కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కాస్త యాక్టివ్ అయినట్లే ఉన్నారు. అనారోగ్యకారణంగా సోనియా పార్టీ కార్యక్రమాలకు కూడా కాస్త దూరంగా ఉంటున్నారు. అలాంటిది శుక్రవారం 19 పార్టీల అధినేతలతో వర్చువల్ పద్ధతిలో సమావేశం నిర్వహించారు. దాదాపు 2 గంటలకు పైగా సాగిన సమావేశంలో పార్టీల వ్యక్తిగత అజెండాలను పక్కనపెట్టి కామన్ అజెండాతో నరేంద్ర మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపిచ్చారు. పార్లమెంటు వేదికగా పెగాసస్ సాఫ్ట్ వేర్ …
Read More »చినబాబు.. మీరు మారిపోయారా?
తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు ఎవరు? పార్టీని నడిపించే రథసారధి ఎవరు? వయసు మీద పడుతోన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీని ముందుకు తీసుకెళ్లేది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానంగా లోకేశ్ పేరు చెప్తే.. ఆయన వల్ల ఏమీ కాదని రాజకీయ పరిజ్ణానం లేదని ఎప్పుడు ఏం మాట్లడతారో తెలీదని ఇలా మొన్నటివరకూ రకరకాల వ్యాఖ్యలు వినిపించేవి. సొంత పార్టీ నాయకులే లోకేశ్‌ను నమ్మే పరిస్థితిల్లో లేరు. …
Read More »సాయిరెడ్డి సైలెన్స్ వెనక ఇంత కథ ఉందా ?
వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి వ్యూహం మార్చుకున్నారా ? తనకు ఇప్పుడు కాలం కలిసిరాని పరిస్థితి నేపథ్యంలో ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? అంటే.. అవుననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం సాయిరెడ్డి పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. ఢిల్లీలో ఒకప్పుడు చక్రం తిప్పిన ఆయనకు ఇప్పుడు అదే ఢిల్లీలో కేంద్రం పెద్దలు కనీసం పట్టించుకోవడం లేదు. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్ …
Read More »ఈ లీకుల వెనుక వైసీపీ వాళ్లే ఉన్నారా?
మొన్న అంబటి రాంబాబు.. ఇప్పుడేమో అవంతి శ్రీనివాస్.. ఏపీలో అధికార పార్టీకి చెందిన నాయకులు రాసలీలల ఆడియో లీకులతో వరుసగా చిక్కుల్లో పడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్నపుడు ఆటోమేటిగ్గా అందరి చూపూ ప్రతిపక్ష పార్టీల మీద పడుతుంది. ఆ పార్టీల వాళ్లే ఆయా నేతల్ని టార్గెట్ చేసి ఉంటారని అనుకుంటారు. కానీ అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌ల విషయంలో మాత్రం వేరే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార …
Read More »పాతుకుపోతున్న రేవంత్
తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాతుకుపోతున్నారు. అధ్యక్షునిగా నియమితులైనపుడు కూడా రేవంత్ కు పార్టీలోని సీనియర్లలో ఎంతమంది సహకరిస్తారు ? పార్టీ శ్రేణులు ఎలా రిసీవ్ చేసుకుంటాయో అని కొందరు సందేహాలు వ్యక్తంచేశారు. అయితే తాజాగా హైదరాబాద్ శివార్లలోని రావిర్యాల ప్రాంతంలో జరిగిన బహిరంగసభలో జనస్పందన చూసిన తర్వాత రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా పాతుకుపోయినట్లు అర్ధమైపోయింది. రేవంత్ కు సోనియా, రాహుల్ తో పాటు ప్రియాంక ఆశీస్సులు కూడా …
Read More »కరోనా థర్డ్ వేవ్ పై ఎయిమ్స్ చీఫ్ హెచ్చరికలు..!
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆ మధ్య కాస్త కేసులు తగ్గినట్లే అనిపించినా.. మళ్లీ పెరుగుతుండటంతో.. థర్డ్ వేవ్ ప్రారంభమైందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో.. థర్డ్ వేవ్ పై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.కోవిడ్ మూడో వేవ్ వస్తుందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని గులేరియా అన్నారు. బయట …
Read More »హుజూరాబాద్‌లో వేడి చల్లబడిందా?
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరినప్పటి నుంచి హుజూరాబాద్‌లో మొదలైన వేడి ఇప్పుడు కాస్త చల్లబడినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికైన ఈ హుజూరాబాద్ ఎన్నికలో విజయం అధికార టీఆర్ఎస్ పార్టీ, ఈటల గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. దీంతో నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ గత కొన్ని నెలలుగా అక్కడ రాజకీయ వేడి కొనసాగింది. ఈటల పాదయాత్ర, కాంగ్రెస్‌కు రాజీనామ చేసిన కౌశిక్ …
Read More »బయట విమర్శలు.. ఇంటికెళ్లి సమావేశాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ బలోపేతం దిశగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జనఆశీర్వాద్ యాత్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా గురువారం ఏపీలోని తిరుపతి, విజయవాడల్లో ప్రసంగించారు. ఆ సందర్భంగా ఏపీలోని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం అసమర్థత కారణంగానే రాష్ట్రంలో ఆర్థిక …
Read More »బుచ్చయ్య ఈపని చేస్తే చంద్రబాబుకు ఇబ్బందేనా ?
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, సీనియర్ నేత, ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం పార్టీలో పెద్ద సంచలనంగా మారింది. ఈనెల 25వ తేదీన పార్టీకి తర్వాత ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నట్లు స్వయంగా గోరంట్లే ప్రకటించడాన్ని చంద్రబాబునాయుడు ఏ మాత్రం ఊహించలేదు. బుచ్చయ్య రాజీనామా విషయం తెలియగానే బుధవారం రాత్రి చంద్రబాబు ఫోన్ చేసి దాదాపు అర్ధగంట పాటు మాట్లాడారు. పార్టీ అధినేతతో అంతసేపు మాట్లాడిన …
Read More »అందుకే రాహుల్ గాంధీని తీసుకొస్తానంటున్న రేవంత్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ఎంపీ రేవంత్ రెడ్డి యమ జోరుమీదున్నారు. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు, విమర్శలతో రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించడంతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్తేజాన్ని నింపుతున్నారు. సభలు, ర్యాలీలతో ప్రజలతో మమేకమవుతున్నారు. ఇలా వివిధ రకాల కార్యక్రమాలతో దూకుడు ప్రదర్శిస్తున్న రేవంత్‌కు సొంత పార్టీ సీనియర్ల నుంచి మాత్రం ఇప్పటికీ ఆశించిన స్థాయిలో మద్దతు …
Read More »ఆఫ్ఘన్ ను బిగించేస్తున్న ప్రపంచం
తాలిబన్లు చెరపట్టిన ఆఫ్ఘనిస్థాన్ ను యావత్ ప్రపంచం అన్ని వైపుల నుండి బిగించేస్తోంది. అన్ని వైపుల నుండి బిగించేయటమంటే దేశంలోని జనాలను ఇబ్బందులకు గురిచేయటం ప్రపంచ దేశాల టార్గెట్ కాదు. వాళ్ళ టార్గెట్ అంతా తాలిబన్లను లొంగదీసుకోవటమే. ఈ విషయంలో ముందుగా అమెరికా చొరవ చూపించింది. అమెరికాను తర్వాత ఇంగ్లాండ్, జర్మనీ తదితర దేశాలు ఫాలో అవుతున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి కూడా ఆప్ఘనిస్థాన్ పై అనేక ఆంక్షలు విధించింది. …
Read More »ఆదిలోనే షర్మిలకు షాక్.. కీలక నేత రాజీనామా..!
తెలంగాణ రాజకీయాల్లో సత్తాచాటేందుకు వైస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఆమె ఆశలన్నీ ఆదిలోనే అడియాశలు అవుతున్నాయి. ఆమె పార్టీ ప్రారంభించి కనీసం జనాల్లోకి కూడా పూర్తిగా వెళ్లకముందే ఆమెకు ఊహించని షాక్ తగిలింది. వైస్ షర్మిల పెట్టిన కొత్త పార్టీ కి సీనియర్ నాయకులు ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేస్తూ… రాజీనామా పత్రాన్ని విడుదల చేశారు. …
Read More »