ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, కేటాయింపు వంటి విషయాల్లో జనసేన అధినేత పవన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి జనసేనలో చేరిన వారికి టికెట్లు కేటాయిస్తున్నారు. తాజాగా.. ఉమ్మడి కడప జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం రైల్వే కోడూరులో జనసేన అధినేత మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ నుంచి పోటీ చేసే జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును పవన్ ఖరారు చేశారు.
వాస్తవానికి రెండో జాబితాలో రైల్వే కూడూరు స్థానాన్ని.. జనసేనకు కేటాయించారు. దీంతో తొలుత యన మల భాస్కర రావు పేరు ప్రకటించారు. దీంతో ఆయన పని ప్రారంభించారు. నియోజకవర్గంలో పర్యటిం చారు. అయితే.. రెండు వారాలు గడిచేసరికి.. క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాలను పవన్ పరిశీలించారు. ఈ క్రమంలో యనమల స్థానంలో అభ్యర్థిని మార్చాలని నిర్ణయించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్న సమయంలోనే రైల్వే కోడూరు నియోజక వర్గ పరిస్థితిని అక్కడి జనసేన, తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు.. పవన్‌కు వివరించారు. ఈ క్రమం లో రైల్వే కోడూరు స్థానం జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును ఖరారు చేశారు. ఈయన టీడీపీ నాయ కుడు. ప్రస్తుతం పంచాయతీ సర్పంచ్‌గా ఉన్నాడు. ముక్కావారిపల్లె గ్రామ సర్పంచ్ గా టీడీపీ మద్దతుతో ఆయన విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన రెండు రోజుల కిందట జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆయనకే పవన్ టికెట్ ఇవ్వడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates