టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , టీడీపీ నేత నారా లోకేష్ పై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోల్లో రాళ్లు వేసిన వారేవరో తేల్చేందుకు తమ సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. వైసీపీ వాళ్లే కనుక రాళ్లు వేసినట్లు రుజువు అయితే కనుక ఈ క్షణాన రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. టీడీపీ వారి దగ్గర …
Read More »తుమ్మలపై ఒత్తిడి పెరిగిపోతోందా ?
మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మద్దతుదారుల ఒత్తిడి పెరిగిపోతోంది. పాలేరులో పోటీచేసేందుకు బీఆర్ఎస్ లో తలుపులు మూసుకుపోయిన విషయం తెలిసిందే. టికెట్ తనకే వస్తుందని తుమ్మల పెద్ద ఆశలే పెట్టుకున్నారు. అయితే ఫిరాయింపు ఎంఎల్ఏ కందాళం ఉపేందర్ రెడ్డికే టికెట్ అని కేసీయార్ ప్రకటించారు. దాంతో తుమ్మల ఆశలన్నీ ఆవిరైపోయాయి. దాంతో మద్దతుదారులంతా మండిపోతున్నారు. ఇంతగా అవమానించిన బీఆర్ఎస్ లో ఎందుకు ఉండాలని తుమ్మలను నిలదీస్తున్నారు. పిలిచి టికెట్ ఇస్తానని చెబుతున్న …
Read More »కాంగ్రెస్ కే కామ్రెడ్లు జై కొట్టారా ?
కామ్రెడ్లకు కాంగ్రెస్ కు జై కొట్టక వేరేదారిలేదు. కేసీయార్ చేసిన నమ్మకద్రోహాన్ని తట్టుకోలేకపోతున్నారు. పొత్తుల పెట్టుకుంటామని నమ్మించి చివరినిముషంలో కేసీయార్ తమను మోసం చేశారని సీపీఐ, సీపీఎం కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం మండిపోతున్నారు. ఈ విషయాన్ని వాళ్ళు మీడియా సమావేశంలోనే చెప్పారు. విచిత్రం ఏమిటంటే తమలోని తప్పులను దాచుకుని తప్పంతా కేసీయార్ మీద తోసేస్తున్నారు. అసలు కేసీయార్ ను నమ్మటమే వీళ్ళు చేసిన అతిపెద్ద తప్పు. అవసరానికి …
Read More »28న ఢిల్లీకి వెళుతున్నారా ?
వైఎస్సార్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఈనెల 28వ తేదీన ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కబురుపంపింది. 28 న ఢిల్లీకి వచ్చి తమతో భేటీకి అందుబాటులో ఉండాలని సమాచారం అందించిందట. అలాగే తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్కను కూడా ఢిల్లీకి రమ్మని ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపిని విలీనం చేసే విషయమై గడచని రెండు నెలలుగా చర్చలు జరుగుతున్న విషయం అందరికీ …
Read More »ఒకటే సీటు.. మైనంపల్లి దారెటు?
మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పరిస్థితి ముందు గొయ్యి వెనుకు నుయ్యి లాగే మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి హరీష్ రావుపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేసి మైనంపల్లి ఇబ్బందులు కొని తెచ్చుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మింగలేక కక్కలేక ఏం చేస్తారన్నది చూడాలన్న టాక్ ఉంది. మరోసారి మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు మైనంపల్లి హన్మంతరావుకు కేసీఆర్ అవకాశం కల్పించారు. కానీ మైనంపల్లి తనయుడు రోహిత్ మెదక్ …
Read More »ఎన్నికల్లో పోటీపై తేల్చేసిన వీవీ లక్ష్మీనారాయణ
సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేదు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ చేసిన సందర్భంగా ఈయన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. అత్యంత నిజాయితీపరుడిగా, సమర్థవంతమైన అధికారిగా వివి లక్ష్మీనారాయణకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అందుకే, స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్మీనారాయణను తమ పార్టీలో చేర్చుకునేందుకు దాదాపుగా ఏపీలోని అన్ని పార్టీలు ప్రయత్నం చేశాయి. …
Read More »నా జీవితం అంతా జగన్ వెంటే: పోసాని
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు నారా లోకేష్ పై వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను చంపేందుకు లోకేష్ కుట్ర పన్నారు. కోర్టుకు హాజరయ్యే క్రమంలో తనను చంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. లోకేష్ తనపై రూ.4 కోట్లు పరువు నష్టం దావా వేశారని ఫైర్ అయ్యారు. లోకేష్‌పై పరువు నష్టం దావా వేస్తే కనీసం 20 ఏళ్లు …
Read More »120 ఎకరాలు కాజేసేందుకు ఏ2 కుట్ర: అయ్యన్న పాత్రుడు!
రాష్ట్రంలో ఉన్న భూములన్నింటిని దొంగలకు ముద్దాయిలకు దోచిపెడుతూ రానున్న తరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు. ఏపీలో జరుగుతుంది ప్రజా పాలన కాదు. ఓ నిరంకుశ పాలన అంటూ మండిపడ్డారు. ఏపీలో ఇంతా జరుగుతున్న మేధావులు, విజ్ఙానులు, ప్రజా సంఘాల నాయకులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో …
Read More »‘కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదు’
స్టేషన్ ఘన్ పూర్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వెక్కి వెక్కి ఏడ్చారు. మంగళవారం క్యాంపు ఆఫీస్ లో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఒక్కసారిగా బోరున విలపించారు. తరువాత కార్యకర్తలతో కలిసి ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ స్టాట్యూ ముందు పడుకొని వెక్కి వెక్కి ఏడ్చారు. తరువాత కార్యకర్తలతో మాట్లాడుతూ..కేసీఆర్ తనకు ఉన్నత స్థానం కల్పిస్తామన్నారని అన్నారు. ఇప్పుడున్న స్థానం …
Read More »గంప నెత్తిన ఎంపీ టోపీ
కేసీఆర్ కోసం సీటు త్యాగం చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎంపీ కాబోతున్నారా? ఆయన్ని ఎంపీగా గెలిపించుకోవడానికి కేసీఆర్ సిద్ధమయ్యారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. కామారెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ తన స్థానాన్ని వదులుకోక తప్పదు. అయితే ఇప్పటికే గంపను …
Read More »అంతా సంస్కారహీనుడిని కాను: కొడాలి నాని!
రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులకు ఎంతో ముఖ్యమైన రోజు ఆగస్టు 22. సంక్రాంతి తరువాత మెగా అభిమానులకు అంత పెద్ద పండగ ఏదైనా ఉంది అంటే..అది మెగాస్టార్ పుట్టిన రోజే. ఈ వేడుకను అభిమానులు ఎంతో ఘనంగా వేడుకగా జరుపుకుంటారు. ఇందులో భాగంగానే గుడివాడలో కూడా చిరు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వచ్చారు. …
Read More »పట్నంకు అలా గాలమేశారా?
రాజకీయ నీతిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తిరుగులేదనే పేరుంది. చాణక్య నీతితో ఎప్పుడు ఎవరిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలన్నది కేసీఆర్కు బాగా తెలుసని చెబుతుంటారు. తాజాగా తాండూరు నియోజకవర్గంలో పట్నం మహేందర్రెడ్డిని కేసీఆర్ దారిలోకి తేవడమే ఇందుకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇప్పిస్తామనే ఆశ చూపి నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు లేకుండా కేసీఆర్ చేశారని టాక్. తాండూర్లో పట్నం మహేందర్రెడ్డి, పైలట్ …
Read More »