సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ఉన్నాడు? శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు? భారత టీ20 జట్టు విషయంలో చాలా రోజులుగా అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలివి. 2024లో టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ గెలవగానే రోహిత్ శర్మ ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అయిపోవడంతో సూర్యకుమార్ పగ్గాలందుకున్నాడు. అప్పట్నుంచి భారత్ ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. కానీ సూర్యకుమార్ మాత్రం ఫామ్ కోల్పోయాడు. కెప్టెన్‌గా విజయాలందుకుంటున్నప్పటికీ.. వ్యక్తిగత ప్రదర్శన దారుణంగా తయారవడంతో …
Read More »రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య… పనిమనిషిదే కీలక పాత్ర?
భాగ్య నగరి హైదరాబాద్ లో శుక్రవారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లో సుదీర్ఘ కాలం పనిచేసి ఇటీవలే పదవీ విరమణ పొందిన వినయ్ రంజన్ రే సతీమణి తనూజ (55) వారి ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు. జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ లో ప్రభుత్వం కేటాయించిన ఇంటిలో రే కుటుంబం నివసిస్తుండగా… వారి ఇంటిలో పనిచేస్తున్న పనిమనిషి కల్పన ఈ హత్యలో కీలక …
Read More »తెలంగాణలో బీర్ల రికార్డు.. ఏప్రిల్‌లోనే 6 కోట్ల బాటిళ్లు ఖాళీ!
తెలంగాణలో ఎండల తీవ్రత పెరగడంతో బీర్ల అమ్మకాలు గతంలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకున్నాయి. కేవలం ఏప్రిల్ నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఆరు కోట్ల బీరు బాటిళ్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు, శుభకార్యాల సీజన్ కలిసి రావడంతో మద్యం దుకాణాల వద్ద జనం క్యూ కట్టారు. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం గతేడాది ఏప్రిల్‌లో 41.39 లక్షల కేసులు అమ్ముడవగా, ఈసారి అది ఏకంగా …
Read More »`వస్తావా.. రేటెంత..` అర్ధరాత్రి మహిళా ఐపీఎస్‌కు వేధింపులు!
భాగ్యనగరం హైదరాబాద్‌లో మహిళల దుస్థితి ఎలా ఉందో.. ఒంటరి మహిళల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేసిన మహిళా ఐపీఎస్ అధికారికి చేదు అనుభవం ఎదురైంది. మల్కాజిగిరి పోలీసు కమిషనర్(సీపీ)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ అధికారి సుమతి చేసిన ఈ ప్రయోగం.. దాదాపు 40 మందికి పైగా యువతను పట్టుకునేలా చేసింది. అయితే.. అదేసమయం లో ఆమె పోకిరీల వేధింపులతో తాళలేకపోవడం గమనార్హం. ఇటీవల …
Read More »ఏపీ హైకోర్టులో జడ్జి వర్సెస్ లాయర్.. సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లిన వివాదం!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక యువ న్యాయవాది పట్ల హైకోర్టు న్యాయమూర్తి ప్రవర్తించిన తీరుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) గట్టిగానే స్పందించింది. ఒక విచారణ సమయంలో ఒక పాత ఉత్తర్వు కాపీని సమర్పించలేదన్న కారణంతో జస్టిస్ తర్లాడ రాజశేఖర్ రావు సదరు లాయర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అతన్ని పోలీసు …
Read More »చెన్నై మ్యాచ్ అవుట్ వివాదం.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నితీష్ రాణా అవుటైన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ బ్యాటర్లు వరుసగా విఫలమవుతున్న సమయంలో రాణా మెల్లగా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నాడు. అయితే నూర్ అహ్మద్ వేసిన బంతిని స్వీప్ షాట్ ఆడబోయి డీప్ ఫైన్ లెగ్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా, …
Read More »విజయ్ ‘నెంబర్ గేమ్’కు ముగింపు ఎలా..?
తమిళనాట స్టార్ హీరో జోసెఫ్ విజయ్ పార్టీ తమిళగ వెట్రి కగజం (టీవీకే) అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రికార్డు ఫలితాలను సాధించింది. అటు అధికార పార్టీ డీఎంకేతో పాటు ఇటు విపక్షం అన్నాడీఎంకేను కూడా ఓడించేసిన విజయ్ పార్టీ… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను సాధించలేకపోయింది. తమిళ అసెంబ్లీలో మొత్తం సీట్లు 234 ఉండగా… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకి అయినా 118 …
Read More »గెట్ టు గెదర్ పార్టీలు.. పాత స్నేహితులతో కామం?
ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో ‘గెట్ టు గెదర్’ పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. పదేళ్ల క్రితం విడిపోయిన స్కూల్ బ్యాచ్‌ల నుంచి ముప్ఫై, నలభై ఏళ్ల కిందటి పాత విద్యార్థుల వరకు అంతా సోషల్ మీడియా ద్వారా ఒక్కటవుతున్నారు. పాత రోజులను గుర్తుచేసుకోవడం, ఒకరికొకరు సాయం చేసుకోవడం వరకు ఈ వేడుకలు బాగానే ఉంటున్నాయి. కానీ, ఈ కలయికల చాటున కొన్ని అనవసరమైన …
Read More »పైలట్ల గొడవ.. విమానంతో 132 మందిని చంపేశారా?
చైనాలో నాలుగేళ్ల క్రితం జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ MU5735 ప్రమాదానికి కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన గొడవే కారణమని, ఆ గొడవలో ఒకరు ఉద్దేశపూర్వకంగానే ఇంజిన్లకు ఇంధనం అందకుండా స్విచ్ ఆఫ్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) నివేదికలోని సమాచారం ప్రకారం, విమానం గాలిలో …
Read More »MI మిస్టరీ స్పిన్నర్.. ‘జై శ్రీరామ్’ వెనుక అసలు కథ
ఐపీఎల్ అంటేనే కోట్లు కురిపించే లీగ్ అని అందరూ అనుకుంటారు, కానీ దీని వెనుక కొన్ని జీవితకాల పోరాటాలు ఉంటాయి. నిన్న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేసిన రఘు శర్మ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా 33 ఏళ్ల వయసులో ఏ క్రికెటర్ అయినా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తాడు, కానీ జలంధర్‌కు చెందిన ఈ లెగ్ స్పిన్నర్ …
Read More »ఆ రోజు విజయ్ ఏమన్నాడో తెలుసా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ బాగానే ప్రభావం చూపిస్తాడని చాలామంది అన్నారు కానీ.. మరీ అధికారం చేపట్టే స్థాయిలో తన ప్రభావం ఉంటుందని ఊహించిన వాళ్లు తక్కువ. ఆయన విజయానికి కలిసి వచ్చిన కారణాల గురించి ఇప్పుడు అందరూ చర్చించడం మొదలుపెట్టారు. ఐతే విజయ్ మాత్రం ముందు నుంచి తన పార్టీ అధికారంలోకి రాగలదని బలంగా నమ్మాడు. గత ఏడాది కరూర్ విషాదాంతం తర్వాత కొంత కాలం రాజకీయ సభలేవీ …
Read More »హార్దిక్ పాండ్య ఏం సాధించాడు?
గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు చెప్పేయొచ్చు. ఇప్పుడు భారత క్రికెట్లో అతనంత వ్యతిరేకతను ఎవ్వరూ ఎదుర్కోవట్లేదు అంటే అతిశయోక్తి కాదు. చిన్న వయసులోనే ఐపీఎల్‌లో ఆల్ రౌండ్ మెరుపులతో అభిమానుల దృష్టిని ఆకర్షించి.. ఈ తరానికి మరో ‘కపిల్ దేవ్’ అనిపించుకున్నాడు ఈ బరోడా క్రికెటర్. ముంబయి ఇండియన్స్ తరఫున నిలకడగా రాణించడంతో త్వరగానే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates