సొంతింటిని చక్కదిద్దు కోవటానికి చంద్రబాబునాయుడు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గాల్లోని వైరి వర్గాలను పిలిపించి మాట్లాడుతున్నారు. అంటే అనేక నియోజకవర్గాల్లో నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే విషయమై దృష్టిపెట్టారు. పార్టీ చాలాచోట్ల బలంగా ఉంది. దీనికి కారణం నేతలు ఎంతమాత్రం కాదు. పార్టీకి కమిటెడ్ గా ఉండే క్యాడర్ వల్లే పునాదులు బలంగా ఉన్నాయి. అంటే పార్టీపై క్యాడర్లో ఉన్న అభిమానం చాలామంది నేతల్లో కనబడటం లేదు. ఇదే పార్టీకి పెద్ద సమస్యగా తయారైంది.
ఇపుడీ విషయం మీదే చంద్రబాబు దృష్టిపెట్టారు. నియోజకవర్గాల్లో విభేదాలున్న నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. వాళ్ళ మధ్య ఉన్న వివాదాలను కనుక్కుని సర్దుబాటు చేస్తున్నారు. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, కడప, రాజంపేట, బద్వేలు నియోజకవర్గాల్లో ఇలాంటి ప్రయత్నమే చేశారు. చాలావరకు సక్సెస్ అయ్యిందనే అనుకుంటున్నారు. అందుకనే కర్నూలు జిల్లాలో కూడా ఇదే మంత్రం వేసేందుకు రెడీ అయ్యారు.
జిల్లాలోని ఆళ్ళగడ్డ, నంద్యాల, ఎమ్మిగనూరు, కర్నూలు, నందికొట్కూరు, శ్రీశైలం, డోన్, ఆదోని నియోజకవర్గాల్లోని నేతలతో కూడా భేటీ అవబోతున్నారు. ఈ జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. 14 నియోజకవర్గాల్లోను గెలిచింది. దాంతో పార్టీ బాగా వీకైపోయింది. అందుకనే వచ్చే ఎన్నికల్లో పరిస్థితి మారాలన్న ఉద్దేశ్యంతోనే నేతలతో భేటీలు జరుపుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే భూమా అఖిలప్రియ లాంటి నేతల వల్లే జిల్లా అంతా కంపు అయిపోతోంది. అఖిలతో సర్దుకుని వెళ్ళమని సీనియర్ తమ్ముడు ఏవీ సుబ్బారెడ్డికి చెబితే సాధ్యం కాదు.
ఎందుకంటే ఒకళ్ళపై మరొకళ్ళు హత్యకుట్ర ఫిర్యాదులు చేసుకున్నారు. అఖిల వల్ల నంద్యాల, ఆళ్ళగడ్డలో పార్టీ బాగా తినేస్తోంది. అయినా చంద్రబాబు ఉపేక్షిస్తున్నారు. ఎవరిమీద కఠినచర్యలు తీసుకోలేకపోవటమే చంద్రబాబు బలహీనత. దీన్ని అఖిల లాంటి నేతలు అడ్వాంటేజిగా తీసుకుంటున్నారు. చంద్రబాబు దృష్టిపెట్టాల్సిన నియోజకవర్గాలు ఇంకా చాలా ఉన్నాయి. అందుకనే చాలా స్పీడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లోపు ముందు సొంతింటిని చక్కదిద్దుకుంటే తర్వాత పొత్తులు, ప్రత్యర్ధిపార్టీల గురించి ఆలోచించవచ్చన్నది చంద్రబాబు ఆలోచనలాగుంది. ఆలస్యంగా అయినా చంద్రబాబు ప్రయత్నం మంచిదే అనేచెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates