మన లోపాలను మనం గుర్తించుకోవడం విజ్ఞత. మన గొప్పలను ఇతరులు గుర్తించడం గొప్ప. కానీ, వైసీపీ అధినేత.. తనకు తానే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ.. తనకు తానే సన్మానాలు చేయాలని కోరడం ద్వారా.. వైసీపీ నాలుగు కాదు.. నలభై మెట్లు దిగజారిపోయిందన్న చర్చ సాగుతోంది. ఒకవైపు విద్యుత్ విషయంలో లంచాల వ్యవహారం తెరమీదికి వచ్చింది.
దీనికి జగన్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ, ఆయన ఈ విషయాన్ని వదిలేసి.. తనకు సన్మానాలు చేయాలని.. శాలువాలు కప్పాలని, అవార్డులు ఇవ్వాలంటే తనకే ఇవ్వాలని కోరుకున్నారు. ఇలా అను కుంటే.. చంద్రబాబుకు అనేక శాలువాలు కప్పి.. అనేక అవార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే.. విభజిత రాష్ట్రంలో రాజధానిగా.. అమరావతిని ఎంచుకున్నారు. ఇక్కడ హైకోర్టు కట్టించారు. సచివాలయాలు నిర్మించారు. రోడ్డు వేయించారు. కానీ, జగన్ హయాంలో ఒక్కటి జరగలేదు.
అంతేకాదు… జగన్ హయాంలో నిర్వహించిన శాసన సభ, మండలి సమావేశాలు కూడా.. చంద్రబాబు నిర్మించిన భవనాల్లోనే సాగాయి. కాబట్టి.. చంద్రబాబుకే శాలువాలు కప్పాలని అంటున్నారు తమ్ముళ్లు. ఇక, పార్టీ పరంగా కూడా.. ముందుండి నడపడంలో చంద్రబాబు విజ్ఞతకు మార్కులు పడుతున్నాయి 70 + వయసులో కూడా ఆయన అలుపెరగకుండా.. పార్టీకోసం పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. కానీ, జగన్ 50+లో అడుగు కూడా బయటకు వేయడం లేదు.
ఇలా.. అనేక ఉదాహరణలు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇక, తమ్ముళ్ల మాట ఎంత చెప్పుకొన్నా తనివి తీరదు. ఇలా.. సొంత డబ్బా అనవసరంగా కొట్టుకుని వైసీపీ అధినేత తనను తాను డైల్యూట్ చేసుకుని.. వైసీపీ ఫైర్ తగ్గించేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. పార్టీని ముందుకు నడిపించేందు కు దృష్టి పెట్టాల్సిన ఆయన.. ఇలా శ్వోత్కర్షలు, పరనిందలతో కాలక్షేపం చేస్తే.. మరింత పరువు పోవడం ఖాయమని చెబుతున్నారు. మరి ఇప్పటికైనా ఆయన కు జ్ఞానోదయం కలుగుతుందో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates