తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్.. ఇక, నుంచి బీఆర్ఎస్గా అవతరించనుంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పనుంది. ఈ మేరకు టీఆర్ఎస్ అదినేత, సీఎం కేసీఆర్ భారత ఎన్నికల సంఘానికి పంపించిన ప్రతిపాదనకు ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊంపింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ గా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పేరు మార్పుపై ఈసీ నుంచి కేసీఆర్‌కు అధికారికంగా లేఖ అందింది. ఈ ఏడాది అక్టోబరు 5న విజయదశమి(దసరా) సందర్భంగా …
Read More »చెదిరిన చిరునవ్వు – సింహపురిలో వైసీపీ గుస గుస
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిలో మునుపటి సంతోషం లేదనిపిస్తోంది. ఆయన చిరునవ్వుతో కనిపించలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారంటున్నారు. తుఫానులు, వరదలు, పంట నష్టాలు, కరోనా… ఇలా ఏ సందర్భంలోనూ సీఎం జగన్ ముఖాన చిరునవ్వు చెదిరేది కాదు. ఆ ఫోటోలు, వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టింగ్ లు వస్తుండేవి. ఇప్పుడు మాత్రం ఆయన మొక్కుబడిగా నవ్వుతున్నారు. కొన్ని సందర్భాల్లో సీరియస్ గా ఉంటున్నారు. బుధవారం జరిగిన జగన్ నెల్లూరు …
Read More »వైసీపీ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందా ?
సోషల్ మీడియాలో ఇప్పుడో కొత్త ప్రచారానికి తెరలేచింది. అందులో నిజం ఎంత ఉన్నా… నిప్పులేదని పొగరాదని చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీ వారు ఆపరేషన్ ఆకర్ష్ అమలుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఏకంగా 70 మంది ఎమ్మెల్యేలకు స్కెచ్ వేశారని ప్రచారం జరగడంలో వైసీపీ అగ్రనేతల్లో టెన్షన్ పట్టుకుంది. తెలంగాణలో ఇటీవల ఎమ్మెల్యేల పోచింగ్ జరిగింది. పైలట్ రోహిత్ రెడ్డి సహా నలుగురిని …
Read More »కేసీఆర్ సార్ పెళ్లికెళ్లి పదవిని గిఫ్ట్ ఇచ్చారు!
ఎవరైనా పెళ్లికి వెళ్లినా..పేరంటానికి వెళ్లినా.. ఆతిథ్య ఇచ్చిన వారికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం సహజమే అయి తే.. తెలంగాణ సీఎం కేసీఆర్ చేయి పెద్దది కదా! ఆయనది ఏదో చిన్న గిఫ్ట్ ఇచ్చేంత మనసు కాదు. ఇస్తే గి స్తే.. పెద్ద గిఫ్టే ఇస్తారు. ఇప్పుడు కూడా అదే చేశారు. అయితే, ఇన్నాళ్లలో లేంది.. ఆయన ఏం చేశారంటే ఒక పెళ్లికి వెళ్లి ఏకంగా చైర్మన్ పదవిని గిఫ్ట్‌గా …
Read More »సజ్జలకు షర్మిల వార్నింగ్!
వైసీపీ ముఖ్య నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వార్నింగ్ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి ఉంచాలన్నదే తమ లక్ష్యమని వ్యాఖ్యానించిన సజ్జలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. “ఆయన ఏ మూడ్‌లో ఉండి మాట్లాడారో కానీ, సజ్జల చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివి” అని షర్మిల అన్నారు. అంతేకాదు, తెలంగాణ ఏర్పాటు, …
Read More »ఏపీ, తెలంగాణ కలిసిపోవాలన్నదే మా విధానం..: సజ్జల
రాష్ట్ర విభజనకు తాము పూర్తిగా వ్యతిరేకమని.. వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ .. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండనుంది? అనే అంశాలపై..సజ్జల స్పందించారు. అప్పట్లోనే రాష్ట్ర విభజనను వైసీపీ వ్యతిరేకించిందని, 2 తెలుగు రాష్ట్రాలు ఒకటిగా ఉండాలనేది వైసీపీ విధానమని సజ్జల చెప్పారు. రెండు రాష్ట్రాలను కలిపి …
Read More »ఉచితాలు మెచ్చని ఓటర్లు.. జగన్ తెలుసుకోవాల్సిందే!
ఏపీలో మరోసారి అధికారంలోకి వచ్చేస్తామని.. 30 ఏళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా చక్రం తిప్పుతామని చెబుతున్న ఏపీ సీఎం, వైసీపీ అధినేత Jagan తెలుసుకోవాల్సిన పాఠాలు.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలతో స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఇచ్చిన తీర్పును గమనిస్తే.. జనం ఏం కోరుకుంటున్నారో.. అర్ధమవుతోంది. ఏపీ విషయానికి వస్తే.. ప్రజలకు నేను మూడేళ్ల కాలంలో 4 లక్షల కోట్ల రూపాయలను పంచానని.. నాకు తప్ప …
Read More »గుజరాత్లో బీజేపీ గెలుపు.. టీడీపీకి ఓ లెస్సన్!
తాజాగా జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. అయితే..ఈ విజయం దక్కడం ఈ పార్టీకి ఇది దాదాపు 7వ సారి. అంటే.. ఇప్పటి వరకు ఉన్న పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టుల విజయాన్ని పక్కకు నెట్టి శతాబ్ది విజయాన్ని అందుకున్నట్టు అయింది. అయితే.. Gujarat లో BJP గెలుపు ఒక్కరోజులోనో.. ఎలాంటి పరిశ్రమా చేయకుండానో దక్కలేదు. అడుగడుగూ.. అణువణువూ గెలవాలన్న పార్టీ నేతల తపన.. కీలక నేతల వ్యూహాలు.. …
Read More »ఎన్నికలు ఇంకెంత ఆలస్యం? సామాన్యుడి ఎదురుచూపులు
ప్రభుత్వానికి, పార్టీకి తేడా లేకుండా అయిపోతోంది. ప్రభుత్వాలు పార్టీల నేతృత్వంలోనే ఏర్పడినా పనులు మాత్రం వేరు. పాలిటిక్స్‌ను పార్టీలు చేయాలి… పాలన ప్రభుత్వాలు చేయాలి. పాలన, పాలిటిక్స్ మధ్య ఉన్న విభజన రేఖను పాలక పార్టీలు చెరిపేస్తున్నాయి. ఎన్నికలు సమీపించే కొద్దీ ఈ జాడ్యం మరింత ఎక్కువైపోతోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటిని ప్రశ్నించాల్సిన ప్రజలు కూడా అలాంటి అవకాశం ఏమాత్రం లేకపోవడంతో సర్దుకుపోవడానికి అలవాటుపడిపోతున్నారు. ఉద్యోగులు ఒకటో తారీఖున జీతం …
Read More »ఔను.. నిజంగా ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి!
కేవలం రెండు రోజుల్లో ఏపీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోవడమే. ఒకటి మాదకద్రవ్యాల రవాణా, వినియోగం వంటివాటిలో ఏపీ నెంబర్1 స్థానంలో ఉందని కేంద్రమే రెండు రోజలు కిందట వెల్లడించింది. దీంతో ఆ విషయం చర్చనీయాంశమైంది. ఇంతలోనే కేంద్రం మరో బాంబు పేల్చింది. సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న, నమోదైన నేతల జాబితాలోనూ దేశంలో ఏపీ తొలి స్థానంలో ఉండడమే! గత ఐదేళ్లలో ప్రజా ప్రతినిధులపై నమోదైన సీబీఐ కేసులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా …
Read More »తప్పదు.. కేసీఆర్ తగ్గాల్సిన టైం వచ్చేసింది!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర గవర్నర్‌పై ఇప్పటి వరకు ఉన్న మూతి బిగింపులు.. అలకల విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం.. వచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం.. ఎన్నికల ముంగిట పంతాలకు, పట్టింపులకు పోతే.. కీలకమైన బిల్లుల విషయంలో మరింత సాచివేత కొనసాగడం ఖాయం. దీంతో అంతిమంగా నష్టం వచ్చేది తెలంగాణ ప్రభుత్వానికే. సో.. అందుకే ఇప్పుడు కేసీఆర్ దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఈ …
Read More »బీసీ సభ ఓకే.. కానీ, ఈ విమర్శల మాటేంటి జగన్ సర్!
ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతలు.. విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభ జయమో.. పరాజయమో.. ఏదో ఒకటి సాధించింది. ప్రతిపక్షాలు పరాజయం అంటే.. అధికార పార్టీ సహజంగానే జయమని చెప్పడం రివాజు కనుక.. దీని జోలికి పెద్దగా పోవాల్సిన అవసరం లేదు. అయితే.. సభ సందట్లో వచ్చిన విమర్శలు.. ఇక్కడ కనిపించిన సీన్లు.. ఇప్పుడు ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. వీటిపైనే ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు కూడా! ఇవీ..విమర్శలు.. జయహో …
Read More »