వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ తీరుపై ఆయన విరుచుకుపడ్డారు.
తండ్రి మరణం ఇంకా నిర్ధారణ కాక ముందే జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం యత్నించారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని నాడు ఆరోపణలు వినిపించాయని గుర్తు చేసిన అచ్చెన్న… ఆ ఆరోపణలు ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణే చేశారని తెలిపారు.
వైఎస్ చనిపోయిన నాటి పరిస్థితులను గుర్తు చేసిన అచ్చెన్న…నాడు వైఎస్ కు ఏం జరిగిందోనన్న విషయంపై అంతా ఆందోళన చెందుతూ ఉంటే… జగన్ మాత్రం సీఎం కుర్చీ కోసం సంతకాల సేకరణలో మునిగిపోయారని ఆయన విమర్శించారు. వైఎస్ ఆచూూకీ తెలియక అంతా గాభరా పడుతూ ఉంటే…జగన్ మాత్రం సీఎం పదవి కోసం పాకులాడుతూ కనిపించారన్నారు.
అందులో భాగంగానే రియలన్స్ దుకాణాలపై జగనే దాడి చేయించారని ఆయన చెప్పారు. ఆ తర్వాత అదే రియలన్స్ ను మంచి చేసుకున్న జగన్… ఆ సంస్థకు చెందిన పరిమశ్ నత్వానీకి తన పార్టీ తరఫున రాజ్యసభ సీటిచ్చారని గుర్తు చేశారు.
వైఎస్ మరణంపై నాడు చాలా మంది సీనియర్ నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించిన అంశాలను అచ్చెన్న గుర్తు చేశారు. వైసీపీలో కీలక నేతగా, ప్రస్తుతం శాసనమండలిలో ప్రథాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న బొత్స సత్యనారాయణ అయితే సంచలనాలకే సంచలన వ్యాఖ్యలు చేశారని ఆయన చెప్పారు.
వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని నాడు బొత్స అన్నారని ఆయన గుర్తు చేశారు. సభ్య సమాజంలో ఏ ఒక్కరు కూడా ఇలాంటి పనులు చేయరని తాము అనుకున్నామన్నారు. ఓ సైకోకు పదవీ వ్యామోహం వస్తే… ఆ పదవి కోసం వారు ఏమైనా చేస్తారని అచ్చెన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తండ్రి మరణాన్ని వాడుకుని సానుభూతి పొందేందుకు జగన్ యత్నించారని అచ్చెన్నా ధ్వజమెత్తారు. తండ్రి మరణం ఇంకా నిర్ధారణ కాకముందే… సీఎం పదవి కోసం ఎమ్మెల్యేల సంతకాలను జగన్ సేకరిస్తూ సాగిన వైనాన్ని కూడా చూశామని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ తీరును ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ఎండగడుతూ సాగుతున్న అచ్చెన్న ఈ దఫా వైఎస్ మరణాన్ని గుర్తు చేస్తూ జగన్ పై విమర్శలు గుప్పించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.
అయితే దీనిపై వెంటనే స్పందించిన బొత్స కంట తడి పెడుతూ, రాజకీయాలకోసం మహానుభావుడిని లాగుతున్నారని చెబుతూ ఆ రోజు తానే జగన్ ను రెండు చేతులు పట్టుకొని తీసుకొచ్చింది గుర్తు చేశారు. పరిపాలన విధానంగా విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలని, అలాంటి దివంగత నేతల మృతిపై ఇటువంటి మాటలు మాట్లాడడం పద్ధతి కాదని మండిపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates