టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కొన్ని విషయాల్లో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరి స్తున్నారు. గతానికి ఇప్పటికీ.. పాలన విషయంలోనూ, రాజకీయాల విషయంలోనూ ఆయనలో చాలా మార్పు కనిపించింది. గతంలో ఎలా వ్యవహరించినా.. అప్పటి సంగతి వేరు. కానీ, ఇప్పుడు ఓడిపోయిన ప్పటికీ వైసీపీ బలంగా ఉండడం.. 40 శాతం ఓటు బ్యాంకుతో క్షేత్రస్థాయిలో నిలదొక్కుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిని తక్కువగా అంచనా వేసేందుకు వీల్లేదు.
అందుకే చంద్రబాబుకూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో తన వ్యక్తిగత విషయాలకు, వ్యక్తిగత రాజకీయాలకు కూడా ప్రాధాన్యం తగ్గించి.. తన మిత్ర పక్షాలు ఎలా అయితే, నడు స్తున్నాయో.. అలానే చంద్రబాబు కూడా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో చిన్న చిన్న విషయాలను ఆయన పక్కన పెట్టారు. తన పాదాలకు నమస్కారాలు చేయొద్దని చెప్పారు. దీంతో తమ్ముళ్లు కొంత మేరకు వెనక్కి తగ్గారు. ఇక, కొన్నికొన్ని రాజకీయ విషయాల్లోనూ చంద్రబాబు నిర్ణయాలు ఆశ్చర్యంగా ఉన్నాయి.
తాజాగా సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో సంచలన తీర్పు ఇచ్చింది. సహజంగా ఇలాంటి తీర్పులు ఇచ్చినప్పుడు చంద్రబాబు తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఏం జరిగినా.. అది నావల్లే జరిగిందని.. నేను ముందే చేశానని చెప్పుకోవడం ఆయన కు సహజంగా వచ్చిన రాజకీయం. అయితే.. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్చు ఇచ్చిన తర్వాత.. ఈ సాహసం చంద్రబాబు చేయలేక పోయారు. నిజానికి ఆయన ఎస్సీ వర్గీకరణకు అనుకూలం.
ఇదే విషయాన్ని మంద కృష్ణ మాదిగ కూడా చెప్పారు. చంద్రబాబు ముందుగానే ఎస్సీ వర్గీకరణకు ఓకే చెప్పారని అన్నారు. అలాంటిది చంద్రబాబు చూచాయగా స్పందించారే తప్ప.. ఎక్కడా కూడా తన క్రెడిట్‌ను ప్రస్తావించలేకపోయారు. దీనికి కారణం.. మోడీనేనని అంటున్నారు టీడీపీ నాయకులు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ ఇప్పటి వరకు ఒక స్టాండ్ తీసుకోలేదు. దీనిని రాజకీయంగా మున్ముందు ఎలా వాడుకోవాలనే విషయంలో ఆలోచనలో పడింది.
ఇప్పుడు చంద్రబాబు కూడా అదే ఫార్ములాతో ఉన్నారు. బీజేపీ అనుసరించే వ్యూహాన్ని బట్టి స్పందించాలని నిర్ణయించుకున్నారు. సో.. కీలకమైన విషయంలో చంద్రబాబు ఇలా మారడం తమ్ముళ్లకు సైతం ఆశ్చర్యంగానే ఉంది.