తెలంగాణలోని ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ప్రతిపక్షం బీఆర్ఎస్కు దక్కింది. దీనికి సంబంధించి పార్టీ అదినేత, మాజీ సీఎం కేసీఆర్.. సుదీర్ఘ కసరత్తు చేశారు. చివరకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, ఉన్నత విద్యావంతుడు, మాజీ ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్కు ఈ టికెట్ కేటాయించారు. ఈయన గెలుపు కూడా ఖాయమనే. దీంతో దాసోజు మండలిలో అడుగు పెట్టనున్నారు. అయితే.. కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు.. దాసోజు ఎంపిక …
Read More »అదీ పవన్ అంటే.. పార్టీ నేత చేత సారీ చెప్పించి వేటేశాడు
రాజకీయ అధినేతల మాటలు ఒకలా.. చేతలు మరోలా ఉండటం సహజం. మాట్లాడే సిద్ధాంతాలు.. విలువల్ని చేతల్లో చేసి చూపిస్తారనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎక్కడో దగ్గర రాజీ అన్నది కనిపిస్తూ ఉంటుంది. పార్టీ నేతలు చేసే రచ్చలను చూసిచూడనట్లుగా వ్యవహరిస్తుంటారు. వేటు వేసే విషయంలో చూసిచూడనట్లుగా వ్యవహరిస్తారు. గొడవ ముదిరి.. విమర్శలు వెల్లువెత్తినా ఆరోపణలు వచ్చిన నేత విషయంలో చర్యలు తీసుకోకుండా ఉండటం తెలిసిందే. ఇందుకు ఆ పార్టీ.. ఈ రాజకీయ …
Read More »ఆశావహుల పరిస్థితి ఏంటి? టీడీపీలో ఆగ్రవేశాలు!
ఏపీ కూటమి పార్టీలు మొత్తం 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను పంచేసుకున్నాయి. ఈ నెల 20న జరగనున్న ఎన్నికలకు సంబందించి సోమవారం నామినేషన్ల ఘట్టం పూర్తి కానుంది. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ-3, జనసేన-1, బీజేపీ-1 పంచుకున్నాయి. ఈమేరకు ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి(బీజేపీ తప్ప). అయితే.. వాస్తవానికి జనసేన పరిస్థితి ఎలా ఉన్నా.. టీడీపీలో మాత్రం ఈ ఎంపికపై ఆశావహులు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా కొందరు ఫోన్లు …
Read More »12న వైసీపీ-14న జనసేన.. ఎంత తేడా అంటే!
ఏపీలో అధికార పక్షంగా ఉన్న జనసేన, ప్రతిపక్షంగా ఉన్న వైసీపీల మధ్య రాజకీయ వైరుద్ధ్యాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే. జీరో స్థాయి నుంచి 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతో జనసేన దూకుడు గా ఉంది. పైగా.. కూటమికి అండగా కూడా ఉంది. ఇక, 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజారిపోయిన వైసీపీ మరింత ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితిలో అనూహ్యంగా రెండు రోజులు గ్యాప్లో …
Read More »జాబితా బారెడు.. పదవులు మూరెడు..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆపశోపాలు పడుతోంది. ఎవరిని ఉంచాలి.. ఎవరి తుంచాలి.. అనే విషయంలో తర్జన భర్జన ఒక కొలిక్కి రావడం లేదు. ఎక్కడా కూడా ముడి పడడం లేదు. ఈ వ్యవహారం ఏకంగా ఏఐసీసీ చేతికి చేరినప్పటికీ.. ఆది కనిపిస్తున్నంత తేలికగా.. అంతం కనిపించడం లేదు. దీంతో నాయకులు ఆప శోపాలు పడుతున్నారు. విషయం ఏంటంటే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం …
Read More »టీడీపీ త్యాగం!.. కూటమి మరింత ధృడం!
టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ఏపీలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఏ మేరకు ఉందన్న విషయాన్ని టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పదే పదే చెప్పారు. చంద్రబాబు మాటను నమ్మిన ఏపీ ఓటర్లు కూటమికి రికార్డు మెజారిటీతో విజయం కట్టబెట్టారు. కూటమిపై ప్రజలు నమ్మకం ఉంటారు కదా…మరి వారి నమ్మకాన్ని వమ్ము చేయని రీతిలో పాలన ఉండాలి కదా. ఏడాది తిరక్కుండానే గతి తప్పిన ఏపీ …
Read More »కష్టే ఫలి!.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!
పార్టీ కోసం కష్ట పడే వారికే పదవులు దక్కుతాయి. పార్టీని నమ్ముకున్నవారికి ఎన్నటికీ అన్యాయం జరగదు. ఈ మాటలు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నోట నుంచి నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా ఇదే మంత్రాన్ని జపిస్తున్నారు. వారిద్దరి మాటలకు అద్దం పడుతూ ఆదివారం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల …
Read More »రాములమ్మకు ఎమ్మెల్సీ.. అగ్ర నేతల మాట నెగ్గలేదు
తెలంగాణలో అధికార కాంగ్రెస్ తన ఖాతాలోని మూడు ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను ఆదివారం సాయంత్రం ప్రకటించింది. అంతా అనుకున్నట్లుగా పార్టీ స్వరాన్ని గట్టిగా వినిపిస్తూ వస్తున్న అద్దంకి దయాకర్ కు ఓ సీటును కేటాయించిన హస్తం పార్టీ… ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ కు టికెట్ ఇచ్చేసింది. ఇక జనరల్ కేటగిరీలో ఏ ఒక్కరూ ఊహించనట్లుగా మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ ను కాంగ్రెస్ పార్టీ …
Read More »వారంతా లేనట్టే..
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(శ్రీశైలం కుడి కాల్వ) టన్నెల్లో గత నెల 22న జరిగిన ప్రమాదంలో చిక్కుకు పోయిన.. ఆరుగురు కూలీలు, ఇద్దరు ఇంజనీర్లు లేనట్టేనని అధికారులు చెబుతున్నారు. ఆనాడు జరిగిన ఘోర ప్రమాదంలో వారంతా లోపలే చిక్కుకుపోయారు. అయితే.. వీరిని కాపాడేందుకు జాతీయ, అంతర్జా తీయ స్థాయి సంస్థల సహకారం తీసుకుని ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. అయితే.. ఎవరి జాడా కనిపించలేదు. తాజాగా మనిషి శరీరానికి సంబంధించిన …
Read More »శక్తి యాప్.. ఫోన్ ను షేక్ చేస్తే చాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ మహిళలకు మరింత భద్రత లభించింది. ఈ మేరకు ఏపీలోని కూటమి సర్కారు నేతృత్వంలోని పోలీసు శాఖ శక్తి యాప్ పేరిట ఓ సరికొత్త యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ను టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాలకు చంద్రబాబు హాజరయ్యారు. …
Read More »బరిలోకి ఇద్దరు బీఆర్ఎస్ నేతలు… కేసీఆర్ వ్యూహమేంటో?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో మొత్తం 5 స్థానాలు కూటమికే దక్కనున్న నేపథ్యంలో…విపక్షం గోల కనిపించడం లేదు. అయితే తెలంగాణలో మాత్రం ఓ సీటు విపక్ష బీఆర్ఎస్ కు దక్కుతుంది. మిగిలిన 4 సీట్లు అధికార కాంగ్రెస్ ఖాతాలో పడనున్నాయి. అయితే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ ఎన్నికల గురించి ఆదివారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. …
Read More »మహిళా సెంట్రిక్గా కూటమి అడుగులు.. !
రాష్ట్రంలో మహిళా ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. నగరాలు, పట్టణాలే కాదు.. గ్రామీణ స్థాయిలోనూ మహిళల ఓటు బ్యాంకు 2026 నాటికి 20-30 శాతం మేరకు పెరుగుతుందన్న అంచ నాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలూ.. మహిళలకు ఎనలేని ప్రాదాన్యం ఇస్తున్నాయి. దీనిలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కారు మరింత ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ.. వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుండడం మరో విశేషం. …
Read More »