ఏపీలో రాజకీయాలు చూస్తుంటే రేపే పోలింగా అనేటట్లుగా ఉంది. అంత స్పీడయిపోయాయి పాలిటిక్స్. ముఖ్యంగా ఇంతకాలం స్తబ్దుగా ఉన్న కాపు నేతలు పార్టీలకు అతీతంగా వేగం పెంచారు. వరుస భేటీలు జరుగుతున్నాయి.. సంచలన ప్రకటనలు వస్తున్నాయి.. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు అయిదు జిల్లాల్లో కాపు నేతల కదలికలు మహా స్పీడుగా ఉంది. కాపు నేతలు ఒక్కసారిగా వేగం పెంచడంతో ఊహాగానాలు కూడా ఎక్కువయ్యాయి. వంగవీటి రాధా పార్టీ …
Read More »బాబు.. లోకేష్.. ప్రజల్లోకి ఎలా?
టీడీపీకి రాజకీయ భవిష్యత్ ఉండాలంటే ఏపీలో 2024లో జరిగే ఎన్నికల్లో గెలవడం అత్యవసరం. ఆ ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోతే ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి అంతే. నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ ప్రస్థానం ముగింపునకు చేరుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలపై బాబు ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. …
Read More »మంత్రి నాని మరిచిన ఒక లాజిక్
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన సమస్యల మీద జనాల దృష్టి నిలవకూడదని, వాళ్లను డైవర్ట్ చేయాలని చూస్తున్నారో ఏమో తెలియదు కానీ.. కొంత కాలంగా అక్కడ సినిమా టికెట్ల ధరల వ్యవహారమే ప్రధాన చర్చనీయాంశంగా ఉంటోంది. చిన్న స్థాయి నాయకుల నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఈ అంశం గురించి తెగ స్పందించేస్తున్నారు. ఈ విషయం మీదే ప్రెస్ మీట్లు, టీవీ చర్చల్లో కూడా మంత్రులు పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు …
Read More »టీడీపీ-జనసేన: నాదెండ్లకు తెనాలి సీటు..?
ఏపీలో టీడీపీ-జనసేన పార్టీల పొత్తు ఫిక్స్ అవుతుందో లేదో తెలియదు గానీ..ఆ రెండు పార్టీల పొత్తు గురించి చర్చలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ సారి ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య పొత్తు మాత్రం ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అసలు రెండు పార్టీలు కలిస్తేనే జగన్కు చెక్ పెట్టడం సాధ్యం అవుతుందని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ మేరకు టీడీపీ – జనసేన పార్టీ నేతల అంతర్గత చర్చల్లోనూ ఇదే …
Read More »మోడీ భేటీతో ఏపీకి మరో అప్పు
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో.. తొలి రోజున ప్రధాని నరేంద్ర మోడీని కలవటం.. ఆ సందర్భంగా ఆయన పాత డిమాండ్లను సరికొత్తగా ఆయన ముందు పెట్టటం.. వాటిని పరిశీలిస్తానని చెప్పటం.. అదే విషయం మీడియాలో రావటం తెలిసిందే. మోడీతో సీఎం జగన్ భేటీ తర్వాత ఏం జరిగింది? అన్న విషయానికి వస్తే.. ఏపీకి రూ.2500 కోట్ల కొత్త అప్పునకు ఓకే చెప్పటమే కాదు.. గంటల వ్యవధిలోనే …
Read More »కాపుల్లో ఆధిపత్య గొడవలు?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానాలు మొదలయ్యాయి. కాపులకు రాజ్యాధికారం దక్కాలనే డిమాండ్ ఎప్పటినుండో వినిపిస్తున్నదే. ఇదే విషయమై ఇప్పటికి కాపుల్లోని ప్రముఖులతో చాలా సమావేశాలే జరిగాయి. అయితే సమావేశాలు సమావేశాల్లాగే మిగిలిపోయాయి. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇపుడు కాపు ప్రముఖుల మధ్య సమావేశాలు మొదలయ్యాయి. గడచిన నెలరోజుల్లో మూడుసార్లు సమావేశమయ్యారు. ఇక్కడే అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. అదేమిటంటే కాపులకు నాయకత్వం వహించేందుకు పోటీ మొదలైనట్లే అనుమానంగా …
Read More »గట్టి అభ్యర్ధుల కోనం టీడీపీ వేట
తెలుగుదేశం పార్టీ గట్టి అభ్యర్ధుల కోసం వేట మొదలుపెట్టింది. తొందరలోనే 22 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వివిధ కారణాలతో 22 మున్సిపాలిటీలకు అప్పట్లో ఎన్నికలు జరగలేదు. కాలపరిమితి ముగియని కారణంగా, కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగని 22 మున్సిపాలిటీలకు తొందరలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇదే విషయమై చంద్రబాబు నాయుడు ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఎన్నికలు జరగాల్సిన 22 మున్సిపాలిటీల పరిధిలోని నేతలు కూడా ఈ సమావేశంలో …
Read More »జగన్ ను టార్గెట్ చేసిన వర్మ
సినిమా టికెట్ రేట్ల వ్యవహారంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ణయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వర్మ….మంత్రి పేర్ని నానికి సంధించిన ప్రశ్నలు వైరల్ అయ్యాయి. అయితే, వర్మ వ్యాఖ్యలపై నానిగానీ, వైసీపీ నేతలుగానీ ఇప్పటిదాకా స్పందించలేదు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారం సద్దమణగక ముందే ఏకంగా సీఎం జగన్ పై వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల …
Read More »జగన్ కు చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్
సీఎం జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎంగా ఉంటే పోలవరం పూర్తి కాదని, పోలవరంపై శ్వేతపత్రం ఇచ్చే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా?అని చంద్రబాబు ఛాలెంజ్ చేశారు. తన రాజకీయ చరిత్రలో ఈ తరహా పాలన ఎప్పుడూ చూడలేదని, వైసీపీ పాలనతో ప్రజలంతా నష్టపోతున్నారని విస్మయం వ్యక్తం చేశారు. ఏపీ భవిష్యత్ కోసం ప్రజలంతా ఆలోచించాలని, ప్రస్తుత పాలన వల్ల రాష్ట్రంలో …
Read More »జగన్ డబ్బులు.. సినిమాల పాలు
సినిమా టికెట్లకు సంబంధించిన వ్యవహారం ఏపీలో కొంత కాలంగా ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. రాష్ట్రంలో ఇంకే సమస్యలూ లేనట్లుగా ప్రభుత్వం దీని మీద పెడుతున్న శ్రద్ధా అంతా ఇంతా కాదు. ఓపక్క మంత్రులు.. ఇంకో పక్క అధికారులు ఈ అంశాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లుగా కనిపిస్తున్నారు. టికెట్ల రేట్ల మీద పాత జీవోను బయటికి తీసి ఆదేశాలు జారీ చేయడం.. ధరల విషయమై థియేటర్ల మీద దాడులు చేయడం.. సమావేశాలు నిర్వహించడం.. …
Read More »ముందస్తు ఎన్నికలే లక్ష్యం.. చంద్రబాబు వ్యూహం?
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల సంచల న వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన తన వేగాన్ని పెంచారు. అదేసమయంలో వ్యూహా లను కూడా మార్చుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలు ఎప్పడొచ్చినా వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు పార్టీని సన్నద్ధం చేసే దిశగా వ్యూహ రచన చేస్తున్నారు. పార్టీ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలంటే 2022 సంవత్సరం ఎంతో కీలకమని భావిస్తున్న ఆయన…, అందుకు …
Read More »బీజేపీకి కావాల్సిందదే!
ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు మునుపటిలా లేవు. టీఆర్ఎస్ ఆధిపత్యానికి క్రమంగా గండి పడుతూనే ఉంది. వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్కు ఇప్పుడు తలనొప్పులు తప్పడం లేదు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు పుంజుకోవడమే అందుకు కారణం. ముఖ్యంగా బీజేపీ కేసీఆర్కు కొరకరాని కొయ్యలా మారింది. ఆ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని భావించిన కేసీఆర్ బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వరి కొనుగోళ్ల విషయంలో …
Read More »