ప్రముఖ యాంకర్, నటి అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర లేదు. జబర్దస్త్ యాంకర్ గా తన ప్రస్థానం మొదలుబెట్టిన అనసూయ..అంచెలంచెలుగా ఎదిగి నటిగా సినిమాలలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే, అనసూయ డ్రెస్ లు, వ్యక్తిగత ఫొటోలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే, ఆ ట్రోలింగ్ కు వెనక్కు తగ్గని అనసూయ..కొందరు నెటిజన్లకు దీటుగా బదులిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా పవన్ ను తననూ పోలుస్తూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు అనసూయ ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది.
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, పుష్పవల్లిల పెళ్లికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. పవన్ తో ఫొటోలు దిగేందుకు చాలామంది పోటీపడడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే జనం మధ్యలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ చిక్కుకుపోయారు. దీంతో, ఆ వీడియో వైరల్ అయింది. అయితే ఏంటి? ఎమ్మెల్యేగా పవన్ గెలుస్తాడా? అనసూయ, రష్మి వచ్చినా జనాలు ఇలాగే ఎగబడతారు…అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
దీంతో, ఆ కామెంట్ పై అనసూయ ఘాటుగా స్పందించింది. ఇలా చులకనగా మాట్లాడటం సరికాదని, తాను ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చానని కౌంటర్ ఇచ్చింది. తన ప్రయాణాన్ని తక్కువ చేసి చూడొద్దని, అగౌరవంగా తమ పేరును లాగడం తప్పని హితవు పలికింది. జీవితంలో ఏదో సాధించిన వాళ్లు ఎలా ఉంటారో చూద్దామని జనం తమను చూసేందుకు వస్తారని చురకలంటించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates