ప్రత్యేక తెలంగాణా ఉద్యమసారధి ఎవరు ? సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోవటానికి కారణం ఎవరు ? ఈ ప్రశ్నలను ఎవరిని అడిగినా వెంటనే కేసీయార్ అనే సమాధానమిస్తారు. కానీ ఈమధ్యనే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్న తోట చంద్రశేఖర్ మాత్రం విచిత్రమైన విషయం చెప్పారు. తోట చెప్పిన తాజా విషయంతో కేసీయార్ గాలి తీసేసినట్లయ్యింది. బీఆర్ఎస్ లోకి కొందరు నేతలు జాయిన్ అయ్యారు. ఆ సందర్భంగా తోట మాట్లాడుతు …
Read More »వైసీపీకి షాకిచ్చిన టీడీపీ
అధికార వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ అనూహ్యంగా షాకిచ్చింది. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో నాలుగు రైండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. అందుబాటులోని సమాచారం ప్రకారం అన్నీ రౌండ్లలోను టీడీపీయే మంచి లీడ్ లో ఉంది. ఉత్తరాంధ్రలో మొత్తం 1.12 లక్షల ఓట్లున్నాయి. వీటిల్లో 4,644 ఓట్లు ఇన్ వాలీడ్ అయ్యాయి. మిగిలిన ఓట్లలో మొదటి రౌండ్ నుండి టీడీపీ అభ్యర్ధి చిరంజీవిరావుకు స్పష్టమైన ఆధిక్యత కనబడింది. ఇక్కడ వైసీపీ, …
Read More »రేపేం జరుగుతుంది ?
మాగుంట కుటుంబం… తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. వ్యాపారాల్లో రాజకీయాల్లో ఆరితేరిన కుటుంబం అది. పదిమందికి సాయం చేసే కుటుంబం అన్న పేరు కూడా ఉంది. ఇప్పుడా కుటుంబం కష్టాల్లో ఉంది.. అవి ఆర్థిక కష్టాలు కాదు.. ధనరాశులకు కొదవలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కారణంగా మాగుంట కుటుంబంపై మాయని మచ్చ పడే ప్రమాదం ఏర్పడింది. దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి, ఆయన సతీమణి పార్వతమ్మ, ప్రస్తుత ఎంపీ శ్రీనివాసులు …
Read More »అందుకే జగన్ ఢిల్లీ టూర్ ?
వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక దశకు చేరుకుంది. అవినాష్ రెడ్డి పూర్తి స్థాయిలో చిక్కుకోవడం ఖాయమని తేలిపోయింది. తీగె లాగితే డొంక కదులుతున్నట్లుగా సీఎం జగన్ కుటుంబానికి కూడా ఇబ్బందులు తప్పవన్న చర్చ మొదలైంది. భారతీ రెడ్డి సహాయకుడితో పాటు జగన్ పీఎను మరోసారి ప్రశ్నించాలని సీబీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోదీ అప్పాయింట్మెంట్ …
Read More »‘టీడీపీ – బీజేపీ – ఇండిపెండెంట్’
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గ్రాఫ్ పెరిగిందా? తరిగిందా? ఏం జరుగుతోంది? ఇదీ.. ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గంలో జరుగుతున్న కీలక చర్చ. దీనికి కారణం .. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. ఆయన టీడీపీ తరఫున పోటీ చేస్తారని తెలుస్తోంది. జనసేన-టీడీపీ పొత్తు ఉన్నప్పటికీ.. నరసాపురం టికెట్‌ను మాత్రం టీడీపీకే కేటాయిస్తారని సమాచారం. టీడీపీ తరఫున తాను పోటీచేయనున్నట్టు చూచాయగా సదరు ఎంపీ చెబుతున్నారు. …
Read More »బలం ఉంది కానీ బలమైన అభ్యర్థులే లేరు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి(ప్రస్తుత బీఆర్ఎస్)కు ఉన్న ఎమ్మెల్యేలు 10 మంది. అది కూడా ఉత్తర తెలంగాణలో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఆదిలాబాద్‌లో ముగ్గురు, నిజామాబాద్‌లో ఒక్కరు, కరీంనగర్లో నలుగురు, వరంగల్, మెదక్‌లో ఒక్కొక్కరు గెలిచారు. ఆ ఎన్నికలలో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 3.99. కానీ, 2014లో రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి …
Read More »అసెంబ్లీలో వైసీపీ మంత్రులతో బాలయ్య సందడి
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన్ను పలకరించగా ఆయన కూడా వారితో సరదాగా మాట్లాడారు. మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీ లాబీల్లో బాలయ్యను చూసి వచ్చి పలకరించారు. ఏం హీరోగారూ అంటూ బాలకృష్ణను మంత్రి బొత్స అభివాదం చేశారు. మరోవైపు మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ కూడా బాలయ్య వద్దకు వచ్చి పలకరించి వెళ్లారు. ఈ సందర్భంగా బాలకృష్ణ …
Read More »ఈడీ విచారణకు కవిత గైర్హాజరు.. రావాల్సిందేనన్న ఈడీ
దిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌తో తలపడుతున్నారు. ఈ రోజు(మార్చ్ 16) ఆమె ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా తన తరఫున తన ప్రతినిధిగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ను పంపించారు. అనారోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నానని.. మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం ఇదే అంటూ తన ప్రతినిధితో ఈడీ అధికారులకు లేఖ పంపారు. సుప్రీంకోర్టులో …
Read More »జగన్ సడన్ దిల్లీ టూర్?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీ వెళ్తున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ రోజు సాయంత్రం 4.30కి తన ఇంటి నుంచి బయలుదేరే జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి దిల్లీ వెళ్తారు. రాత్రి 7.15కి ఆయన దిల్లీ ఎయిర్‌పోర్టులో దిగుతారు. కాగా జగన్ దిల్లీలో శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న …
Read More »డిల్లీలో ఏమి జరుగుతోంది ?
లిక్కర్ స్కాం లో ఢిల్లీలో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అయితే ఏదో జరగబోతోందని మాత్రం అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ లో గురువారం కల్వకుంట్ల కవితను ఈడీ రెండో విడత విచారణ చేయబోతోంది. మొన్న 11వ తేదీన మొదటిసారి జరిగిన విచారణ దాదాపు తొమ్మిది గంటలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న కవిత ఉదయం 11 గంటల …
Read More »అనురాధ విజయం ఖాయమా ?
వైసీపీ అధినేత జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని చోట్ల గెలవాల్సిందేనని పార్టీ శ్రేణులకు హుకుం జారీ చేశారు. పార్టీ నేతలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ప్రత్యర్థులు ఊరుకుంటారా. వచ్చిన అవకాశాన్ని వదులుకుంటారా.. అభ్యర్థిని రంగంలోకి దించారు. ఇప్పుడు అధికార పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి. ఇంతకీ ఏమిటా ఎన్నికలు అనే కదా అనుమానం. అవే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు. ఒక సీటు గెలిచే అవకాశం ఉండటంతో …
Read More »వరుస వివాదాలతో ఇబ్బందుల్లో టీడీపీ!
టీడీపీని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఏదో చేయాలనే తొందరో.. లేక అధికార పక్షాన్ని మరింత డిఫెన్స్ లోకి నెట్టాలనే ఆతృతో తెలియదు కానీ.. టీడీపీ చేస్తున్న పనులతో ఆ పార్టీనే ఇబ్బందుల్లో పడుతోందని అంటున్నారు పార్టీ అభిమానులు. కొన్నాళ్ల కిందట.. గన్నవరంలో టీడీపీ కార్యాలయం ధ్వంసం జరిగింది. ఈ క్రమంలో పార్టీ కీలక నాయకుడు, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆయనను పోలీసులు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates