గుండ్లకమ్మ ప్రాజెక్టును వైసీపీ నేతలు, నీటి పారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు పట్టించుకోవడం లేదంటూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొద్ది రోజులు క్రితం విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు నీటిలో తేలుతున్నాయని, కానీ, సంబంధిత శాఖా మంత్రి మాత్రం సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారని షర్మిల వేసిన సెటైర్లు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా షర్మిల వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందించారు. ఈ క్రమంలోనే షర్మిలపై అంబటి షాకింగ్ కామెంట్లు చేశారు.
పాపం…షర్మిల పిచ్చి పిల్ల…ఓవర్ యాక్షన్ చేస్తోంది అంటూ అంబటి చేసిన కామెంట్లు షాకింగ్ గా మారాయి. అంతకన్నా తానేం చెప్పలేననని, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాస్త ఓవర్ యాక్షన్ చేస్తోందని అన్నారు. అయితే, రాజకీయాల్లో స్వేచ్ఛ ఉందని, ఆమెను ఓవర్ యాక్షన్ చేసుకోనివ్వాలని చెప్పారు అంబటి. మరి, అంబటి వ్యాఖ్యలపై షర్మిల స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates