వైసీపీ అధినేత జగన్ పాలిటిక్స్ భిన్నంగా ఉన్నాయి. ఆయన ఏం జరిగినా భిన్నంగా ఆలోచన చేస్తారు. ఏ విషయాన్ని కూడా ఆయన సీరియస్‌గా తీసుకోరు. ఇది మంచిది కాదు. కొంపతీసి రాసేస్తారా ఏంటి? రాయమాకండి! అని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు. నిజమే! జగన్ పాలిటిక్స్ అంతే అని మిగిలిన నాయకుల మాట కూడా. ఆది నుంచి ఏం …
Read More »జగన్ విమానం ఎక్కేసరికి నీళ్లన్నీ ఇంకిపోయాయి: చంద్రబాబు
నా నియోజకవర్గంలో వారు (వైసీపీ) పాగా వేయాలని అనుకున్నారు. అందుకే సినిమా సెట్టింగులు వేసి కుప్పం నియోజకవర్గంలో నీరు పారించామని డ్రామాలు ఆడారు. ఎక్కడి నుంచో నీరు తీసుకువచ్చి ఇక్కడ పారించి రిబ్బన్లు కట్ చేశారు. కానీ, జగన్ తిరిగి విమానం ఎక్కేసరికి ఆ నీళ్లన్నీ ఇంకిపోయాయి. ఇదీ ఆనాటి పాలన. కానీ ఇప్పుడు వరద ప్రవాహం మీరు చూస్తున్నారు. మనసు పెట్టి పనులు చేస్తున్నాం. కృష్ణమ్మను తీసుకువచ్చాం. రైతులకు, …
Read More »దసరా తర్వాత.. పవన్ `త్రిశూల్`!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. దసరా పండుగ తర్వాత.. జనసేన తరఫున `త్రిశూల్` కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. విశాఖపట్నంలో జరుగుతున్న `సేనతో సేనాని` కార్యక్రమంలో చివరి రోజు శనివారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తు పార్టీ వ్యూహాలను ఆవిష్కరించారు. విశాల దృక్ఫథం ఉన్న యువతకు పార్టీ పెద్దపీట వేస్తుందన్నారు. పదవుల కోసం, …
Read More »సభలో సహకరిస్తాం కానీ: కేటీఆర్ షరతులు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము సభలో సహకరిస్తామని చెప్పారు. ఏ విషయంపైనైనా అర్థవంతమైన చర్చలు చేపట్టేందుకు పూర్తిగా సహకారం ఉంటుందని తెలిపారు. అయితే సభ విషయంలో తాము సూచించినట్టు నిర్ణయాలు తీసుకోవాలని షరతులు విధించారు. సభను కేవలం మొక్కుబడిగా నాలుగు రోజులు నిర్వహించి చేతులు దులుపుకోవద్దన్నారు. కనీసం రెండు …
Read More »అజారుద్దీన్ ఒకటి తలస్తే మరొకటైందే!
కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెట్ మహమ్మద్ అజారుద్దీన్ ఒకటి తలస్తే మరొకటైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో ఆయన మరోసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు. ఇక్కడి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ టికెట్‌పై అజారుద్దీన్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. రెండు నెలల …
Read More »సొంతవాళ్లనే హతమార్చిన డీఎన్ఏ మాది కాదు: కోటంరెడ్డి
వైసీపీ మాజీ నాయకుడు, ప్రస్తుత టీడీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాజీ సీఎం జగన్‌పై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత వాళ్ళని చంపించే డీఎన్ఏ తమకు లేదన్నారు. ఆస్తులు, అంతస్థుల కోసం.. తండ్రి సొమ్ములో వాటాల కోసం.. తోడబుట్టిన వారిని వేధించి.. తరిమి కొట్టే తత్వం కూడా తనకు లేదని వ్యాఖ్యానించారు. తాను అనేక ఇబ్బందులు పడి రాజకీయాల్లో ఉన్నానని.. ఇబ్బందులు.. …
Read More »బీసీల రిజర్వేషన్లపై రేవంత్ సంచలన నిర్ణయం
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల వ్యవహారం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితి కోటా వంటి అంశాలపై గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఆ విషయాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై …
Read More »హరీష్‌రావు-కేటీఆర్ అరెస్టు.. హైదరాబాద్‌లో ఉద్రిక్తత
హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ కీలక నాయకులు, ఎ మ్మెల్యేలు.. హరీష్‌రావు, కేటీఆర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరితోపాటు.. పార్టీ కార్యకర్తలు, నాయకుల అనుచరులను కూడా అదుపులోకి తీసుకుని సెక్రటేరియట్ పరిధిలోని ఖైరతాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో పరిస్థితి తీవ్రంగా మారింది. కేటీఆర్-హరీష్‌రావుల అరెస్టు వార్తతో తెలంగాణ భవన్ నుంచి పెద్ద ఎత్తున అనుచరులు సెక్రటేరియెట్‌కు బయలు దేశారు. దీంతో వీరిని …
Read More »రుషికొండ ప్యాలెస్‌పై అధ్యయనం.. కూటమి కీలక నిర్ణయం!
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌ను ఏం చేయాలన్న విషయం కూటమి ప్రభుత్వానికి కొరుకుడు పడడం లేదు. ప్రభుత్వం మారి 15 మాసాలు అయినప్పటికీ.. ఇప్పటికీ ఈ విషయం బ్రహ్మపదార్థంగానే మారిపోయింది. అలాగని వదలేస్తే.. ఈ నిర్మాణాలు దెబ్బతింటున్నాయి. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించిన సమయంలో ఇక్కడ సీలింగ్ పెచ్చులు ఊడిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా గోడలు కూడా చెమ్మెక్కాయి. గదుల్లో …
Read More »నాయుడు వర్సెస్ రెడ్డి: తిరుమల హాట్ టాపిక్
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు, ఇదే పాలక మండలి మాజీ చైర్మన్, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిల మధ్య వాదప్రతివాదాలు తారస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణల వరకు వివాదం ముదిరింది. తిరుపతి నుంచి భూమనను తరిమికొట్టాలని బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై భూమన తీవ్రంగా స్పందించారు. ఎవరిని ఎవరు తరిమికొడతారో ప్రజలే తేలుస్తారని వ్యాఖ్యానించారు. తిరుమల పవిత్రతను …
Read More »ఐఏఎస్ శ్రీలక్ష్మి విషయంలో ‘చిత్రమైన’ తీర్పు!
ఏపీలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సంబంధించి సుప్రీంకోర్టు చిత్రమైన తీర్పు ఇచ్చింది. గతంలో దేనినైతే కోర్టు తప్పుబట్టిందో, ప్రస్తుతం మళ్లీ అదే విషయాన్ని సమర్థించడం గమనార్హం. అందుకే తాజాగా ఆదేశాలను న్యాయవాదులు, న్యాయవర్గాలు కూడా చిత్రమైన తీర్పుగా పేర్కొంటున్నారు. అంతేకాదు, ఆమె పేర్కొన్న వారికి కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. విషయం ఏంటంటే కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ …
Read More »కుప్పం.. ఇక నెంబర్ 1 నియోజకవర్గమే..!
ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం ఇక నెంబర్ 1 స్థానంలోకి వెళ్తుందా? ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి తిరుగులేదా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో చంద్రబాబు వరుసగా 7వ సారి విజయం సాధించిన తర్వాత ఇక్కడి పరిస్థితులు, పరిణామాలు కూడా మారుతున్నాయి. ఎన్నికలకు ముందు ఎలా ఉన్నా, ఇప్పుడు మాత్రం ఈ 15 మాసాల్లో నియోజకవర్గంలో సమూలమైన మార్పులు వచ్చాయి. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates