ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువు సెప్టెంబరు 15తోనే ముగుస్తుందని కేంద్రం స్పష్టంగా తెలిపింది. కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో ఈ గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించారనే వార్తలు వైరల్ అవుతున్నా, అవన్నీ నకిలీ సమాచారం మాత్రమేనని ఆదాయపు పన్ను విభాగం ఖండించింది. ఇప్పటికే జూలై 31 వరకు ఉన్న గడువును ఒకసారి పొడిగించి సెప్టెంబరు 15 వరకు తీసుకొచ్చామని, ఇకపై ఎలాంటి పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. …
Read More »నాగమల్లయ్యకు మంచి పేరు ఉంది: ట్రంప్
డాలస్‌లో భారతీయుడు చంద్ర నాగమల్లయ్య దారుణ హత్యకు గురైన ఘటన అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు నిందితుడని తేలింది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకపై అక్రమ వలసలను ఏమాత్రం ఉపేక్షించబోమని ఆయన స్పష్టంచేశారు. అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే తమ లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. చంద్ర నాగమల్లయ్యను నిందితుడు మార్టినెజ్ తన భార్య, కుమారుడి …
Read More »హైదరాబాద్: డ్రైనేజీలో కొట్టుకుపోయిన మామా అల్లుడు
భాగ్యనగరం హైదరాబాదు.. చిన్న పాటి వర్షానికే నీట మునుగుతున్న విషయం తెలిసిందే. ఇక, ఓ మోస్తరు వర్షానికి అయితే.. మోకాల్లోతు నీటిలో నగరం మునిగిపోతోంది. అయితే.. తాజాగా ఆదివారం రాత్రి ఉన్నపళంగా భారీ వర్షం కురిసింది. కేవలం గంట వ్యవధిలోనే 12 సెంటీమీటర్ల వర్షం కురవడంతో నగరం నీటిలో మునిగిపోయినట్టు అయింది. ఎటు చూసినా.. వరదదుస్థితి కళ్లకు కట్టింది. లోతట్టు ప్రాంతాల నుంచి ఉన్నతస్థాయి ప్రాంతాల వరకు కూడా నీట …
Read More »పాక్ మ్యాచ్.. నో హ్యాండ్‌షేక్.. డోర్స్ క్లోజ్!
ఆసియా కప్ 2025లో పాక్ తో దుబాయ్ వేదికగా జరిగిన పోరులో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. అయితే, ఈ విజయానంతరం చోటుచేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. మ్యాచ్ తర్వాత సాధారణంగా ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరికొకరు హ్యాండ్‌షేక్ చేసుకుంటారు. కానీ ఈసారి మాత్రం భారత ఆటగాళ్లు డైరెక్ట్ గా డ్రెస్సింగ్ రూమ్ తలుపులు మూసుకుని లోపలికి వెళ్లిపోవడం గమనార్హం. మ్యాచ్ జరుగుతున్న సమయంలో …
Read More »పహల్గాం ఉగ్రదాడి… ఇండియన్ కెప్టెన్ క్లీన్ మెసేజ్
ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయాన్ని అందుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మాటలతో అభిమానులను కట్టిపడేశాడు. దుబాయ్ వేదికగా ఆడిన మ్యాచ్‌లో అద్భుత విజయానంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం క్రికెట్‌కే పరిమితం కాలేదు. ఈ సారి సూర్య తన గెలుపు సంతోషాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అంకితం చేయడం విశేషంగా మారింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్య, “ఇది మా కోసం మరో గేమ్ …
Read More »దేవాన్ష్ మరో రికార్డ్: బాబు హ్యాపీ
ఏపీ మంత్రి నారా లోకేష్-బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. “ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్“గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ అందుకున్నాడు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో దేవాన్ష్ అవార్డ్ ను దక్కించుకున్నాడు. అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి పాల్గొన్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని దేవాన్ష్ తాత, ఏపీ సీఎం …
Read More »పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా
ఆసియా కప్ 2025లో భారత్ , పాక్ మ్యాచ్ గతంలో కంటే కాస్త చప్పగానే సాగింది. అయితే దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించింది. పాకిస్థాన్‌ను 127 పరుగులకే పరిమితం చేసి, లక్ష్యాన్ని 16వ ఓవర్లోనే చేధించింది. 7 వికెట్ల తేడాతో గెలిచిన భారత్ గ్రూప్ A లో అగ్రస్థానంలో నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు …
Read More »యూకే చరిత్రలో తొలిసారి.. వలసలపై వ్యతిరేకంగా లక్ష మంది
యూనైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) రాజధాని లండన్ లో అనూహ్య రీతిలో చోటు చేసుకున్న నిరసన ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. యూకే చరిత్రలోనే అతి పెద్ద నిరసనగా దీన్ని అభివర్ణిస్తున్నారు. వలసలకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో లండన్ రోడ్లపైకి 1.10 లక్షల మంది వచ్చి నిరసన తెలిపారు. దీనికి వ్యతిరేకంగా స్టాండ్ అప్ టు రేసిజిమ్ పేరుతో మరో నిరసన జరిగింది లండన్ లోనే. కాకుంటే.. ఈ నిరసనకు మద్దతుగా …
Read More »నేపాల్‌లో ‘నెపో కిడ్స్’ విలాసాలు.. విధ్వంసానికి కారణమా?
నేపాల్ రాజకీయ పరిస్థితులు రోజురోజుకీ మరింత దారుణంగా మారిపోతున్నాయి. గత వారం ప్రారంభమైన నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్త ఉద్యమంగా మారాయి. ముఖ్యంగా జెన్ జడ్ (Gen-Z) తరం ఆధ్వర్యంలో సాగుతున్న ఈ ఆందోళనలు ఇప్పటికే తీవ్రమైన పరిణామాలకు దారితీశాయి. పోలీసులు చేసిన కాల్పులు, టియర్ గ్యాస్ దాడుల్లో 31 మంది మృతి చెందగా, వెయ్యికి పైగా గాయపడ్డారు. ఈ కల్లోలం మధ్య ప్రధాని కె.పి. శర్మ ఓలి తన పదవికి …
Read More »భారత్ – పాక్.. మొదటి సారి ఓ ఫైనల్ ఫైట్ సాధ్యమేనా?
ఆసియా కప్ ఈసారి పెద్దగా సౌండ్ లేకుండానే మొదలైంది. అందులోనూ భారత్ – పాక్ పోరు ఉంటే ఒక హై వోల్టేజ్ వైబ్ ఉండేది. కానీ ఈసారి అలా కనిపించడం లేదు. సెప్టెంబర్ 14న జరగబోయే గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌పై కూడా పెద్దగా సౌండ్ లేదు. ఇప్పటివరకు భారత్ – పాక్ ఆసియా కప్‌లో 19 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ 10 విజయాలు సాధించగా, పాక్ 6 విజయాలు …
Read More »అమ్ముడవని ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు
ప్రత్యర్థి ఎవరైనా సరే.. భారత జట్టు మ్యాచ్ ఆడుతోందంటే క్రికెట్ ప్రపంచమంతా అటు వైపు చూస్తుంది. ఇక ఇండియన్ ఫ్యాన్స్ అయితే ఎలా ఊగిపోతారో తెలిసిందే. అందులోనూ మల్టీ నేషన్స్ టోర్నీల్లో ఇండియా ఆడుతుంటే ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ బుధవారం నాడు ఆసియా కప్ టోర్నీలో భారత తన తొలి మ్యాచ్ ఆడినట్లు చాలామంది ఇండియన్ ఫ్యాన్స్‌కు తెలియని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. మామూలుగా ఆసియా కప్‌కు అభిమానుల్లో మంచి …
Read More »ఒకేసారి 7 వేల మంది ఖైదీలు పరారీ
నేపాల్‌లో యువత నిరసనలతో ఇప్పటికే పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈ కల్లోలానికి తోడు దేశంలోని జైళ్లలోనూ అల్లర్లు చెలరేగాయి. భద్రతా సిబ్బందిపై దాడులు, నిప్పు పెట్టడం, గోడలు దాటడం వంటి ఘటనల మధ్య దాదాపు ఏడు వేల మంది ఖైదీలు జైళ్ల నుంచి తప్పించుకున్నారు. దీంతో సాధారణ ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. ఖాట్మాండూ, చిట్వాన్, దిల్లీబజార్, జాలేశ్వర్, కైలాలీ, నక్కూ వంటి జైళ్ల నుంచి పెద్ద ఎత్తున ఖైదీలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates