Political News

టీడీపీలో ఆ ప్ర‌చారం బంద్‌.. బాబుకు పెరిగిన గ్రాఫ్‌!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో కొన్నాళ్లుగా ఒక ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ అధినేత చంద్ర‌బాబు ప‌ని అయిపోయింద‌ని.. ఆయ‌న స్థానంలో కొత్త‌గా నాయ‌క‌త్వం అవ‌స‌రం అని.. పైగా జూనియ‌ర్ ఎన్టీఆర్ అయితే.. బెట‌ర‌ని.. లేదా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు పూర్తిగా అప్ప‌గించాల‌ని.. ఇలా అనేక స‌ల‌హాలు, సూచ‌న‌లు.. విమ‌ర్శ‌లు పుంజుకున్నాయి. దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు చంద్ర‌బాబు ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఇటీవ‌ల ఆయ‌న కుప్పంలో ప‌ర్య‌టించిన‌ప్పుడు కూడా.. కొంద‌రు …

Read More »

జగన్ ఢిల్లీ టూర్ – వైసీపీ వెర్షనేంటి?

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధం కావటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు.. విశాఖ ఉక్కు విషయంలో జరుగుతున్న ఆందోళనతో పాటు.. ఇటీవలి పరిణామాలపై ప్రధాని మోడీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడేందుకు ఆయన దేశ రాజధానికి వెళ్లాలని అనుకుంటున్నారు. వాస్తవానికి తిరుపతిలో జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి అమిత్ షా వచ్చినప్పుడు.. ఆయనతో ప్రత్యేకంగా …

Read More »

మళ్లీ జనసేనలోకి జేడీ.. కండిషన్స్ అప్లై

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాక అందులో చేరి ఆ పార్టీకి ఆకర్షణ తెచ్చిన ప్రముఖ వ్యక్తుల్లో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఒకరు. దేశంలోనే గొప్ప పేరున్న పోలీసు ఉన్నతాధికారుల్లో ఒకడైన లక్ష్మీ నారాయణతో జనసేనకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అనుకున్నారు. కానీ ఆయన విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక కొన్ని నెలలకే జనసేన నుంచి బయటికి వచ్చేయడం చర్చనీయాంశం అయింది. సగటు రాజకీయ నాయకుల్లాగే …

Read More »

ఐదు రాష్ట్రాల్లో గెలుపు ఎవరిది? ప్రముఖ మీడియా సంస్థ పోల్

ఆసక్తికరంగా మారిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల మీద ప్రభావాన్ని కచ్ఛితంగా చూపించనున్నాయి. భవిష్యత్ రాజకీయాల్ని దిశానిర్దేశం చేసే ఈ ఫలితాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి వేళ.. ఒక ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఒపీనియన్ పోల్ వివరాల్ని వెల్లడించారు. ఉత్తరాదిన పేరున్న ఆనంద్ బజార్ పత్రిక.. సీ ఓటర్ అనే రెండు సంస్థలు కలిసి ఒపీనియన్ పోల్ నిర్వహించారు. దీని ప్రకారం …

Read More »

సూది మందంటే భయమున్న కేసీఆర్ వ్యాక్సిన్ వేసుకోరా?

తన వ్యూహాలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే ముఖ్యమంత్రిగా కేసీఆర్ కున్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని చెప్పే ఆయన.. తన గురించి తాను భలే గొప్పలు చెప్పుకుంటారు. ఏదైనా సీరియస్ ఇష్యూ తెర మీదకు వస్తే.. తాను అలా చేయకుంటే తల కోసుకుంటానని చెప్పేస్తుంటారు. అలా మాటలతో మనసుల్ని ప్రభావితం చేసే కేసీఆర్ కు సూది మందు అంటే చాలా …

Read More »

మిత్రపక్షాలకు కాలం చెల్లినట్లేనా ?

మిత్రపక్షాలైన బీజేపీ-జనసేన మధ్య విశాఖ ఉక్కు పెద్ద చిచ్చు పెట్టినట్లు సమాచారం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పొత్తుల విషయంలో తాము పునరాలోచించాల్సుంటుందని జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ డైరెక్టుగానే హెచ్చరించారు. అయితే నాదెండ్ల హెచ్చరికలను కేంద్రం ఏమాత్రం ఖాతరుచేయలేదు. ఎందుకంటే ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం మరింత జోరు పెంచింది. ప్రైవేటీకరణ అంశం …

Read More »

తెరవెనుక చక్రం తిప్పుతోందా ?

సరిగ్గా ఎన్నికల ముందు ఈమధ్యనే జైలు నుండి విడుదలైన వి. శశికళ తెరవెనుక నుండి చక్రం తిప్పుతున్నారా ? తమిళ రాజకీయాలను చూస్తుంటే అదే అనుమానం పెరిగిపోతోంది. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి తానే అని శశికళ ఎంత చెప్పుకున్నా సాధ్యమయ్యేట్లు కనిపించటం లేదు. ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో డీఏకే కూటమిదే అధికారం అని సర్వేలు చెబుతున్నాయి. జరుగుతున్న పరిణామాలు తనకు ఏమాత్రం ఆశాజనకంగా లేవని శశికళకు అర్ధమైపోయింది. దీంతో …

Read More »

మోడికి స్పీడుకు బ్రేకులు పడటం ఖాయమేనా ?

పశ్చిమబెంగాల్లో ఎన్నికల కుంపట్లు బాగా రగులుకుంటున్నది. ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీజేపీలు ఎన్నికల్లో గెలుపుకోసం ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో రెండు వైపుల అగ్రనేతలు రగిలిపోతున్నారు. ఇందులో బాగంగానే నరేంద్రమోడి తరపున అమిత్ షా+కేంద్రమంత్రులు, పార్టీ నేతలు మమతాబెనర్జీని టార్గెట్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఫైర్ బ్రాండ్ గా పేరున్న మమత కూడా అంతే స్ధాయిలో ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. వీళ్ళద్దరి …

Read More »

తిరుపతి మీద ఆశలు వదిలేసుకున్నట్లేనా ?

తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేసే ఆలోచనను బీజేపీ వదిలేసుకున్నట్లే అనుమానంగా ఉంది. ఎందుకంటే స్ధానిక బీజేపీ నేతల మనోభావలతోను, క్షేత్రస్ధాయిలో పరిస్ధితులతో ఏమాత్రం సబంధం లేకుండా, పట్టించుకోకుండా తనిష్టం వచ్చిన నిర్ణయాలను కేంద్రం తీసేసుకుంటోంది. విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయం ఇందులో భాగమే. రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఎంత ప్రయత్నించినా ఈ విషయమై మాట్లాడేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోంశాఖ మంత్రి అమిత్ షా …

Read More »

బెజ‌వాడ‌లో ఆ రెండు సామాజిక వ‌ర్గాలు ఎటు వైపు..?

అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌.. త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఇటీవ‌ల కాలంలో దాదాపు అన్ని సామాజిక వ‌ర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అగ్ర‌వ‌ర్ణాల్లో ఈ ఆవేద‌న ఎక్కువ‌గా ఉంది. పైగా వైశ్య‌, బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాలు ఈ విష‌యంలో మ‌రింత బాధ‌ప‌డుతున్నాయి. బెజ‌వాడ‌లో ఈ రెండు సామాజిక వ‌ర్గాలు ఎక్కువ‌. సెంట్ర‌ల్‌లో బ్రాహ్మ‌ణ‌, ప‌శ్చిమ‌లో వైశ్య‌లు ఎక్కువ‌గా ఉన్నారు. ప్ర‌స్తుతం కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో వీరు ఎవ‌రి వైపు మ‌ద్ద‌తుగా …

Read More »

ప్ర‌భుత్వంపై చండ్ర‌నిప్పులు..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఏపీ స‌ర్కారు స‌హా సీఎం జ‌గ‌న్‌పై నిప్పులు కురిపించారు. ఈ ప్ర‌భుత్వానికి పోయే కాలం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిరుప‌తిలో ప‌ర్య‌టించి పార్టీ శ్రేణుల‌తో భేటీ కావాల‌ని భావించిన చంద్ర‌బాబుకు తిరుప‌తి పోలీసులు అడ్డు చెప్పారు. న‌గ‌రంలోకి అనుమ‌తి లేద‌ని.. పోలీస్ యాక్ట్ 30 అమ‌ల్లో ఉంద‌ని.. బాబుకు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే.. ఈ హ‌ఠాత్ప‌రిణామం తో చంద్ర‌బాబు రేణిగుంట విమానాశ్ర‌యంలోనే భేటీ …

Read More »

వంటగ్యాస్ రాయితీని ఎత్తేస్తారా ?

ఒకపుడు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వంటగ్యాస్ రాయితికి ప్రస్తుత నరేంద్రమోడి సర్కార్ మంగళం పాడుతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. మోడి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వంటగ్యాస్ సబ్సిడీని బాగా తగ్గించేస్తున్నారు. ప్రభుత్వ రంగం సంస్ధలను తగ్గించేసి ప్రైవేటురంగానికి ప్రోత్సహం ఇవ్వాలనే అజెండాను మోడి ప్రభుత్వం అమలు చేస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా మోడినే వెబినార్ ద్వారా జరిగిన సమావేశంలో …

Read More »