అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వంటి నేతలకైతే అనూహ్యంగా వచ్చిన అధికారం తెచ్చిన అతి విశ్వాసం అందరికన్నా అరకిలో ఎక్కువే ఉంటుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ చేసిన క్లాసిక్ కామెంట్లు ఇందుకు నిదర్శనం. రాబోయే 30 ఏళ్లు వైసీపీ ప్రభుత్వమే..సింహం సింగిల్ గానే పోటీ చేస్తుంది…వారంతా కట్టగట్టుకొని …
Read More »వివేకా మర్దర్: డీఎస్పీ సహా అధికారులపై కేసులు!
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో మరో నలుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో డీఎస్పీ స్థాయి అధికారి నుంచి సీఐ వరకు ఉన్నారు. ఈ పరిణామాలతో మరోసారి వివేకా కేసు సంచలనంగా మారింది. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకా దారుణ హత్య కేసులో ఆయన …
Read More »ఏందిది మల్లన్నా.. స్వపక్షంలో విపక్షమా?
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా సర్కారుకు మేలు చేస్తారని అనుకున్నారు. తన దూకుడు. తనదైన బాణి వంటివాటిని వినియోగించి.. సర్కారును అన్ని విధాలా కాపాడుతారని కూడా లెక్కలు వేసుకున్నారు. కానీ అనూహ్యంగా మల్లన్న స్వపక్షంలో విపక్షం పాత్రను చక్కగా పోషిస్తున్నారు. ఈ విషయంలో బీఆర్ ఎస్ నాయకులు కూడా సరిపోవడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. …
Read More »నెరవేరిన కల..విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో విశాఖ జోన్ అంటే ఇదిగో ప్రారంభోత్సవం అంటూ ఐదేళ్ల పాటు ప్రకటనలతో కాలయాపన చేయడం తప్ప అధికారికంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసేలా ఒప్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. జగన్ ఢిల్లీ వెళ్లి తన కేసుల గురించి, అప్పుల గురించి మాట్లాడడమే తప్ప రైల్వే జోన్ కోసం ఏనాడూ …
Read More »నిజంగా అవమానం: మోడీ మిత్రుడు ఇలా చేయడమేంటి?!
అగ్రరాజ్యం అమెరికాలో నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పుడు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మురిసిపోయారు. “నా ప్రియ మిత్రుడికి శుభాకాంక్షలు” అని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు.. మరుసటి రోజు ఫోన్ చేసి.. ట్రంప్‌ను అభినందించారు. దీనిని కూడా ప్రజలకు వివరించారు. ప్రియ మిత్రుడి కారణంగా.. అమెరికా-భారత్ బంధం మరింత బల పడుతుందన్నారు. కట్ చేస్తే.. ట్రంప్ ప్రమాణం చేసి పట్టుమని 15రోజులు కూడా …
Read More »టీడీపీలో ‘మంగ్లి’ మంటలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల నుంచి తెలుగుదేశం, జనసేన కార్యకర్తల నుంచి ఒక రకమైన అసంతృప్త స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. ఐదేళ్ల పాటు తమను తీవ్ర వేధింపులకు గురి చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తల పని పట్టడం లేదన్నది వారి ఆవేదన. ఆ ఐదేళ్లు అదుపు తప్పి ప్రవర్తించిన వారి మీద సరైన చర్యలు చేపట్టడం లేదని.. కేసులు పెట్టట్లేదని.. ఇప్పటికీ వాళ్లంతా దర్జాగా తిరుగుతున్నారని …
Read More »ఓటమి కాస్తా.. ఓదార్పు యాత్ర అయ్యిందే!
తిరుపతి నగరపాలక సంస్థలో మంగళవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి అయిపోయిన తర్వాత ఎందుకనో గానీ వైసీపీలో ఏడుపులు, పెడబొబ్బలు, క్షమాపణలు… ఒకదాని తర్వాత మరొకటి క్యూ కడుతున్నాయి. వాస్తవానికి తిరుపతి కార్పొరేషన్లో వైసీపీకి బలం ఉంది. అయితే ఆ పార్టీ నేతలు తమ కార్పొరేటర్లను తమ పంచన ఉండేలా చేసుకోలేకపోయారు. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా… అవసరం తీరాక మరోలా అన్నట్టుగా వ్యవహరించారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నిక పూర్తి …
Read More »‘స్థానికం’లో జనసేన తప్పుకొంది.. రీజనేంటి ..!
స్థానిక సంస్థలకు సంబంధించి చైర్ పర్సన్, డిప్యూటీ మేయర్ పదవులకు సంబంధించిన పోటీ తీవ్రస్థాయిలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 పదవులకు.. ఒక డిప్యూటీ మేయర్(తిరుపతి) పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూటమిని ముందుకు నడిపిస్తున్న టీడీపీ ఆయా పదవులను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన ఎక్కడా పోటీ కూడా ఇవ్వలేదు. దీంతో జనసేన స్థానిక పోటీలో తప్పుకొందా? లేక.. మరేదైనా జరిగిందా? అనే చర్చ …
Read More »ఆయన ‘ఎన్నికల’ గాంధీ: కేటీఆర్ సెటైర్లు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బాగానే ఉందన్న ఆయన.. కుల గణనపై మాత్రం విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వన్నీ డ్రామాలేనని చెప్పారు. కుల గణన పేరుతో బీసీ డిక్లరేషన్ చేసినా.. దానిని అమలు చేసే చిత్త శుద్ధి ఏమాత్రం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శలు గుప్పించారు. బీసీ …
Read More »టీటీడీలో అన్యమత ఉద్యోగుల బదిలీ
జగన్ హయాంలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట మసకబారిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరిగాయని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తిరుమలలో అన్యమత ప్రచారం ఆరోపణలు, ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం, టీటీడీ భూముల వేలంపాటకు ప్రభుత్వం పూనుకోవడం, సప్తగిరి మాసపత్రిక వ్యవహారం, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ రోడ్డు పక్కన ఉన్న గోడలపై హిందూ దేవతల బొమ్మల స్థానంలో వైసీపీ రంగులు..చివరగా తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి …
Read More »చంద్రబాబు మార్క్… తెలుగులో తొలి జీవో విడుదల
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’ అన్న వైనంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం అంటూ తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం చేశారని జగన్ సర్కార్ పై విమర్శలు వచ్చాయి. దాంతోపాటు, అందరికీ అందుబాటులో ఉండాల్సిన జీవోలను రహస్యంగా ఉంచిందన్న అపవాదు గత ప్రభుత్వంపై ఉంది. కట్ చేస్తే…ఏపీలో కూటమి …
Read More »ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పాలుపంచుకున్నారు. మంగళవారం నాటి లోక్ సభ సమావేశాల్లో భాగంగా తనకు అవకాశం రాగా… మిథున్ రెడ్డి సుదీర్ఘంగానే ప్రసంగించారు. ఈ సందర్భంగా రాస్ట్రపతి ప్రస్తావించిన పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన కీలక అంశాలను లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల ప్రాజెక్టు …
Read More »