ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల ఇప్పటికే ఏపీలోదూకుడుగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ఆమె కామెంట్లు చేస్తున్నారు. సవాళ్లు-ప్రతి సవాళ్లతో వేడి పుట్టిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నియంత పాలన.. వైసీపీని గద్దె దించేస్తామని కూడా చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో ఆమె పర్యటన ఇప్పటికే ఒకసారి పూర్త యింది. ఇక, ఇప్పుడు మరోసారి ఆమె.. పర్యటనకు ప్రారంభం అవుతున్నారు. ఇదిలావుంటే.. …
Read More »విజయవాడ తూర్పులో ఈ సారి సంచనలం!
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ సారి సంచలనం చోటు చేసుకోనుందా? ఇక్కడ నుంచి వరుస విజయాలు దక్కించుకుంటున్న టీడీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. గౌరవంగా పక్కకు తప్పుకోవాల్సిందేనా? ఎన్నికలకు ముందుగానే ఇక్కడ విజయం ఖరారైపోయిందా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ నుంచి రంగంలోకి దిగనున్న యువ నాయకుడు, బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన దేవినేని అవినాష్.. వైపే సానుకూల పవనాలు వీస్తున్నాయని …
Read More »అడ్డు వస్తే.. తొక్కుకుంటూ పోతా: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అడ్డు వస్తారా? రండి.. తొక్కుకుంటూ పోతా! ఇప్పటి వరకు ఒక ఎత్తు. ఇకనుంచి మరో ఎత్తు. ఏమనుకుంటున్నారో.. ఖబడ్దార్! అని హెచ్చరించారు. కొన్నాళ్లుగా విరామం ప్రకటించిన.. రా.. కదలిరా! సభలను తిరిగి ప్రారంభించిన చంద్రబాబు.. బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎందుకంత కోపం? టీడీపీ అధినేత చంద్రబాబు …
Read More »చంద్రబాబు ప్రయోగం.. వికటిస్తే.. ఎవరు బాధ్యులు?
ఎన్నికలు వచ్చేశాయి. ఇప్పటికే పార్టీ అధినేతగా.. 45 ఏళ్ల సీనియార్టీ ఉన్న నాయకుడిగా చంద్రబాబు ఎక్కడ ఎవరికి టికెట్ ఇస్తే.. గెలుస్తారన్న అంచనా ఉండే ఉంటుంది. ఈ విషయంలో ఆయన ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చి ఉండాలి. ఇక, ఎన్నికలకు ముందు జాబితాను కూడా ప్రకటించేస్తారని అందరూ భావిస్తు న్నారు. ఒకరిద్దరు మినహా.. మెజారిటీ నాయకులకు టికెట్లు దక్కుతాయని అనుకున్నారు. కానీ, ఇక్కడే చంద్ర బాబు కొత్త ప్రయోగం చేశారు. …
Read More »రాష్ట్ర ప్రజల కన్నీటి నుంచి.. టీడీపీ మేనిఫెస్టో: నారా లోకేష్
వైసీపీ పాలనలో గత ఐదేళ్లుగా ప్రజలు నరకం చవిచూస్తున్నారని టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ కష్టాలు..కన్నీటిని చూసి.. చంద్రబాబు చలించిపోయారని తెలిపారు. ప్రజల కన్నీటి నుంచే టీడీపీ మేనిఫెస్టో తయారవుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన జరుగుతోందన్నారు. అయితే.. ఇప్పటికే గత ఏడాది మహానాడు సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా మేనిఫెస్టోలో చేర్చనున్నామని వెల్లడించారు. ఉమ్మడి విజయనగరం …
Read More »నీళ్లు-నిప్పులు.. తెలంగాణ అసెంబ్లీలో కాక!
తెలంగాణ అసెంబ్లీలో నీళ్లు నిప్పులుగా మారాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతోంది. రాష్ట్రంలోని నీటిపారుదల రంగానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా శనివారం ఉదయం సభలో వైట్‌పేపర్ రిలీజ్ చేసింది. అనంతరం.. దీనిపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి హక్కుగా ఉన్న నీటిని కూడా వినియోగించుకోలేక పోయిందని గత సర్కారుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కృష్ణా …
Read More »భర్తకు బాసట.. మంగళగిరిలో నారా బ్రాహ్మణి ప్రచారం
నారా బ్రాహ్మణి. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. నందమూరి కుటుంబం ఆడపడుచు.. నారా వారి ఇంటి కోడలు. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ సతీమణి. ప్రస్తుతం నారా బ్రాహ్మణి.. మంగళగిరిలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన భర్త నారా లోకేష్‌ను గెలిపించాలని ఆమె కోరుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు బ్రాహ్మణి వచ్చారు.ఈ సందర్భంగా ఆమె మంగళగిరిలోని చేనేతలను కలుసుకున్నారు. మెజారిటీ సామాజిక …
Read More »మాజీ ఎంఎల్ఏ సైకిలెక్కుతారా ?
ఇపుడిదే అంశం తెలుగుదేశంపార్టీతో పాటు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. చంద్రబాబునాయుడు సొంత జిల్లా అయిన తంబళ్ళపల్లి నియోజకవర్గంలో కొంతకాలంగా గట్టి నేతలేరు. ఎందుకంటే నియోకవర్గం ఇన్చార్జిగా మాజీ ఎంఎల్ఏ శంకర్ యాదవ్ ఉన్నా సరిగా పనిచేయటంలేదు. సొంత వ్యాపారాల పేరుతో ఎక్కువకాలం బెంగుళూరులోనే ఉంటున్నారు. దాంతో ఏ అవసరం వచ్చినా నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణినేతలు, క్యాడర్ రాష్ట్రపార్టీ వైపు లేకపోతే పక్క నియోజకవర్గాల వైపు చూస్తున్నారు. అందుకనే అన్నీ కోణాల్లో ఆలోచించిన చంద్రబాబు …
Read More »రెండుసీట్ల కోసం మూడుపార్టీలు పట్టు
మూడు పార్టీలు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తులు ఫైనల్ కాలేదు. రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న టీడీపీ, జనసేన మధ్యలోకి బీజేపీ సడన్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో అప్పటివరకు టీడీపీ, జనసేన మధ్య జరిగిన పొత్తు చర్చలంతా పక్కకుపోయాయి. ఇపుడు విషయం ఏమిటంటే మూడు పార్టీలు కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయటం కోసం గట్టిగా పట్టుబడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే జగన్మోహన్ …
Read More »‘అందుకే పార్టీలో నుంచి బయటకు వచ్చేశా’
అధికార వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తాజా సంచలనంగా మారారు. పార్టీ నుంచి బయటకు వచ్చేసిన వేళ.. తాను అలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నానో చెప్పే ప్రయత్నం చేశారు. ఇందుకోసం నరసరావుపేటలో ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తనను గుంటూరుకు షిఫ్టు కావాలని కోరారని.. అందుకు తాను ససేమిరా అన్నట్లుగా ఆయన పేర్కొన్నారు.గుంటూరులో ఓటమి పాలైతే.. తనను …
Read More »సర్వేల టెన్షన్ పెరిగిపోతోందా ?
తెలంగాణా బీజేపీలో టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవైపు సర్వేల్లో బీజేపీ గెలుచుకోబోయే ఎంపీల సంఖ్య ఇది అని వెల్లడవుతున్న జోస్యాలు. మరోవైపు కచ్చితంగా డబుల్ డిజిట్ టచ్ చేయాల్సిందే అన్న అగ్రనేతల ఆదేశాలు. ఈ రెండింటి మధ్యలో సమన్వయం సాధించటం ఎలాగ అన్న టెన్షన్ సీనియర్ నేతల్లో పెరిగిపోతోందని పార్టీవర్గాల సమాచారం. మొత్తం 17 పార్లమెంటు సీట్లలో ఎట్టి పరిస్ధితుల్లోను 10 సీట్లు గెలుచుకుపోవాల్సిందే అని ఇప్పటికే జాతీయ నాయకత్వం స్పష్టంగా …
Read More »పల్నాడులో పట్టుకోసం కొత్త స్కెచ్
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో కోల్పోయిన పట్టును తిరిగి సాధించేందుకు చంద్రబాబు నాయుడు కొత్త స్కెచ్ ను రెడీచేస్తున్నారు. ఇందులో భాగంగా వ్యూహాలను రచిస్తున్నారు. నరసరావుపేట, మాచర్ల, పెదకూరపాడు నియోజకవర్గాల్లో కొత్త, గట్టి అభ్యర్ధులను చంద్రబాబు పోటీలోకి దింపబోతున్నారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పోయిన ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటుతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోను టీడీపీ ఓడిపోయింది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates