నిత్యం నిప్పులు చెరుగుతూ.. తన కంటిపైకునుకు లేకుండా చేస్తున్న సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల విషయంలో జగన్ నాలుగు కాదు..నలభై అడుగులు వెనక్కి వేస్తున్నారన్న విషయం తెరమీదికి వచ్చింది. ఆమెకు ఆస్తుల్లో పంపకాలను.. చేసేయాలని, ఆమె కోరుకున్న విధంగానే ఇచ్చేయాలని జగన్ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన బెంగళూరు వేదికగా సెటిల్‌మెంట్ కూడా జరిగిపోయిందని అంటున్నారు. అయితే.. ఇప్పటి వరకు.. జగన్ మొండిగా ఉన్న ఈ విషయంలో ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారన్నది ప్రశ్న.
ఈ విషయంపై రెండు రకాల చర్చలు జరుగుతున్నాయి. 1) పార్టీ కోసం జగన్ ఇలా దిగివచ్చారని కొందరు చెబుతున్నారు. కానీ, జగన్ వ్యవహార శైలిని గమనిస్తే.. ఆయన పార్టీ విషయంలో ఇలా రాజీ పడే ధోరణి ఉన్న నాయకుడు కాదు. పార్టీలో ఎంతో మంది వచ్చారు. ఎంతో మంది పోయారు. మరింత మంది పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాలు ఆయనకు తెలుసు. ఆయన పెట్టుకున్న పార్టీ కాబట్టి.. ఆయనకు సాధికారత ఉంటుంది. సో.. పార్టీ కోసమైతే.. ఇలా దిగివచ్చే అవకాశం లేదని చాలామంది చెబుతున్నారు.
2) అవినాష్ కోసమని మెజారిటీ వర్గాలు భావిస్తున్నాయి. సొంత బాబాయి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఆది నుంచి కూడా జగన్ ఆయనను వెనుకేసుకు వస్తున్నారు. ఎన్నికలకు ముందు ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. తప్పు చేయలేదని తాను నమ్మినందుకే అవినాష్‌కు మద్దతిచ్చానని చెప్పారు. కానీ, ఈ విషయాన్ని చెప్పాల్సిన సీబీఐ.. అవినాష్ కీలక నిందితుడని పేర్కొంటోంది.
ఇక, దీనినే షర్మిల సహా వివేకా కుమార్తె సునీతలు కూడా హైలెట్ చేశారు. ఎన్నికల సమయంలో తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. కట్ చేస్తే.. సీబీఐ కూడా ఈ కేసును త్వరగా పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తమ్ముడిని కాపాడేందుకు.. జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారన్నది మెజారిటీ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. దీనిలో భాగంగానే ఆస్తుల పంపకం సహా.. ఏమైనా చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అవినాష్ అప్రూవర్‌గా మారితే.. ఇంకేమైనా జరిగే అవకాశం కూడా ఉందన్న ఆలోచనతోనే.. జగన్ ఇలా దిగివచ్చినట్టు చెబుతున్నారు. మరి దీనివెనుక నిజానిజాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.