తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారానికి కేసీయార్ రెడీ అవుతున్నారా? పార్టీ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఫిబ్రవరి 20 వ తేదీ నుండి కేసీయా టూర్ షెడ్యూల్ రెడీ అవుతున్నట్లు సమాచారం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితాలు వచ్చిన రెండో రోజే బాత్ రూమ్ లో కేసీయార్ జారిపడ్డారు. అప్పుడు తుంటి ఎముక విరిగింది. ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ చేయించుకున్నారు. కేసీయార్ ప్రభుత్వం పూర్తి బెడ్ రెస్టులో ఉంటున్నారు.
బహుశా ఫిబ్రవరి 3వ వారానికి కేసీయార్ పూర్తి ఫిట్టుగా అయిపోతారేమో. అందుకనే 20వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించటానికి పార్టీ ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. మెదక్ పార్లమెంటు నియోజవకర్గంలోని పరిధిలోనిగజ్వేలు నుండే పర్యటన మొదలవుతుందట. ముందుగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నారట. అంటే ఏకధాటిగా 17 బహిరంగ సభలు నిర్వహించటానికి పార్టీ షెడ్యూల్ ను పార్టీ రెడీ చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే ఓటమిపై పార్టీలో సరైన సమీక్ష జరగలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీయార్ సమీక్షలు చేస్తున్నా గందరగోళం జరుగుతున్నాయి. సమీక్షలు జరుగుతున్నపుడు గెలిచిన వారు, ఓడిపోయిన వాళ్ళు కూడా కేసీయార్ పదేళ్ళ పరిపాలనలో జరిగిన అవకతవకలు, అరాచకాలు, ఎంఎల్ఏలకు ద్వితీయ శ్రేణినేతలకు, క్యాడర్ మధ్య బాగా గ్యాప్ వచ్చేయటం కూడా ఓటమికి కారణమని బహిరంగంగానే చెబుతున్నారు. సమీక్షల్లో ఇలాంటి అనేక చర్చల కారణంగా నేతలు, క్యాడర్ లో గందరగోళం పెరిగిపోతోంది.
పార్టీ నేతల్లో పెరిగిపోతున్న కారణంగా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నేతలు, క్యాడర్ ను ఒకదారిలోకి తీసుకురావటం కోసం కేసీయార్ రాష్ట్ర పర్యటనలు పెట్టుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ గా కేసీయార్ పర్యటనలు, బహిరంగసభల ప్లాన్ జరుగుతోంది. ఫిబ్రవరి రెండోవారంలో బీఆర్ఎస్ భవన్ కు రాబోతున్నారట. వివిధ జిల్లాలు, పార్లమెంటు నియోజకవర్గాల నేతల నుండి గ్రౌండ్ లెవల్ ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. పర్యటనల సందర్భంగానే అభ్యర్ధుల ప్రకటన కూడా ఉండచ్చని పార్టీవర్గాలు అంటున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates