ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ, జనసేన, వైసీపీ కూటమి చేతిలో చావుదెబ్బ తిన్నది. 21 లోక్ సభ, 151 శాసనసభ స్థానాల నుండి 4 లోక్ సభ, 11 శాసనసభ స్థానాలకు దిగజారిపోయింది.
16 లోక్ సభ స్థానాలతో, జనసేన 2 లోక్ సభ స్థానాలతో దేశంలో ఎన్డీఎ ప్రభుత్వానికి టీడీపీ ఇప్పుడు వెన్నెముకగా నిలిచింది. రాష్ట్రంలో సొంతంగా 135, కూటమితో కలిపి 164 మంది శాసనసభ్యులతో బలంగా నిలబడింది.
ఈ పరిస్థితులలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన పార్టీ ఇంటా, బయటా విమర్శలు కురిపిస్తుంది. ‘‘పార్లమెంటు బిజెపికితో వైసిపితో అవసరం ఉంది. టిడిపికి 16 లోక్ సభ సీట్లు మాత్రమే ఉన్నాయి.
వైఎసీపీకి రాజ్యసభలో 11, లోక్ సభలో 4 సీట్లు కలిపి 15 ఉన్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్ లో మా బలం తగ్గలేదు. రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి బిజెపికి తమ అవసరం ఉందని గుర్తించాలి’’ అంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు.
ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి పార్లమెంట్ లో పార్టీ ఎంపీల లెక్కచెప్పి బీజేపీని బెదిరించారా ? లేక లాక్కోమని సంకేతాలు ఇచ్చారా ? అన్న చర్చ మొదలయింది. గత ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోగానే బీజేపీలో చేరిన టీడీపీ రాజ్యసభ సభ్యులను ఈ సందర్భంగా వారు ఉదహరిస్తున్నారు.
ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులు జగన్ మీద ఉన్నాయి. అందులో విజయసాయి పాత్ర కూడా ఉంది. గత ప్రభుత్వంలో చంద్రబాబును జగన్ జైలుకు పంపిన నేపథ్యంలో చంద్రబాబు అంత తేలిగ్గా జగన్ ను వదిలేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. ఈ నేపథ్యంలో విజయసాయివి ఉడుత బెదిరింపులా ? ఆత్మరక్షణ దోరణినా ? అని భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates