రాబోయే యూనియన్ బడ్జెట్ (2026-27) కేవలం పన్నుల లెక్కలకే పరిమితం కాకుండా, టెక్నాలజీ భవిష్యత్తును నిర్ణయించేలా ఉండబోతోందా? అవుననే అంటున్నారు ప్రముఖ ఆర్థికవేత్తలు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో నిపుణులు ఒక కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ వంటి నయా టెక్నాలజీలకు బడ్జెట్లో ప్రత్యేక పాలసీ సపోర్ట్ ఇవ్వాలని వారు గట్టిగా సూచించారు. ప్రపంచ ఆర్థిక …
Read More »అమెరికా, వెనిజులా వార్.. ఇండియాకు జాక్ పాట్ తగిలినట్టేనా?
వెనిజులాలో అమెరికా చేసిన దాడి ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అక్కడ ప్రభుత్వం మారితే మనకేంటి అని లైట్ తీసుకోకండి. ఈ పరిణామం ఇండియాకు ఒక రకంగా ‘శుభవార్త’ మోసుకొచ్చేలా ఉంది. అక్కడ జరిగే మార్పులు మన స్టాక్ మార్కెట్ కు న్యూట్రల్ గా అనిపించినా, మన ప్రభుత్వ ఆయిల్ కంపెనీలకు మాత్రం కాసుల వర్షం కురిపించే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. …
Read More »తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకుని పరిష్కరించుకోవాలన్న సుప్రీంకోర్టు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం ఇప్పట్లో సాధ్యమేనా? ఏ రాష్ట్ర వాదన ఎలా ఉంది? అనే అంశాలను పరిశీలిస్తే, ఈ సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే (మీడియేషన్) మార్గంగా కనిపిస్తోంది. ఈ మాట ఎవరో కాదు, సాక్షాత్తూ సుప్రీంకోర్టే తాజాగా వ్యాఖ్యానించింది. ఏపీ ప్రతిపాదిత పోలవరం నల్లమల సాగర్ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ …
Read More »మండలిలో కవిత మంగమ్మ శపథం!
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత సోమవారం సంచలన ప్రకటన చేశారు. మండలిలో మాట్లాడిన ఆమె, తెలంగాణ ఉద్యమానికి ముందే ప్రారంభించిన తెలంగాణ జాగృతిని త్వరలోనే రాజకీయ పార్టీగా మారుస్తామని ప్రకటించారు. తెలంగాణ జాగృతి ఇక నుంచి రాజకీయ పార్టీగా మారుతుందన్నారు. దీనిని ప్రజలకు చేరువ చేస్తామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు, తెలంగాణ సిద్ధాంతాలకు అనుగుణంగా తమ …
Read More »పచ్చని కోనసీమలో అగ్నికలకలం
ఏపీలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పచ్చని కోనసీమ (ఇప్పుడు జిల్లా)లో ఉవ్వెత్తున ఎగసిపడిన మంటల కారణంగా వేలాది కొబ్బరి చెట్లు తగలబడి పోయాయి. దీంతో సమీపంలోని పలు గ్రామాల ప్రజలను కూడా అధికారులు అక్కడ నుంచి ఖాళీ చేయించారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కోనసీమలోని రాజోలు నియోజకవర్గంలో ఉన్న మలికిపురం మండలం, ఇరుసుమండలోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ …
Read More »తెలంగాణపై పవన్ స్పెషల్ ఫోకస్
తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని జనసేన కమిటీలను రద్దు చేసి, వాటి స్థానంలో తాత్కాలిక కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం నగరపాలక సంస్థ పరిధి, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగాలకు చెందిన కమిటీలను రద్దు చేశారు. వాటి స్థానంలో కొద్దిమంది సభ్యులతో …
Read More »తెలంగాణ స్థానికం పై జనసేన బిగ్ స్ట్రాటజీ!
తెలంగాణలో త్వరలోనే 117 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెలలోనే వీటికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ కూడా రానుంది. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో ఏపీకి చెందిన జనసేన కూడా వ్యూహాత్మకంగా ప్రయత్నాలు ప్రారంభించింది. తెలంగాణ మునిసిపల్ ఎన్నికలే లక్ష్యంగా జనసేన పార్టీ …
Read More »‘తెలుగు రాష్ట్రాల మధ్య ఉండాల్సింది ద్వేషం కాదు’
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పేరిట విద్వేషాలు పెంచుకోవడం సరికాదని, పరస్పర సయోధ్యతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు వేదికగా నిర్వహించిన మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు పెంచుకోవడం సరికాదని, సయోధ్యతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్ తరాల కోసం ఐక్యతతో …
Read More »మోడీకి ట్రంప్ విషమ పరీక్ష
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విషమ పరీక్షగా మారారా? ట్రంప్ దూకుడు కారణంగా విశ్వగురు మోడీకి ఇబ్బందులు తప్పేలా లేవా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. గత ఏడాది జనవరిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు శాంతి ప్రవచనాలు చెబుతూనే మరోవైపు ప్రపంచ దేశాలను ఇరకాటంలోకి నెడుతున్నారు. ఈ క్రమంలోనే గత …
Read More »మండలిలో కవిత కన్నీటిపర్యంతం
తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీపై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ తీరు, నాయకత్వ వైఖరిపై ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, సభలో భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. గత ఎనిమిదేళ్లుగా ప్రజల కోసం చేసిన తన ప్రయత్నాలను అడ్డుకున్నారని, పార్టీకి అనుకూలంగా ఉన్న ఛానెళ్లు, పత్రికలు కూడా తనకు మద్దతుగా నిలవలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ తనను ఘోరంగా అవమానించిందని కవిత పేర్కొన్నారు. పార్టీలో అంతర్గత గౌరవం …
Read More »యువత పల్స్ పట్టుకున్న పవన్ కళ్యాణ్
యువతలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినీ హీరోగా అభిమానాన్ని సంపాదించుకున్న పవన్, అదే స్థాయిలో యువ రాజకీయ నేతగా కూడా యువత హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలో యువత స్వచ్ఛందంగా తరలి వస్తూ తమ మద్దతును ప్రకటిస్తోంది. ఈ పరిణామం పవన్ రాజకీయ ప్రయాణంలో యువత కీలక పాత్ర పోషిస్తున్నదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. యువత …
Read More »హరీష్. గుంటనక్క: కవిత
బీఆర్ఎస్ మాజీ మంత్రి, సీనియర్ నేత.. హరీష్‌రావుపై ఆ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో ఆమె హరీష్‌రావుపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆదివారం సూర్యాపేటలో పర్యటించిన ఆమె.. మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ కేంద్రంగా విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. ‘గుంటనక్క’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏం జరిగింది? ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నాయకుల …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates