ఏపీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యవసరం. తనకు రాజకీయ మనుగడ ఉండాలన్నా.. టీడీపీకి భవిష్యత్ ఉండాలన్నా 2024 ఎన్నికల్లో పార్టీకి గెలుపు కావాలి. దీంతో ఇప్పటికే పార్టీ బలోపేతంపై బాబు సీరియస్గా దృష్టి సారించారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ ఇంఛార్జీలను నియమిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా గన్నవరంపై బాబు ఫోకస్ చేసినట్లు తెలిసింది. గన్నవరంలో మొదటి నుంచి టీడీపీకి మంచి …
Read More »కేసీఆర్ వర్సెస్ గవర్నర్: తగ్గేదే లేదు
తెలంగాణ రాజకీయాలు గవర్నర్ వర్సెస్ టీఆర్ఎస్గా మారాయి. కేంద్రంలోని బీజేపీపై పోరు బావుటా ఎగరేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ తమిళి సైతో దూరం పెంచుకున్నట్లే కనిపిస్తోంది. తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ ప్రసంగం ఉండదని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత సమావేశాలకు ఇవి కొనసాగింపు కాబట్టి గవర్నర్ ప్రసంగాన్ని పెట్టడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై గవర్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం …
Read More »ఉక్రెయిన్ – రష్యా యుద్ధం.. టాప్ 5 లేటెస్ట్ అప్డేట్స్
ఉక్రెయిన్ – రష్యాల మధ్య జరుగుతున్న యద్ధం పదకొండో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ ను పూర్తిగా ఆక్రమించుకునే దిశగా రష్యా దళాలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. వారికి ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. అలా అని.. ఉక్రెయిన్ ఆస్తుల్నిను నాశనం చేయటంతో పాటు.. వారి ఆర్థిక మూలాలు.. ప్రజల ప్రాణాలతో పాటు సైనిక సామర్థ్యాన్ని దారుణంగా దెబ్బ తీసే విషయంలో రష్యా అంతకంతకూ ముందుకు వెళుతూనే ఉంది. మరోవైపు.. రష్యా సైన్యానికి ఉక్రెయిన్ల నుంచి ఎదురవుతున్న …
Read More »జగన్ వెయ్యి రోజుల పాలన: పంచు… దంచు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి అక్షరాలా 1000 రోజులు అయింది. ఒక్క ఛాన్స్ అంటూ.. 2019లో ఏపీ ప్రజలకు ఆయన చేసిన విన్నపాల ఫలితంగా దేశంలోని ఏ రాష్ట్ర ప్రజలు.. ఏ పార్టీకి కట్టబెట్టనటువంటి స్థాయిలో అనూహ్యమైన మెజారిటీతో 151 మంది ఎమ్మెల్యేలతో ఆయనకు అధికారం ఇచ్చారు. మరి ఇంత భారీ విజయాన్ని అది కూడా తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా సాధిం చని …
Read More »రాయుడుగారు ‘జంప్’ జిలానీ
ఇప్పటికే నాలుగు పార్టీలు మారిన ఆ సీనియర్ నేత మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా? వైసీపీ నుంచి జంప్ అయేందుకు రంగం రెడీ చేసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ నాయకుడు ఎవరూ అంటే.. కొత్తపల్లి సుబ్బారాయుడు. సీనియర్ నేత అయిన ఆయన మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పటికే టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైసీపీ కండువాలు కప్పుకున్న ఆయన.. మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం …
Read More »జంపింగ్లకు సిద్ధంగా వైసీపీ ఎమ్మెల్యేలు!
ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో ఘన విజయంతో వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చింది. జగన్ తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. జగన్ హవా సాగడంతో 2019 ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా 151 సీట్లు దక్కాయి. జగన్ పేరుతో ఫ్యాను గాలి వీచడంతో అభ్యర్థులు విజయాలు సాధించారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టి ఇటీవల 1000 రోజులు పూర్తయ్యాయి. ఈ రెండున్నరేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఒడుదొడుకులు …
Read More »‘జగన్ ను మోడీ తండ్రిలా అప్యాయంగా చూసుకుంటారు’
అడిగిన దానికి అడిగినంత వరకు సమాధానం చెప్పటం కొంతమంది రాజకీయ నేతలకు అలవాటు. అందుకు భిన్నంగా అడిగిన దానికి అవసరం లేకున్నా సమాధానం చెబుతూ.. ఆ క్రమంలో మరింత సమాచారాన్ని అందించి రాజకీయ కాకకు కారణమవుతుంటారు మరికొందరు నేతలు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి కోవలోకి వస్తారు. ఆమెను ఎంతలా ఇరుకున పెట్టాలని చూసినా.. పప్పులు ఉడకవు. ఎంతవరకు సమాధానం ఇవ్వాలో అంతే ఇచ్చే ఆమె.. అనవసర వ్యాఖ్యలకు.. …
Read More »డిసెంబరులోనే అసెంబ్లీ రద్దు.. ముందస్తు ఖాయం
అవినీతికి చిట్టా బయటపడుతుందనే సీఎం కేసీఆర్ రోజుకో నాటకానికి తెరలేపుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. డిసెంబర్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని కథ తేలుస్తా.. గద్దె దించేవరకు నిద్రపోనని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని అన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి …
Read More »అమరావతి కాదు కమ్మరావతి: మంత్రి అప్పలరాజు
అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులంటూ ప్రభుత్వం మొండిపట్టు పట్టి అమరావతిని నిర్లక్ష్యం చేస్తున్న తరుణంలో ఈ తీర్పు రావడంతో వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న తరహాలో తాము పరిపాలిస్తున్న రాష్ట్రానికి మూడు రాజధానులు అంటున్నారు వైసీపీ నేతలు. ఈ క్రమంలోనే ఆ తీర్పును కొందరు వైసీపీ …
Read More »ఎన్నికల ఆఫర్ ముగుస్తోంది.. పెట్రోల్ నింపుకోండి: రాహుల్
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచనుందని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఎన్నికల ఆఫర్’ త్వరలోనే ముగియనుందని ఎద్దేవా చేశారు. ప్రజలు పెట్రోల్ ట్యాంక్లను ఫుల్ చేసుకోవాలని సూచించారు. రాబోయే పెట్రోల్ ధరల పెంపును ఉద్దేశించి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై రాహుల్ విరుచుకుపడ్డారు. …
Read More »ముమ్మాటికీ మూడు రాజధానులే: మంత్రి బొత్స
ఒక వైపు కోర్టు ఆదేశాలు.. మరోవైపు.. రాజధాని రైతుల ఆవేదన.. వెరసి.. రాజధాని అమరావతి విషయంలో స్పష్టత వచ్చింది. అయినప్పటికీ.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేస్తోంది. మాడు రాజధానుల అంశంపై పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. ముమ్మాటికీ పాలనా వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతల అభిప్రాయాలు తమ ప్రభుత్వానికి ప్రామాణికం కాదని.. శివరామకృష్ణ కమిషన్ కూడా …
Read More »బాబు తప్ప.. అసెంబ్లీకి టీడీపీ ఎమ్మెల్యేలు
సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల హాజరుపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తుది నిర్ణయం తీసుకుంది. గత నవంబరులో జరిగిన సమావేశాల్లో చంద్రబాబు సతీమణిని వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ఘోరంగా అవమానించారంటూ.. బాబు కన్నీరు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే చట్టసభలకు వెళ్లరాదని, సీఎం అయ్యాకే వస్తానని శపథం చేశారు. దీంతో సభకు వెళ్లాలా? వద్దా అనే విషయంపై పార్టీ రెండురోజులుగా నేతలతో సమావేశం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే …
Read More »