హైదరాబాద్లోని రవీంద్రభారతిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణను తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్పీ బాలు తెలంగాణ పదం ఉచ్చరించడానికి నిరాకరించారని, తెలంగాణ గడ్డపై ముందుగా అందె శ్రీ, గద్దర్ వంటి స్థానిక కళాకారులకు, ఉద్యమకారులకు గౌరవం దక్కాలని వారు వాదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు …
Read More »మోదీ, రేవంత్, లోకేష్ కు కూడా తప్పని ఢిల్లీ తిప్పలు
ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమాన, రైలు రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. విజిబిలిటీ భారీగా తగ్గిపోవడంతో పలు విమానాలను దారి మళ్లించగా, మరికొన్నింటిని ఆలస్యంగా నడిపారు. ఈ పరిస్థితులతో ప్రయాణికులు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల వరకు పడిపోవడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది. పొగమంచు ప్రభావం రాజకీయ నేతల ప్రయాణాలపై కూడా పడింది. ప్రధాని …
Read More »కవిత పొలిటికల్ గ్రాఫ్ పై కేసీఆర్ నిఘా?
బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ తాజాగా రెండోసారి తన కుమార్తె బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన కవిత పై స్పందించారు. ఇటీవల కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అదేవిధంగా నిరంజన్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో కవిత మీడియా ముందుకు వచ్చి పదే పదే బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేయడంతో పాటు తనను కెలకద్దంటూ వ్యాఖ్యానించారు. అన్ని ఆధారాలు బయటపెడతానని తాను …
Read More »ఒక్క ఓటుతో కోడల్ని గెలిపించిన ‘అమెరికా మామ’
తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఫలితాలు నిన్న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల ఫలితాల సందర్భంగా జరిగిన కొన్ని ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లక్కీ డ్రా, లాటరీ, బొమ్మా బొరుసు పద్ధతులలో గెలిచిన అభ్యర్థులు కొందరైతే….ఒక్క ఓటు తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకున్న అభ్యర్థులు మరికొందరు. అమెరికా నుంచి వచ్చి వేసిన తన ఒక్క ఓటుతో కోడలిని గెలిపించిన …
Read More »#AskKavitha.. కవిత కొత్త పంథా!
బీఆర్ ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత.. సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించిన కసరత్తు కూడా ఢిల్లీ లెవెల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించిన కవిత.. అప్పటి నుంచి ఆ సంస్థకు అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా పార్టీతో విభేదించారు. బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ప్రజలకు చేరువ అయ్యేందుకు కవిత తన ప్రయత్నాలు ముమ్మరం …
Read More »‘కూటమి’లో ప్రక్షాళన.. త్వరలో మార్పులు?
ఏపీలోని కూటమి ప్రభుత్వంలోనే కాదు.. పార్టీల్లోనూ ప్రక్షాళన జరగనుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీల పరంగా పైస్థాయిలో నాయకులు ఏకంగా ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. జిల్లాకొక రీతిగా నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇలానే ఉంటే.. కూటమి అంతిమ లక్ష్యం 15 ఏళ్ల అధికారం.. సాకారం కావడం కష్టమని మూడు పార్టీలు.. టీడీపీ-బీజేపీ-జనసేనలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా స్థాయిలో నాయకులను మార్చాలన్నది ప్రధాన ప్రతిపాదన. ఇప్పటి …
Read More »ఆ పంచాయతీల్లో బీఆర్ఎస్ ఓటమి, కవిత ఎఫెక్టేనా?
తెలంగాణలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులు జోష్ చూపించారు. భారీ ఎత్తున పంచాయతీలను కైవసంచేసుకున్నారు. 193 మండలాల పరిధిలోని 3వేల, 911 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు జరిగిన రెండో విడత పోలింగ్లో కాంగ్రెస్ మద్దతుతో రంగంలోకి దిగిన 1,728 మంది సర్పంచ్లు జయకేతనం ఎగురవేశారు. నిజానికి తొలి విడతలో కాంగ్రెస్ పార్టీ హవాను చూసిన బీఆర్ఎస్ పార్టీ తన మద్దతు దారులకు …
Read More »`టీజేపీ`… కవిత పార్టీపై కసరత్తు!?
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలిగా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కొత్త రాజకీయ పార్టీ విషయంపై నోరు మెదపని ఆమె.. ఇక, స్వయంగా ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయినట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. తాజాగా ఆమె ఆ పనిపైనే ఉన్నారని తెలిసింది. తెలంగాణ రాష్ట్రసమితి(టీఆర్ఎస్)గా ఏర్పడిన కేసీఆర్ పార్టీ ప్రజలకు …
Read More »వైసీపీకి ఆ 40 % నిలబడుతుందా.. !
40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. గత ఎన్నికల్లో ఉన్నట్టుగానే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిలు ఉండకపోవచ్చు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఇస్తున్న నిధులు, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజల్లో సంతృప్తిని ఎప్పటికప్పుడు అంచనా …
Read More »రెండో విడతలోనూ హస్తం పార్టీదే హవా!
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్ పై నమ్మకం పెట్టుకున్న ప్రజలు లోకల్ వార్ లో కూడా హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించారు. ఇక, నేడు జరిగిన రెండో దశ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 784 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. అయితే, రెండో దశ ఫలితాల్లోనూ …
Read More »కేసీఆర్ హరీష్తో జాగ్రత్త!: మహేష్ కుమార్
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్కు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో బీఆర్ ఎస్ పార్టీని ఉద్దేశించి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సొంత మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావు ఏదో ఒక సమయంలో వెన్నుపోటు పొడవడం ఖాయమని …
Read More »ఎన్నికల్లో పోటీపై నాగబాబు సంచలన ప్రకటన
ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన ప్రకటన చేశారు. తాను వచ్చే ఎన్నికల్లోనేకాదు.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటీ పడలేనన్నారు. పార్టీ కార్యకర్తగా ఉండేందుకే తాను ఇష్టపడతానని చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నానని.. తనకు ఇది చాలని సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. అయితే.. వచ్చే ఐదారేళ్ల తర్వాత.. ఏం జరుగుతుందో చెప్పలేనని ఆయన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates