ఆ పీఠం అశ్వనీదత్ కే !

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిన్న రాజీనామా చేశాడు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం, తిరుపతిలో సొంత కుమారుడు పరాజయం నేపథ్యంలో ఆయన తన రాజీనామా లేఖను టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి పంపించాడు.

అయితే ఇప్పుడు టీటీడీ తర్వాత చైర్మన్ ఎవరన్న చర్చ మొదలయింది. ఈ పదవిని ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ ను వరిస్తుందని అంటున్నారు.

చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడే జైలుకు వెళ్లి కలిసిన అశ్వనీదత్ ఈసారి టీడీపీ 160 స్థానాలు దక్కించుకుంటుందని మీడియాతో అన్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారం కూటమి 164 స్థానాలు దక్కించుకుంది. ఎన్నికల సమయంలో బాబుకు మద్దతుగా ఒక వీడియో కూడా అశ్వనీదత్ రిలీజ్ చేశాడు.

ఇక వైసీపీ పాలనలో కొన్నాళ్లు వైవి సుబ్బారెడ్డి తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమితో భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అశ్వినీ దత్ టీటీడీ చైర్మన్ అవుతారా? లేరా ? వేచిచూడాలి.