ఏపీలో బాబాయ్.. తెలంగాణలో అబ్బాయ్..

ఆంధ్రుల అభిమాన అన్న, యువగపురుషుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నారు. ఏడాది పొడవునా వంద సభలు నిర్వహించిన టీడీపీ, ఎన్టీఆర్ కుటుంబం కలిసి నిర్ణయించారు. ఇటీవలే ఒక సభకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఆహ్వానించారు. ఆ కార్యక్రమాలన్నింటినీ నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు.

కట్ చేసి చూస్తే ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఖమ్మం నగరంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు కాబోతోంది. రూ.4.5 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ విగ్రహాన్ని మే 28న ఆవిష్కరిస్తారు.

విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్‌ను తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. దానితో తాను తప్పకుండా వస్తానని జూనియర్ హామీ ఇచ్చారు..

ఈ నేపథ్యంలోనే ఎన్టీయార్ ఫ్యామిలీలో పెద్దలను పిలవకుండా జూనియర్‌ను ఎందుకు పిలిచారన్న చర్చ మొదలైంది.అయితే 28 వరకు టైమ్ ఉందని అప్పాయింట్‌మెంట్‌ తీసుకుని వెళ్లి అందరినీ పిలుస్తామని తెలంగాణ ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందింది. చూడాలి మరి ఏమవుతుందో…