిపైగా సభ్యత్వాలు తీసుకున్నారు. తద్వారా.. రూ.500 సభ్యత్వం కట్టిన వారికి రూ.5 లక్షలవరకు ప్రమాద బీమాను కల్పించారు. దీనికితోడు పవన్‌పై ఉన్న అభిమానంతో ఎక్కువ మంది పార్టీలో సభ్యత్వాలు తీసుకున్నారు. ఇక, ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. ఆ పార్టీ కూడా …
Read More »చేసేది స్వీపర్ ఉద్యోగం.. 9 లగ్జరీ కార్లతో అడ్డంగా దొరికేశాడు
ఈ దేశంలో గవర్నమెంటు ఆఫీసుల్లో స్వీపర్ కూడా అవినీతి చేయగలడు అని నిరూపించడానికి ఉత్తరప్రదేశ్ లో ఒక స్వీపర్ భాగోతం బయటకు వచ్చింది. అతగాడికి 9 లగ్జరీకార్లు ఉండటాన్ని అధికారులు సైతం అవాక్కు అవుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే..తానేమీ తప్పు చేయలేదన్నట్లుగా సదరు స్వీపర్ చెప్పే మాటల్ని వింటే నోటి వెంట మాట రాని పరిస్థితి. ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాకు చెందిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు కోట్లకు పడగలెత్తిన …
Read More »జూనియర్ డాక్టర్ హత్యాచారం ఎంత పాశవికమో చెబుతున్న రిపోర్టు
నిజానికి ఈ వార్త రాస్తున్నప్పుడు మనసు ఎంతో వేదనకు గురైంది. మనిషిలోని పశుత్వం కాదు.. పైశాచికత్వం ఎంతన్న విషయాన్ని కళ్లకు కట్టేలా ఉన్న వివరాలు చదువుతున్న కొద్దీ వణికిపోతున్న పరిస్థితి. ఎంత ఆటవికంగా.. మరెంత అమానుషంగా హత్యాచారానికి పాల్పడ్డారన్నది పోస్టు మార్టం రిపోర్టులోని వివరాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అవును.. మీరు ఊహించింది కరెక్టే. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బెంగాల్ జూనియర్ డాక్టర్ హత్యాచారానికి సంబంధించి విస్తుపోయే వాస్తవాలు …
Read More »వినేశ్ పతకంపై వీడని సస్పెన్స్
వినేశ్ ఫొగాట్.. పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా పతకాలు గెలిచిన అథ్లెట్లను మించి చర్చనీయాంశం అయిన పేరింది. ఈ రెజ్లర్ 50 కేజీల విభాగంలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుని కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. ఫైనల్లో గెలిస్తే స్వర్ణమే దక్కేది. కానీ ఫైనల్ బౌట్‌కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందనే కారణంతో ఆమె మీద అనర్హత వేటు వేశారు. ముందు రోజు పోటీల సమయంలో నిర్ణీత …
Read More »సచిన్ గురించి భలే విషయాలు చెప్పిన అత్త
దిగ్గజ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండుల్కర్ క్రికెట్ కెరీరే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఆసక్తికరమైంది. అతను తన కంటే వయసులో ఐదేళ్లు పెద్ద అయిన అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అంజలిది ఆంగ్లో ఇండియన్ కుటుంబం కావడం విశేషం. తన తల్లి అనాబెల్ బ్రిటిష్ వ్యక్తి. ఆనంద్ మెహతా అనే వ్యాపారవేత్తను పెళ్లాడి ముంబయిలో సెటిలయ్యారు. ఓ సందర్భంలో ఆమె తనయురాలు అంజలిని చూడగానే …
Read More »