ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది? .. ‘ఏఐ’ సంచ‌ల‌న స‌మాధానం!

సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌.. ఏఐ పాత్ర పెరుగుతున్న విష‌యం తెలిసిందే. దీంతో త‌మ‌కు తెలిసిన‌, తెలియని అనేక ప్ర‌శ్న‌ల‌ను నెటిజ‌న్లు ఏఐని అడుగుతున్నారు. వీటి జెమినీ ఏఐ, మాయ ఏఐ అనేవి స‌మాధానాలు చెబుతున్నాయి. ఒక్కొక్క‌సారి వివాదం కూడా అవుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఓ విష‌యం వెలుగు చూసింది. ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంటుంది? ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవుతార‌నే ప్ర‌శ్న‌లు.. తాజాగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఏ ఇద్ద‌రు క‌లిసినా.. ఈ విష‌యంపైనే చ‌ర్చించుకుంటున్నారు.

ఇక‌, మెలితిరిగిన అనుభ‌వం ఉన్న సెఫాలజిష్టులు కూడా.. దీనికి స‌మాధానం చెప్ప‌లేక‌.. వేచి చూడండి అంటూ త‌ప్పించుకుం టున్నారు. ఈ నేప‌థ్యంలో కొంద‌రు ఔత్సాహిక నెటిజ‌న్లు.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌.. చాట్ జీపీటీలైన మాయ ఏఐని ఆశ్రయించారు. ఏపీలో ఏ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంటుంది? ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవుతారు? వంటి కీల‌క ప్ర‌శ్న‌లు సంధించారు. ఇదే స‌మ‌యంలో ట‌చ్ చేసి చూడు త‌ర‌హాలో.. టీడీపీ అధినేత ఎవ‌రు?  ఏపీ ప్ర‌స్తుత సీఎం ఎవ‌రు? అనే ప్ర‌శ్న‌లు కూడా.. సంధించారు. ఈ రెండు ప్ర‌శ్న‌ల‌కు మాయ ఏఐ.. స‌రైన స‌మాధానాలే చెప్పింది.

టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు అని చెప్పింది. అదేవిధంగా ప్ర‌జెంట్ సీఎం ఆఫ్ ఏపీ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అని బ‌దులిచ్చింది. ఇక‌, ఏపీలో ఎలా ఎన్నిక‌లు జ‌రిగాయి.. అంటే.. రాడిక‌ల్‌గా జ‌రిగాయ‌ని.. చెప్ప‌డం విశేషం. అదేస‌మ‌యంలో ఎక్క‌డెక్క‌డ హింస జ‌రిగింద‌న్న ప్ర‌శ్న‌కు కూడా స‌మాధానం స‌రిగానే చెప్పింది. తాడిప‌త్రి, ప‌ల్నాడు అని పేర్కొంది. ఇక‌, ఎవ‌రు గెలుస్తారు?  అనే ప్ర‌శ్న‌కు మాత్రం మాయ ఏఐ కూడా దాట‌వేసింది. ‘దీనికి స‌మాధానం నాకు తెలీదు. తెలిశాక చెబుతాఅని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవుతున్నార‌న్న ప్ర‌శ్న‌కు..ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి’ అని ప‌దే ప‌దే బ‌దులివ్వ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఏఐ కూడా అంచ‌నా వేయ‌లేక పోతోందంటూ.. నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.