ఏపీ రాజకీయాలను ఫాలో అవుతున్న వారికి బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అతను మామూలుగా రెచ్చిపోలేదు. పేరుకేమో అతను కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలె ఆధ్వర్యంలో నడిచే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్.
కానీ అతను చేసిన పనులు జగన్ రాజకీయ ప్రత్యర్థులను బూతులు తిట్టడం.. వార్నింగులు ఇవ్వడం. కొన్నేళ్ల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి లం..కొడకా, నీ అమ్మా.. లాంటి పదాలు వాడడమే కాక.. పవన్ కుటుంబ సభ్యులను చంపుతా, రేప్ చేస్తా అన్నట్లు హెచ్చరికలు జారీ చేశాడు. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఐతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బోరుగడ్డ అనిల్ మీద కేసులు పడ్డాయి. అరెస్టయ్యాడు. జైల్లో ఉన్నాడు. అక్కడ అతడికి గట్టి ట్రీట్మెంటే ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని నెలల తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చిన అనిల్.. సాత్వికంగా మారాడు. ఈ మధ్య మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాను గతంలో తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నాడు. అదే సమయంలో ఎదురుదాడి మాత్రం ఆపట్లేదు. తనను టీడీపీ, జనసేన వాళ్లు తిట్టినందుకు.. ఫ్యామిలీని టార్గెట్ చేసినందుకే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని అంటున్నాడు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్‌ల మీద విమర్శలు చేశాను కానీ.. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు అయితే తాను మాట్లాడట్లేదని.. తన వీడియోలను కట్ చేసి, ఎడిట్ చేసి దుష్ప్రచారం చేశారని అతను తాజాగా ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. పవన్ కళ్యాణ్ సిస్టర్స్ తన సిస్టర్స్ లాంటి వాళ్లే అని.. తనకూ సిస్టర్స్ ఉన్నారని.. అలాంటపుడు తాను అలా ఎలా మాట్లాడతానని అతనన్నాడు.
తాను వేరే సందర్భంలో అన్న మాటలను వక్రీకరించి తన మీద దుష్ప్రచారం చేశారన్నాడు. తాను పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఏమైనా అన్నట్లు రుజువు చేస్తే.. పవన్ కళ్యాణ్ గన్ను తీసుకుని పాయింట్ బ్లాంక్‌లో పెట్టి తనను షూట్ చేయొచ్చని అతనన్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ హిందువు కాదని.. ఆయన అనా లెజెనోవాను పెళ్లి చేసుకున్నపుడు బాప్టిజం తీసుకున్నాడని అనిల్ ఆరోపించాడు.
పవన్, చంద్రబాబు. లోకేష్‌ల నుంచి తనకు ప్రాణహాని ఉందని అతనన్నాడు. తనను పవన్ కళ్యాణే కేసుల్లో ఇరికించాడని.. తన మీద ఆయన కక్షగట్టినట్లు జైలు అధికారులు, పోలీసులు చెప్పారని.. తన మీద ఆయన ఎందుకు అంత ఫోకస్ చేశారో తనకు అర్థం కాలేదని అనిల్ అన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates