రాబోయే ఎన్నికల్లో జనాలకు ముఖ్యంగా యూత్ కు బాగా దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్ కొత్త దారిలో వుడుతోంది. ఇంతకీ అదేమిటంటే డిజిటల్ యాఫ్ ల ద్వారా ప్రచారంలో దూసుకుపోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ కామర్స్ సైట్లలో పార్టీతో పాటు అభ్యర్ధుల ప్రచారం చేయాలని కేసీయార్ డిసైడ్ చేశారు. అమెజాన్, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్, ఫ్లిప్ కార్టు వేదికలను ఎంత వీలుంటే అంత ఎక్కువగా వాడేసుకోవాలన్నదే కేసీయార్ ఉద్దేశ్యం. దీనివల్ల ఏమవుతుందంటే యువతతో పాటు మధ్య తరగతిలో మొబైల్ యూజర్లకు బాగా చేరువయ్యే అవకాశం ఉంటుంది.
అవకాశం, అవసరాన్ని బట్టి ఓటీటీ ప్లాట్ ఫారాల ద్వారా కూడా ప్రచారం చేయాలని కేసీఆర్ ఇప్పటికే డిసైడ్ అయ్యారు. సుమారు రెండు నెలల పాటు డిజిటల్ ప్రచారానికి కేసీఆర్ మాట్లాడుతున్నారట. ఇప్పటి రోజుల్లో ఒక ఇంట్లో నలుగురుంటే నలుగురూ మొబైల్ యూజర్లుగానే ఉంటున్నారు. కాబట్టి ఇంటింటికి ప్రచారానికి వెళ్ళడానికి అదనంగా మొబైల్ ద్వారా ప్రచారం చేస్తే ఎక్కువగా రీచ్ ఉంటుందన్నది ఆలోచన. ఇంటింటికి ప్రచారం అంటే మహాయితే మొత్తం ప్రచారంలో ఒకసారి వెళ్ళగలిగితే అదే చాలా ఎక్కువ.
ఇదే మొబైల్ ద్వారా ప్రచారం, డిజిటల్ యాప్ ప్రచారం అయితే ప్రతిరోజు ఓటర్లకు విసుగు పుట్టినా కూడా పలకరిస్తూనే ఉండచ్చు. పేటిమ్, మీషో, ట్రూకాలర్ తదితర యాపుల ద్వారా కూడా ప్రచారం చేయటానికి వీలుగా ఢిల్లీలోని ఏజెన్సీలతో కాంట్రాక్టు మాట్లాడుతున్నట్లు సమాచారం. ఫేస్ బుక్, ట్విట్టర్, మైట్లో బ్లాగింగ్ యాఫ్ లు ఇప్పటికే పెయిడ్ ప్రమోషన్లు చేస్తున్నాయి.
అయితే ఇక్కడ బీఆర్ఎస్ చూస్తున్నది ఏమిటంటే ప్లాట్ ఫారాల యూజర్ బేసుల విషయమై మాట్లాడుతున్నది. ఏ యాప్ కు ఎంత మంది యూజర్లున్నారనేదాన్ని బట్టి ధరలు చార్జిచేస్తారు. ఇపుడా విషయమే టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు ఢిల్లీలోని కొన్ని ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నారట. ఎస్ఎంఎస్ లు వాయిస్ మెసేజ్ లు, వాయిస్ రికార్డింగుల్లో ప్రచారం ఎలాగూ ఉంటుంది. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం ఇటు సంప్రదాయంగాను అటు కొత్తపుంతలు తొక్కేవిధంగాను ఉండబోతోన్నది వాస్తవం.