వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డులో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని.. అందులో జంతువుల కొవ్వుల తాలూకు అవశేషాలు ఉన్నాయని కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు, బయటపెట్టిన ల్యాబ్ రిపోర్టులు ఎంత సంచలనం రేపుతున్నాయో తెలిసిందే. నాలుగైదు రోజులుగా దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశం అవుతోంది. జాతీయ మీడియా సైతం ఈ విషయం మీద చర్చలు పెట్టింది. తిరుమల శ్రీవారిని దేశవ్యాప్తంగా కొలిచే భక్తులు ఈ విషయమై విస్మయం …
Read More »ఈ సృజన్ రెడ్డి ఎవరు? కేటీఆర్ పొరబడ్డారా?
కేంద్ర ప్రభుత్వం అమ్రత్ పథకం నిధుల్లో రూ.8888 కోట్ల అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణ హాట్ టాపిక్ గా మారింది. అదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి చెందిన సంస్థకు కాంటాక్టు ఇచ్చినట్లుగా కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం స్పందిస్తే రేవంత్ రెడ్డి పదవి పోవటం ఖాయమన్న కేటీఆర్.. ఎన్నికల వేళ ఆర్ఆర్ట్యాక్స్ పై మోడీ వ్యాఖ్యలు.. తాము ఆధారాలతో చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇదే సమయంలో …
Read More »ఆదివారం ఉదయాన్నే హైడ్రా బుల్డోజర్ కుకట్ పల్లికి!
గడిచిన కొద్దిరోజులుగా హైడ్రా కూల్చివేతల హడావుడి లేదు. వినాయక చవితి పండుగ సందర్భంగా కాస్తంత గ్యాప్ ఇచ్చినప్పటికి.. ఈ వీకెండ్ కూల్చివేతలు ఖాయమన్న అంచనాలకు తగ్గట్లే.. ఆదివారం ఉదయాన్నే కూల్చివేతలు మొదలయ్యాయి. అయితే.. ఇందులోనూ ఒక ట్విస్టు ఉంది. హిమాయత్ సాగర్ చెరువు పరిధిలోని అక్రమ కట్టడాలపై కన్నెర్ర ఖాయమన్న మాట వినిపించింది. అది కూడా కాదంటే మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా బుల్డోజర్లు హడావుడి చేయటం ఖాయమంటూ వార్తలు …
Read More »తొలిసారి వైఎస్ భారతిని టార్గెట్ చేసిన చంద్రబాబు
రాజకీయ అంశాల విషయానికి వస్తే.. ఎవరెన్ని అన్నా.. మరెంతగా విమర్శించినా టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక గీత దాటి ముందుకు వెళ్లేందుకు సుతారం ఇష్టపడరు. రాజకీయంగా తన ప్రత్యర్థుల మీద విమర్శనాస్త్రాల్ని సంధించే ఆయన.. వారి కుటుంబ సభ్యుల జోలికి వెళ్లరు. వారి గురించి మాట్లాడరు. అసలు అలాంటి ఆలోచనకు తావివ్వరు. అలాంటి చంద్రబాబు తొలిసారి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ …
Read More »జగన్‌తో మోహన్ బాబు కటీఫ్?
టాలీవుడ్ లెజెండరీ నటుడు మోహన్ బాబు ఒకప్పుడు నారా చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. కానీ మధ్యలో ఆయనతో విభేదాలు వచ్చాయి. 2019 ఎన్నికల ముంగిట తమ కాలేజీకి ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంపై చంద్రబాబుకు వ్యతిరేకంగా రోడ్డెక్కి పోరాటం చేయడమే కాక.. వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు మోహన్ బాబు. జగన్‌కు సోదరి వరుస అయ్యే వెరోనికాను మంచు విష్ణు పెళ్లి చేసుకున్న నేపథ్యంలో జగన్ …
Read More »జగన్ బయటికొచ్చాడు.. మళ్లీ అదే కథ
ఐదేళ్ల పాటు అంతులేని అధికారం అనుభవించాక.. ప్రతిపక్షంలో కొనసాగడం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి చాలా కష్టంగానే అనిపిస్తున్నట్లుంది.ప్రతిపక్షంలో ఉన్నపుడు నిరంతరం ప్రజల్లో ఉంటూ మన మనిషి అనిపించుకున్నాడు. కానీ అధికారంలోకి రాగానే తాడేపల్లి ప్యాలెస్‌కు పరిమితం అయిపోయి జనానికి దూరం అయిపోయాడు. తిరిగి ప్రతిపక్షంలోకి వచ్చాక మళ్లీ ఒకప్పట్లా జనాల్లోకి వెళ్తాడనుకుంటే అలాంటిదేమీ జరగట్లేదు. అప్పుప్పడూ మొక్కుబడిగా జనాల్లోకి వచ్చి ప్రభుత్వం మీద బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నారు కానీ.. …
Read More »లడ్డూ కల్తీ..వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్
తిరుపతి లడ్డూలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ లోని ల్యాబ్ ఇచ్చిన అధికారిక నివేదిక ప్రకారం చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారు. గతంలో కూడా కొందరు భక్తులు లడ్డు నాణ్యతపై, శుభ్రతపై ఫిర్యాదు చేయడంతో ల్యాబ్ కు పంపించి లడ్డు నాణ్యతను పరీక్షించడంతో ఈ విషయం బట్టబయలైంది. అయితే, తిరుపతి లడ్డు పై …
Read More »తిరుమలలో భక్తులను జగన్ దోచుకున్నారు: రఘురామ
జగన్ హయాంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అనేక చర్యలు జరుగుతున్నాయని ఆనాడు ఆ పార్టీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయిన తర్వాత తిరుమల కొండతో పాటు ఏపీలో క్రిస్టియానిటీ పెరిగిందని, ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని ఆయన కేంద్రంలోని బీజేపీ పెద్దలకు కూడా పలుమార్లు లేఖ రాశారు. కట్ చేస్తే ఆ రోజు రఘురామ ఆరోపించిన విధంగానే తిరుమల …
Read More »చంద్రబాబుపై లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగో సారి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. జగన్ పాలనలో అతలాకుతలమైన రాష్ట్రానికి చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అవసరముందని గుర్తించిన ప్రజలు ఆయనను ఏరి కోరి ఎన్నుకున్నారు. అందుకే, తనను నమ్ముకున్న ప్రజల కోసం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడను వరదలు అతలాకుతలం చేస్తే వరద బాధితులకు నేనున్నాను అని చంద్రబాబు అండగా నిలిచారు. ఏడు …
Read More »లడ్డూ వివాదంతో రాజస్థాన్ సీఎం అలర్ట్
హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు, నెయ్యి కలిపారన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. కమీషన్లకు కక్కుర్తి పడి ఆ తరహా నెయ్యిని గత ప్రభుత్వం లడ్డూ తయారీలో వాడిందని సాక్ష్యాత్తూ ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ నిర్వాకంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా …
Read More »ఆదిమూలం రేప్ కేసులో బిగ్ ట్విస్ట్
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను బెదిరించి తనపై ఆదిమూలం అత్యాచారం చేశారని ఆ మహిళ ఆరోపించడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానం పార్టీ నుంచి ఆదిమూలంను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆదిమూలంపై తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని సదరు మహిళ కోర్టులో …
Read More »లడ్డు గొడవ.. వైసీపీని ఎందుకు నమ్మట్లేదు?
గత ఐదేళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తిరుమల లడ్డు నాణ్యత పడిపోయిందని.. లడ్డు తయారీలో వాడిన నెయ్యలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని కొత్త అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. తిరుమల శ్రీవారిని దేశవ్యాప్తంగా కోట్ల మంది కొలుస్తారు. ఇక్కడి లడ్డును పరమ పవిత్రంగా భావిస్తారు. దాని విషయంలో తప్పు జరిగిందనేసరికి భక్తులు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates