తెలుగు ప్రజలకు షాకింగ్ వార్తగా చెప్పాలి. మీడియా మొఘల్ ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు ఆస్తమించారు. సుదీర్ఘకాలంగా మీడియారంగాన్ని శాసించిన ఆయన ఇక లేరు. ఈనాడు దినపత్రికతో తెలుగు వార్తా ప్రపంచంలో సంచలనాల్ని నమోదు చేసిన ఆయన.. ఈటీవీ చానళ్లతో పాటు.. డిజిటల్ ప్రపంచంలోనూ ఆయన తనదైన మార్కు వేశారు. తెలుగు రాజకీయాల్లో ఆయన తనదైన మార్క్ ను వేశారు. ఇటీవల గుండెకు స్టంట్ వేసిన అనంతరం.. …
Read More »ఏదీ మునుపటిలా ఉండదు.. మోడీ సర్!!
ఏదీ మునుపటిలా ఉండదు- ధూమపానంపై వచ్చిన ఓ యాడ్లో డైలాగ్ ఇది. ఇది .. ఇప్పుడు రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే.. కేంద్రంలో ఏర్పడనున్న నరేంద్ర మోడీ సర్కారుకు బొటా బొటీ మెజారిటీనే దక్కింది. అది కూడా..ఎన్డీయే భాగస్వామ్య పక్షాల చేరికతో సొంతంగా బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. మేజిక్ ఫిగర్ ప్రకారం.. మరికొన్ని పార్టీలు చేతులు కలిపాయి. వీటిలో చంద్రబాబు పార్టీ టీడీపీ నుంచి సొంతంగా 16 మంది …
Read More »ప్రమాణ స్వీకారం..మంగళగిరి కాదు.. గన్నవరమే!
తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ కూటమి సంబరాల్లో ఉంది. మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సారి జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి 164 స్థానాలు దక్కించుకుంది. ఒక్క టీడీపీనే కనీవినీ ఎరుగని విజయం దక్కించుకుని పోటీ చేసిన 144స్థానాల్లో 135 చోట్ల విజయం దక్కించుకుంది. దీంతో ఈ సారి చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని …
Read More »బీజేపీ విషయంలో రేవంత్ రెడ్డి చెప్పిందే నిజమైంది!!
సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని.. అంతేకాదు.. పెద్ద ఎత్తున మెజారిటీ కూడా దక్కించుకుంటుందని .. ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారంలో బీజేపీ అగ్ర నేతలు ఊదర గొట్టారు. దేశవ్యాప్తంగా 62 రోజులపాటు జరిగిన ప్రచా రంలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం.. ఇదే మాట చెప్పారు. ఎక్కడ మాట్లాడినా.. ఏటీవీవి ఇంటర్వ్యూ ఇచ్చినా.. ఇదే చెప్పారు. అంతేకాదు.. బీజేపీ ఒంటరిగానే …
Read More »మాకు సీఎంకు అడ్డుగోడ కట్టారు, అందుకే ఓటమి – కేతిరెడ్డి
ఏపీలో వైసీపీ దారుణ ఓటమిని ఊహించని ఆ పార్టీ నాయకులు.. షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అయితే.. ఈ ఓటమి విషయంలో కీలక నేతల వేళ్లన్నీ కూడా.. ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)పైనే కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల కింద ట రాజానగరం నియోజకవర్గంలో ఓడిపోయిన.. జక్కంపూడి రాజా మొదలుకుని.. తాజాగా ధర్మవరం నుంచి ఓడిపోయిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వరకు కూడా అందరూ సీఎంవోనే తప్పుబడుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన కొందరు అధికారులపై వారు …
Read More »‘బీపీ వచ్చి..’ వంశీ, కొడాలి ఇళ్లపై దాడులు.. కసి తీర్చుకుంటున్నారా?
తాజా ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని చెప్పిన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ నాయకులు ఘోరంగా ఓడిపో యారు. వారే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని. వీరిద్దరిపైనా టీడీపీ శ్రేణులకు పీకల వరకు ఆగ్రహం ఉంది. ఎందుకంటే.. రాజకీయంగా కంటే కూడా.. చంద్రబాబు కుటుంబాన్ని ఘోరంగా అవమానించారని శ్రేణులు ఆవేదనలో ఉన్నాయి. నిండు అసెంబ్లీలోనే.. వంశీ.. చంద్రబాబు సతీమణిపై …
Read More »వెంటిలేటర్ మీద మీడియా మొఘల్ రామోజీరావు?
మీడియా మొఘల్ చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈనాడు సంస్థల అధినేతగా సుపరిచితమైన ఆయన గడిచిన కొంతకాలంగా ఆయన అనారోగ్యంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఒక ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల గుండె సంబంధిత సమస్య కారణంగా స్టంట్ వేశారు. అనంతరం ఆయన కొద్దిగా కోలుకున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ రోజు సాయంత్రం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా మారింది. దీంతో.. …
Read More »అప్పుడు నో అపాయింట్మెంట్.. ఇప్పుడు ఫ్రీ టైమ్!
ఎంతలో ఎంత మార్పు. ఒకప్పుడు సొంత పార్టీ నాయకులనూ కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వని జగన్.. ఇప్పుడు పెద్దగా పని లేకపోవడంతో ఎవరు వచ్చినా కలుస్తున్నారని తెలిసింది. తాడేపల్లి కోటలో రాజులాగా భావించి, ఎవరినీ తన దగ్గరకు కూడా రానివ్వని జగన్.. ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నారని సమాచారం. అప్పుడేమో ఎవరడిగినా నో అపాయింట్మెంట్ అన్న జగన్.. ఇప్పుడు ఫ్రీ టైమ్ ఉంది రమ్మని అంటున్నారనే సెటైర్లు వినిపిస్తున్నాయి. జగన్ ఎన్నికల్లో గెలిచిన …
Read More »బీఆర్ఎస్ ప్లేస్లో టీడీపీ.. తెలంగాణలో బాబు వ్యూహం!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుల్ జోష్లో ఉన్నారు. అంతేకాకుండా టీడీపీ 16 ఎంపీ సీట్లు గెలవడంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలోనూ బాబుకు అధిక ప్రాధాన్యత లభిస్తోంది. దీంతో అటు బాబు, ఇటు టీడీపీ శ్రేణుల ఆనందానికి అంతేలేదు. ఈ సంతోషంలోనే ఇక తెలంగాణపై ఫోకస్ పెట్టాలని బాబు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఏపీలో తిరిగి అధికారం దక్కింది. ఇకపై తెలంగాణలోనూ …
Read More »కెజిఎఫ్ రేంజులో పవన్ కళ్యాణ్ ఎలివేషన్లు
ఎవరైనా బోలెడు పిండి వంటలు, నోరూరించే పదార్థాలతో పెద్ద పళ్లెంలో మంచి ఆకలి మీదున్నప్పుడు వడ్డించారనుకోండి. ఎలా ఫీలవుతాం. ఆవురావురమంటూ తినేస్తాం. తర్వాత భుక్తాయాసంతో ఆమ్మో అయ్యో అంటూ ఈనో లేదా సోడానో తాగేందుకు పరిగెడతాం. పవన్ కళ్యాణ్ అభిమానుల పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి రోజుకో ఎలివేషన్ వీడియో, ఫోటోలతో ఉక్కిరిబిక్కిరయిపోతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి అన్నావదినతో పాటు …
Read More »మోడీ తగ్గారు.. కానీ, మాటలే తగ్గలేదు!
ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మోడీ 400 సీట్లు తమకు రాబట్టుకుంటామని చెప్పుకొచ్చారు. కానీ, ఆ మేరకు ఆయన రాబట్టుకోలేకపోయారు. అంతేకాదు. గత 2019 ఎన్నికల్లో బీజేపీకి ఒక్క పార్టీకే. 303 సీట్లు వచ్చాయి. మిత్రపక్షాలతో కలిసి.. ఇది 400 దాటి పోయింది. దీంతో ఇప్పుడు కూడా. తమకు సీట్లు వస్తాయని అనుకున్నారు. కానీ, ఆమేరకు రాలేదు . సరికదా.. అసలు బీజేపీకి 240 దగ్గరకే ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టారు. …
Read More »వణికిస్తున్న రెడ్బుక్.. ప్రసన్నం కోసం అధికారుల క్యూ!
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఓడలు బడ్లవడం.. బడ్లు ఓడలవడం రాజకీయాల్లో కామనే. ఎంతటి మహామహులకైనా ప్రజల చేతుల్లో ఓటమి తప్పలేదు. అధికారంలో ఉన్నామని విర్రవీగితే పాతాళానికి పడిపోవడం ఖాయం. ఇక అధికారంలోని ప్రభుత్వం అండ చూసుకుని రెచ్చిపోయే అధికారులు కూడా కాలం ఒకేలా ఉండదు అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఏపీలోని ఇలాంటి కొంతమంది అధికారులు ఇప్పుడు వణికిపోతున్నారని తెలిసింది. జగన్ అండతో, ఆదేశాలతో పోలీసులు, అధికారులు రెచ్చిపోయారు. టీడీపీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates