ఈసారి ఎలాగైనా గెలుస్తామంటూ లోకేష్‌ ధీమా!

వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి గెలుస్తానని టీడీపీ యువనేత నారా లోకేష్‌ గట్టిగానే ఉన్నారు. ఎక్కడ పోగోట్టుకున్నామో అక్కడే వెదుకోవాలి అనే సామెతను ఆయన ఒంటపట్టించుకున్నారు. అందుకే ఆయన మంగళగిరి మీద గట్టి ఫోకస్‌ పెట్టినట్లుగానే కనిపిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ అధికారంలోకి వచ్చి తీరుంతుందని ఆయన ధీమాగా ఉన్నారు.

తన తండ్రే నెక్ట్స్‌ సీఎం అంటూ లోకేష్‌ ఫిక్స్‌ అయినట్లే కనిపిస్తుంది. అటు టీడీపీ అధిష్టానం కూడా లోకేష్‌ గెలిచి అసెంబ్లీకి రావాలని గట్టి వ్యూహాలను పన్నుతుంది. కానీ మంగళగిరి టిక్కెట్టు అనేది టీడీపీకి హోప్‌ లేని నియోజకవర్గం. ఎందుకంటే అక్కడ గట్టి స్థానం ప్రస్తుత అధికార పార్టీదే.

అక్కడ బలమున్న నాయకులను వైసీపీలోకి ఎప్పుడో లాగేసుకున్నారు. వారిని పార్టీ నుంచి కదలకుండా చేసేందుకు ఉన్నత పదవులు కూడా కట్టబెట్టేసింది. దీంతో పాటు అక్కడ బాగా ఓట్లు పడతాయి అనుకున్న వర్గానికి అధిక మొత్తంలో సాయం చేస్తూ పేరు తెచ్చుసుకుంది కూడా. అందుకే ఈసారి కూడా గెలిచేసి ముచ్చటగా మూడోసారి వైసీపీ జెండా ఎగరవేసేద్దాం అనుకుంటుంది అధికార పార్టీ.

కానీ ఇక్కడ వైసీపీకి వ్యతిరేక చర్యలు కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని మార్పు. అలాగే ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌తో వైసీపీ ప్ర‌భుత్వం వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోంద‌ని, కావున ఎలాగైనా ఈ సారి గెలుస్తాన‌ని లోకేశ్ ధీమాగా వున్నారు. ఆయన శుక్రవారం కూడా మీడియాతో మాట్లాడుతూ.. మ‌రోసారి ఇక్క‌డే పోటీ చేస్తాన‌ని, భారీ మెజార్టీతో గెలుస్తాన‌ని చెప్పుకొచ్చారు. అభివృద్ధే చేయ‌ని వైసీపీని జ‌నం ఆద‌రించ‌ర‌న్నారు.