పవన్ సినిమాలపై వున్న శ్రద్ధ పింఛన్ల పై లేదా

ఏపీలో పింఛ‌న్ల పంపిణీ రాజ‌కీయం కొన‌సాగుతోంది. 3వ తేదీ నుంచి పింఛ‌న్లు పంపిణీ చేస్తామ‌ని వైసీపీప్ర‌భుత్వం చెప్పినా.. స‌రైన ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డంతో వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాద‌ప‌డుతున్న వారు.. పింఛ‌ను పంపిణీ కేంద్రాల‌కు చేరుకు ని ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో వ‌లంటీర్ల‌ను నిలిపివేశారంటూ.. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ పార్టీల‌పై వారు తీవ్ర ఆగ్ర హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ వివాదంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. సినిమా హాళ్ల ద‌గ్గ‌ర టికెట్ల పంపిణీకి టీచ‌ర్లు, వీఆర్ వోల‌ను నిల‌బెట్టిన వైసీపీ ప్ర‌భుత్వం ఇప్పుడు వారి సేవ‌ల‌ను ఎందుకు వినియోగించుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

పెన్షన్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గతంలో జారీ చేసిన ఉత్తర్వులను చూపిస్తూ మరీ ఘాటుగా ప్రశ్నించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ళ దగ్గర పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటని.. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు.. తహశీల్దార్ నంబర్స్ ఇస్తారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా అని ప్రశ్నించారు. కరోనా కాలంలో మద్యం షాపుల దగ్గర ఉద్యోగులకి డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లు ఇళ్ళ దగ్గర ఇవ్వొచ్చు. వైసీపీ నాయకులు చేసే మెలో డ్రామాలకీ, బ్లేమ్ గేమ్స్ కీ ప్రభుత్వ నిర్ణయాలు బలం ఇస్తున్నాయన్నారు. పవన్ తన ట్వీట్‌లో పాత ఉత్తర్వులను జతచేశారు.

ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ గారూ... వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ళ దగ్గర పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు.. తహశీల్దార్ నంబర్స్ ఇస్తారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా అని ప్ర‌శ్నించారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు సాయంగా ఉండాలని జనసైనికలకు పవన్ పిలుపులనిచ్చారు. పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు, దివ్యాంగులకు తోడుగా ఉండండి. పింఛన్ ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకువెళ్ళాలని కోరారు. పింఛన్ ఇప్పించిన తరవాత ఇంటి దగ్గర దించి రావాల‌ని పిలుపునిచ్చారు. జనసేన శ్రేణులతోపాటు కూటమిలో భాగమైన టిడిపి, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరుతున్నానన్నారు.