రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాదాపు ఒకే మాట చెప్పుకొని రావడం.. కలసి కూర్చుని చర్చించుకుంటే.. సమస్యలు పరిష్కరించుకోవచ్చన్న దిశగా ఆలోచన చేయడం.. ప్రస్తుతం నెలకొన్న సమస్యల పరిష్కారానికి శుభసంకల్పమేనని అంటున్నారు పరిశీలకులు. ఇరు రాష్ట్రాల మధ్య గత ఆరు మాసాలుగా నీళ్లు నిప్పులుగా మారాయి.
పోలవరం-బనకచర్ల నుంచి నాగార్జున సాగర్‌వరకు.. అనేక ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ, ఏపీల మధ్య వివాదం కొనసాగుతోంది. గోదావరి నీటిలో మిగులు జలాలను వాడుకుంటే తప్పేంటని ఏపీ, అలా ఎలా వాడతారని తెలంగాణ.. ఇక, నాగార్జున సాగర్‌లో ఏకమొత్తంగా తెలంగాణ అధిక నీటిని వినియోగించుకుంటోందని ఏపీ ఇలా.. ఏపీ తెలంగాణల మధ్య వివాదాలు మొదలై.. ఇప్పుడు రాజకీయంగా కూడా విమర్శలకు అవకాశం ఇచ్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఒకే రోజు.. వేర్వేరు వేదికలపై నుంచి సమస్యలను పరిష్కరించుకునేందుకు చర్చలే మార్గమని ప్రకటించారు. ఇదేసమయంలో ఘర్షణలతో పోయేది తప్ప.. వచ్చేది కూడా లేదని ప్రకటించారు. మరీ ముఖ్యంగా ఈ ప్రతిపాదన విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఒకే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. దీనిని రాజకీయ రగడగా మార్చితే.. ప్రభుత్వాలకు నష్టమని గుర్తించారు. ఈ క్రమంలోనే కూర్చుని చర్చించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
గతంలోనూ..
అయితే.. ఇలా సీఎంలు చర్చించుకోవడం.. ఇప్పుడే కాదు.. గతంలో కేసీఆర్, జగన్ కూడా రెండు సందర్భాల్లో జల వివాదాలపై చర్చించుకున్నారు. కానీ, ఎక్కడా ఫలితం రాలేదు. ఆశించిన మేరకు కూడా చర్చలు జరగలేదు. కానీ.. దీనికి భిన్నంగా ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తే. తప్ప.. ఫలితం వచ్చేలా కనిపించడం లేదన్న చర్చ సాగుతోంది. మరి ఆదిశగా అడుగులు వేస్తారా? లేదా? అనేది చూడాలి.
పట్టు విడుపులు!
+ ప్రధానంగా పట్టువిడుపుల ధోరణి ఉంటే తప్ప.. చర్చలు సఫలం కావు.
+ కానీ.. ఈ దిశగా రాష్ట్రాలు అడుగులు వేస్తాయా? అనేది ప్రశ్న.
+ ఎవరికి వారికి తమ తమ రాష్ట్రాలు ముఖ్యం. ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.
+ దీనికి తోడు.. రాజకీయ కారణాలు కూడా కనిపిస్తున్నాయి.
+ చర్చల్లో ఏ చిన్న తేడా వచ్చినా.. రాజకీయంగా వాడుకునేందుకు ప్రతిపక్షాలు ఉన్నాయి.
+ ఈ నేపథ్యంలో చర్చలకు కూర్చున్నా.. పట్టువిడుపుల ధోరణి ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates